పండుగల వేళ ఆన్‌లైన్ షాపింగ్‌లు జాగ్రత్త సుమీ!

Posted By:

పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఆన్‌లైన్ మోసాలు విజృంభించే అవకాశముందని ఆన్‌లైన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీపావళి, క్రిస్టమస్ పండుగులను పురస్కరించకుని ఆన్‌లైన్ షాపింగ్ చేయాలనకుంటున్న నెటిజనులకు పలు జాగ్రత్తలు. ఇండియా వంటి దేశాల్లో ఆన్ లైన్ షాపింగ్ గణనీయంగా విస్తరిస్తోంది. హ్యాకర్లు ఇదే అదునుగా భావించి మోసపూరిత పండుగ ఆఫర్లను ఎరచూపి ఆన్‌లైన్ షాపర్లను దోచుకునే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి షాపర్లు ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయబోయే ఉత్పత్తుల ఆఫర్లకు సంబంధించి ఆచితూచి వ్యవహరించటం మంచిది.

పండుగల వేళ ఆన్‌లైన్ షాపింగ్‌లు జాగ్రత్త సుమీ!

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇదే అదునుగా భావించే హ్యాకర్లు మీ నుంచి నగదు లేదా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ఫేక్ వెబ్‌సైట్‌లను సృష్టించే అవకాశాల ఉన్నాయి. కాబట్టి ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించండి.

- మీ ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా విశ్వసనీయ రిటైలింగ్ వెబ్‌సైట్‌లను మాత్రమే ఎంపిక చేసుకోండి. తెలియని వెబ్‌సైట్‌ల జోలికి పోవద్దు.

- ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని మీరు డౌన్‌లోడ్ చేసుకునే వాల్ పేపర్లు ఇంకా అప్లపికేషన్‌లు విషయంలోనూ అప్రమత్తత అవసరం. తెలివిగల హ్యాకర్లు ఈ విధమైన మార్గాల ద్వారానే మాల్‌వేర్ పంపించి మీ డివైజ్‌లోని డేటాను ధ్వంసం చేసే అవకాశముంది.

- ఈ పండుగ గడియలను అదునుగా తీసుకుని పండుగ శుభాకాంక్షల పేరుతో వైరస్‌ను మీమీ మెయిళ్లకు పంపే అవకాశముంది. కాబట్టి బీ అలర్ట్.

మరిన్ని చిట్కాలు:

ఆన్‌లైన్ షాపింగ్ విశ్వసనీయ వెబ్‌సైట్‌లను మాత్రమే ఎంపిక చేసుకోండి. యూజర్ నేమ్ ఇంకా పాస్‌వర్డ్‌లను బహిర్గతం చేయవద్దు. ఆఫర్ల మోజులో పడి అనవసర వెబ్ లింక్‌ల పై క్లిక్ చేయవద్దు. ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లలో అనవసరంగా మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయవద్దు. సెక్యూరిటీ కోడ్ విషయంలో జాగ్రత్త వహించండి. ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించి క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డుల ద్వారా చెల్లించిన మొత్తానికి సంబంధించిన లావాదేవీలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మీరు కోనుగోలు చేసే వస్తువు డెలివరీకి సంబంధించి పూర్తి వివరాలను క్షున్నంగా తెలుసుకోండి. వస్తువు డెలివరీకి సంబంధించి ఖచ్చితమైన చిరునామాను ఇవ్వండి. షాపింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఆకౌంట్‌లను లాగ్‌అవుట్ చేయటం మరవద్దు. యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను మీ పీసీలో ఇన్స్‌స్టాల్ చేయటం మరవద్దు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot