Home
News

Amazon CEO మెగాయాచ్ కోసం 100సంవత్సరాలనాటి చారిత్రాత్మక వంతెన కూల్చివేత

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ యొక్క అధినేత మరియు ఫౌండర్ జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరులలో మొదటి వరుసలో ఉన్నారు. గత ఒక సంవత్సరం నుంచి జెఫ్ బెజోస్ తరచుగా వార్తలలో నిలుస్తూ ఉన్నాడు. ముఖ్యంగా అంతరిక్ష ప్రయాణం, భార్యతో విభేదాల కారణంగా విడాకులు తీసుకోవడం వంటి వార్తలు దావనంగా అమలయ్యాయి. ఇప్పుడు మరొక మరొక కొత్త విషయంతో మళ్ళి వార్తలలో నిలిచాడు. విషయానికి వస్తే జెఫ్ బెజోస్ యొక్క కొత్త మెగాయాచ్‌ను చాలా పెద్దదిగా నిర్మిస్తున్నారు. ఇందులో పెద్ద విషయం లేకపోయినప్పటికీ దీనిని సముద్రంలోకి చేర్చడానికి ఒక చారిత్రాత్మక వంతెనను వేరుచేయవలసి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మెగాయాచ్‌

జెఫ్ బెజోస్ యొక్క కొత్త మెగాయాచ్‌ను అతి పెద్ద పరిమాణంలో డచ్ నగరంలో నిర్మిస్తుండడంతో ఈ నగరంలో ఒక చారిత్రాత్మక వంతెనలో కొంత భాగాన్ని తీసివేస్తే తప్ప అది సముద్రంలోకి వెళ్లదు. ఈ మెగాయాచ్‌ యొక్క విషయానికి వస్తే 417 అడుగుల పొడవు గల ఈ ఓడ ప్రస్తుతం నెదర్లాండ్స్‌లోని అల్బ్లాసెర్డామ్ నగరంలో నిర్మించబడుతుందని డచ్ బ్రాడ్‌కాస్టర్ రిజ్న్‌మండ్ మంగళవారం నివేదించింది. ఇది పూర్తయిన తర్వాత సముద్రంలోకి చేరుకోవడానికి యూరప్ యొక్క సముద్ర రాజధానిగా పరిగణించబడే రోటర్‌డ్యామ్ గుండా వెళ్లాలి.

జెఫ్ బెజోస్

జెఫ్ బెజోస్ యొక్క కొత్త మెగాయాచ్‌ మూడు మాస్ట్‌లతో 131 అడుగుల ఎత్తుతో ఉంది. అయితే దీనిని సముద్రంలోకి తరలించడానికి ఒకే ఒక సమస్య ఉంది. ఈ మెగాయాచ్‌కు అన్ని రకాల క్లియరెన్స్ ఉన్నప్పటికీ రోటర్‌డ్యామ్‌లోని కోనింగ్‌షేవెన్ బ్రిడ్జ్ కిందకి వెళ్లడానికి వీలులేకుండా ఉంది. దీనికి కారణం యాచ్ యొక్క మాస్ట్‌లు అధిక పొడవు ఉండడంతో బ్రిడ్జె కింద వెళ్ళడం కుదరదు.

డి హెఫ్‌ వంతెన

స్థానికులు డి హెఫ్‌గా సూచించే ఈ వంతెన దాదాపు 100 సంవత్సరాల పురాతనమైనది. ప్రస్తుతం ఇది రైల్‌రోడ్ క్రాసింగ్‌గా పని చేయనప్పటికీ ఇది నగరంలో ఒక స్మారక చిహ్నంగా మారింది. దీనిని పునర్నిర్మించబడిన తరువాత 2017లో తిరిగి కలపబడింది. ఆ తర్వాత నగరం దానిని మళ్లీ విడదీయదని ప్రతిజ్ఞ చేసినట్లుగా రిజ్న్‌మండ్ నివేదించింది. అయితే ఇప్పుడు నౌకను వెళ్లేందుకు వీలుగా వంతెన మధ్య భాగాన్ని తొలగించాలని నగరం యోచిస్తున్నట్లు సమాచారం.

రోటర్‌డ్యామ్

బెజోస్ యొక్క మెగాయాచ్ ఓడను సముద్రంలోకి తీసుకెళ్లడానికి సముద్ర రంగానికి నగరం అనుమతి ఇవ్వగలదని రోటర్‌డ్యామ్ మునిసిపాలిటీ ప్రతినిధి ఫ్రాన్సిస్ వాన్ హీజ్స్ట్ ఇన్‌సైడర్‌కి ధృవీకరించారు. కానీ వాన్ హీజ్స్ట్ బుధవారం వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడుతూ వంతెనను కూల్చివేసి దానిని తిరిగి నిర్మించడానికి అయ్యే ఖర్చును నగరం చెల్లించదు కావున షిప్‌బిల్డర్ ఓషన్‌కో దాని కోసం చెల్లించవలసి ఉంటుంది. ఇందుకోసం ఇన్‌సైడర్ చేసిన అభ్యర్థనకు ఓషన్‌కో ప్రతినిధి వెంటనే స్పందించలేదు.

అమెజాన్ అన్‌బౌండ్

బెజోస్ యొక్క మెగాయాచ్ ఉనికి విషయానికి వస్తే ఇది బ్రాడ్ స్టోన్ యొక్క పుస్తకం "అమెజాన్ అన్‌బౌండ్"లో గత మేలో మొదటిసారి నివేదించబడింది. ప్రస్తుతం Y721 అని మాత్రమే పిలవబడే కస్టమ్ యాచ్ $500 మిలియన్లు ఖర్చతో తయారుచేస్తున్నట్లు అంచనా వేయబడింది. ప్రపంచంలోని అత్యుత్తమ సెయిలింగ్ యాచ్‌లలో ఇది ఒకటి అని స్టోన్ నివేదించింది.

సపోర్ట్ యాచ్

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ మెగా-యాచ్‌తో పాటు స్వంత హెలిప్యాడ్‌తో కూడిన చిన్న "సపోర్ట్ యాచ్"ని కూడా కలిగి ఉన్నాడు. ఇతని ఆదాయం సుమారు $176 బిలియన్ల విలువ కలిగి ఉన్నాడు అని నివేదించబడింది. అక్టోబరులో నెదర్లాండ్స్‌లోని జ్విజ్‌ండ్రెచ్ట్‌లోని షిప్‌యార్డ్ నుండి బయటికి వస్తున్న యాచ్‌కి సంబంధించిన కొత్త ఫోటోలు మరియు వీడియోలు బయటకు వచ్చాయి. భారీ నౌక ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది, కానీ బోట్ ఇంటర్నేషనల్ మరియు డైలీ మెయిల్ ప్రచురించిన ఫోటోలు నల్ల పొట్టు మరియు బహుళ డెక్‌లతో కూడిన ఓడను చూపించాయి. ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్ట్ 2022 లో పూర్తవుతుందని మరియు ప్రపంచంలోనే అతిపెద్ద సెయిలింగ్ యాచ్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Dutch are Going to Demolition of a 100 Years-Old Historic Bridge For Amazon CEO Megayacht
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X