భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు , పరుగులు పెట్టనున్న మేక్ ఇన్ ఇండియా !

Duty recast may make imported high-end mobile phones costlier More News at Gizbot Telugu

By Hazarath
|

రానున్న బడ్జెట్ తరువాత హైఎండ్ మొబైల్ ధరలకు రెక్కలు రానున్నాయి. మేక్ ఇన్ ఇండియాకి ఊపు తీసుకురావాలని భావిస్తున్న కేంద్రప్రభుత్వం ఆ దిశగా అడుగులను ముందుకు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్లపై customs dutyని పెంచే దిశగా కసరత్తులు చేస్తోంది. ఇలా పెంచడం ద్వారా విదేశీ మొబైల్స్ కి, అలాగే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటిదాకా ఉచిత ఎంట్రీతో వస్తున్న printed circuit boards, కెమెరా మాడ్యూల్స్ అలాగే డిస్‌ప్లేలకు ఈ కస్టమ్స్ డ్యూటీ విధించాలని కేంద్ర భావిస్తోంది.

 

గూగుల్ ప్లే స్టోర్ గేమ్స్ పై మాల్వేర్ అటాక్...60 గేమ్స్ తొలగింపు!గూగుల్ ప్లే స్టోర్ గేమ్స్ పై మాల్వేర్ అటాక్...60 గేమ్స్ తొలగింపు!

మేక్ ఇండియా అన్న నినాదం పరుగులు..

మేక్ ఇండియా అన్న నినాదం పరుగులు..

ఇప్పటిదాకా ఇండియా కేవలం ఎలక్ట్రానిక్ పరికరాల అసెంబ్లింగ్ హబ్‌గా మాత్రమే ఉంది. తయారీ హబ్ అనే మాట చాలా తక్కువగా వినపడుతోందన్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని రూపుమాపేందుకు మేక్ ఇండియా అన్న నినాదంతో కేంద్రప్రభుత్వం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

కస్టమ్స్ డ్యూటీ..

కస్టమ్స్ డ్యూటీ..

మేక్ ఇన్ ఇండియాతో దేశంలో తయారీ రంగం ఊపందుకుంటుందని భావించినప్పటికీ అడుగులు అంత వేగంగా ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో రానున్న బడ్జెట్ లో మేక్ ఇన్ ఇండియా కలను సాకారం చేసేందుకు కస్టమ్స్ డ్యూటీ అంశాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

జీఎస్టీ రాకతో.
 

జీఎస్టీ రాకతో.

కాగా జీఎస్టీ రాకతో ప్రస్తుతం కేవలం కస్టమ్స్ డ్యూటీ మాత్రమే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న తెలిసిందే. ఈ సంవత్సరం జూలై లో ప్రభుత్వం మొబైల్ పోన్లపై 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని నిషేదించింది. డిసెంబరు 14 న కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి పెంచింది.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో..

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో..

మరోవైపు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపుతో ఆయా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టే చర్యలు హేతుబద్ధతను పన్ను నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి చిన్న దానిపై విదేశాల మీద ఆధారపడుతున్నామని ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ పెంచితే ఫలితాలు మరో విధంగా ఉండే అవకాశం లేకపోలేదని వారంటున్నారు.

కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే..

కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే..

అయితే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే ముందుగా చైనా వస్తువులపై భారీ దెబ్బ పడే అవకాశం ఉంది. చైనా నుంచి అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తవులు ఇండియాకి దిగుమతి అవుతున్న నేపథ్యంలో ఈ ప్రభావం వాటికి భారీగానే తగలనుంది.

ఇండియామొబైల్ మార్కెట్లో ..

ఇండియామొబైల్ మార్కెట్లో ..

ఇండియామొబైల్ మార్కెట్లో ఇప్పుడు చైనా మొబైల్స్ రాజ్యమేలుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. దేశీయ మొబైల్ తయారీ రంగాన్ని అతలాకుతలం చేస్తూ తక్కువ ధరలో హై ఎండ్ స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెడుతూ కోట్ల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Duty recast may make imported high-end mobile phones costlier More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X