ఆలీబాబా@56,000 కోట్లు

Posted By:

చైనా ఇ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా ఆన్‌లైన్ విక్రయాల్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. మంగళవారం చైనాలో నిర్వహించిన ‘సింగిల్స్ డే' షాపింగ్ బొనాంజా ఆఫర్‌లో తొలి గంటలోనే 200 కోట్ల డాలర్ల (ప్రస్తుత భారత కరెన్సీ విలువ ప్రకారం రూ.12,300 కోట్లు) విలువైన వస్తువులను విక్రయించి ఈ-కామర్స్ విభాగంలోనే చరిత్ర సృష్టించింది. వీటిలో 40శాతానికి పైగా ఆర్డర్లు మొబైల్ ద్వారానే వచ్చినట్లు విశ్లేషణల ద్వారా వెల్లడవుతోంది.

ఆలీబాబా@56,000 కోట్లు

కాగా, ‘సింగిల్స్ డే' షాపింగ్ బొనాంజా ఆఫర్'ను పురస్కరించుకుని ఆలీబాబా రోజు మొత్తం మీద 9.34 బిలియన్ డాలర్ల (ప్రస్తుత భారత కరెన్సీ విలువ ప్రకారం రూ.56,000 కోట్ల) విక్రయాలను అధిగమించగలిగింది. గతేడాది ఇదే సమయంలో నిర్వహించిన సింగిల్స్ డే బొనాంజా ఆఫర్‌లో రోజు మొత్తం మీద కంపెనీ 5.8బిలియన్ డాలర్ల విక్రయాలను సాధించగలిగింది.

నవంబర్ 11న చైనాలో జరుపుకునే ‘సింగిల్స్ డే'ను ‘యాంటీ వాలెంటైన్స్ డే'గా పిలుస్తారు. ప్రేమికుల రోజును జరపుకోవడాన్ని నిరసిస్తూ 2009 నుంచి ప్రతీ ఏటా నవంబర్ 11న ఆలీబాబా ఈ భారీ స్థాయి డిస్కౌంట్‌లను ప్రకిటిస్తోంది.

గతంలో చైనాకు మాత్రమే పరిమితమైన ఈ ‘సింగిల్స్ డే' షాపింగ్ బొనాంజా ఆఫర్‌ను ఆలీబాబా ఈసారి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసకువచ్చింది. దీంతో ప్రపంచదేశాల నుంచి ఆన్‌లైన్ షాపర్లు డిస్కౌంట్ ధరల పై వస్తువులను దక్కించేకునేందుకు ఎగబడ్డారు. ఈ సింగిల్స్ డే బొనాంజాలో 27,00 పైగా బ్రాండ్లు, కంపెనీలు పాల్గొన్నట్లు సమాచారం.

సింగిల్స్ డే ఆఫర్లలో భాగంగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జియోమీ 10లక్షలకు పైగా స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించినట్లు సమాచారం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
E-Commerce Firm Alibaba Establishes Singles’ Day Record. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot