భారతదేశంలో ఇక ‘ఈ-పోస్టాఫీసులు’: ఐటీ శాఖ మంత్రి కపిల్ సిబల్

Posted By: Staff

భారతదేశంలో ఇక ‘ఈ-పోస్టాఫీసులు’: ఐటీ శాఖ మంత్రి కపిల్ సిబల్

న్యూఢిల్లీ: వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు భారతీయ తపాలా శాఖ బుధవారం 'ఈ-పోస్టాఫీసు" పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్లు (ఇఎంవో), ఇన్‌స్టంట్ మని ఆర్డర్లు (ఈఎంవో), ఫిలటెలిక్ స్టాంపుల అమ్మకాలు, పోస్టల్ సమాచారం, పిన్‌కోడ్ సెర్చింగ్ మొదలైన సర్వీసులు ఈ కొత్త సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఫిర్యాదులను కూడా ఆన్‌లైన్‌లోనే నమోదు చేయొచ్చు. మారుతున్న పరిస్థితులను బట్టి ప్రస్తుతం సర్వీస్ ప్రొవైడర్లే వినియోగదారుల వద్దకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని పోర్టల్ ఆవిష్కరణ సందర్భంగా కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి సిబల్ అన్నారు.

హస్తకళలు, చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తులను కూడా ఈ పోర్టల్ ద్వారా పోస్టల్ శాఖ విక్రయిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లిష్‌లోనే ఉన్న ఈ పోర్టల్‌ను ప్రాంతీయ భాషల్లో కూడా అందించాలని కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి సచిన్ పైలట్ పోస్టల్ శాఖకు సూచించారు. దీని వల్ల ప్రతి నెట్‌బుక్, కంప్యూటర్ ఒక పోస్టాఫీస్‌గా రూపాంతరం చెందినట్లవుతుందన్నారు. 'ఇ-పోస్ట్ ఆఫీస్" వెబ్‌సైట్ ద్వారా డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో ఆన్‌లైన్‌లోనే ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్లు పంపొచ్చని తపాలా శాఖ కార్యదర్శి రాధికా దొరైస్వామి తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot