భూకంప సమాచారం క్షణాల్లో.. మీ అరచేతిలో!!

Posted By: Super

భూకంప సమాచారం క్షణాల్లో.. మీ అరచేతిలో!!

ప్రకృతి వైపరిత్యాలలో అతి భయానకమైనవి భూకంపాలు. యూవత్ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఈ విపత్కర ప్రళయాలు రోజుకో ప్రాంతాన్ని కుదిపేస్తున్నాయి. తాజాగా ఇండోనేషియాలో కలకలం రేపిన భూప్రకంపనలు 28 దేశాలను కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఈ విధమైన అపాయాలకు సంబంధించి జనాభాను జాగృత పరిచేందుకు ‘గుగూల్ ప్లే’  ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త అప్లికేషన్‌ను రూపొందించింది. ఈ అప్లికేషన్ పేరు ఎర్త్‌క్వేక్ (Earthquake), ఈ అప్లికేషన్ భూకంప సమయాల్లో ప్రమాద తీవ్రతను విశ్లేషిస్తూ మార్గదర్శకురాలిగా అలర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అదేవిధంగా టాబ్లెట్ పీసీల యూజర్లు గుగూల్ ప్లే స్టోర్ ద్వారా ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.

ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా యూజర్‌కు వర్తించే సౌలభ్యతలు:

భూకంపం వివరాలు పటము రూపంలో ప్రదర్శించబడతాయి,

గడిచిన 24 గంటల్లో సంభవించిన భూకంపాలకు సంబంధించి  విశ్లేషణతో కూడిన ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు,

ఈ అప్లికేషన్ ఒక డైనమిక్ విడ్జెట్‌గా పనిచేస్తుంది.

టెక్నాలజీ సాయంతో  గుగూల్‌ప్లే అందిస్తున్న ఈ సేవను ఆండ్రాయిడ్ యూజర్లు ఆదరిస్తారని ఆశిద్దాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot