ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్
ఈకామర్స్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈబే ఇండియా, మార్కెట్లో బ్లాక్ ఫ్రైడ్ అమ్మకాలను పరిచయం చేసింది. షాప్‌యువర్‌వరల్డ్‌డాట్‌కామ్ (shopyourworld.com) భాగస్వామ్యంతో ఈ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు అందిస్తున్నామని ఈబే ఇండియా డైరెక్టర్ ఇంకా బిజినెస్ హెడ్ విద్మే నైనీ తెలిపారు.

నవంబర్ 21 (శుక్రవారం) నుంచే ప్రారంభమైన అమ్మకాల ఆఫర్లు నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. ఈ ఆఫర్‌లలో భాగంగా అన్ని దిగుమతి సుంకాలు కలుపుకుని అమెరికా ఉత్పత్తలను కూడా భారత కరెన్సీ ప్రకారం అందిస్తామని, ఉత్పత్తులను గ్లోబల్ ఈజీ బయ్ (Global Easy Buy) ద్వారా కొనుగోలు చేస్తే రవాణా చార్జీలు కూడా ఉచితమని ఈబే ఇండియా వెల్లడించింది.
భారతీయులకు తాము అందిస్తోన్న బ్లాక్ ఫ్రైడే ఆఫర్‌లలో భాగంగా 10వేల డీల్స్ వరకు అందుబాటులో ఉంచినట్లు సంస్థతెలిపింది. టెక్నాలజీ అలానే లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల కొనుగోళ్ల పై 80 శాతం వరకు డిస్కౌంట్‌లను అందిస్తున్నట్లు పేర్కొంది.
అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే తరువాత వచ్చే శుక్రవారాన్ని బ్లాక్ ఫ్రైడేగా వ్యవహరిస్తారు. అక్కడ క్రిసమస్ షాపింగ్ సీజన్ కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కంపనీలు వివిధ రకాల ఉత్పత్తుల పై భారీ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








