సాంకేతివిద్యతోనే దేశ పురోగతి: అబ్ధుల్ కలామ్

Posted By: Staff

సాంకేతివిద్యతోనే దేశ పురోగతి: అబ్ధుల్ కలామ్

 

సాంకేతిక విద్యా విధానం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినప్పుడే దేశపురోగతి సాధ్యమౌతుందని మాజీ రాష్టప్రతి డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌ కలాం అన్నారు. బుధవారం శామీర్‌పేట మండలంలోని బిర్ల ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) హైదారాబాద్‌ క్యాంపస్‌లో జరిగిన చర్చగోష్టి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన విద్యార్థి దశలో జరిగిన సంఘటనల గూర్చి వివరించారు. ప్రస్తుత పరిస్థితులలో బయో, నానో, ఇన్ఫో, టెక్నో సైన్స్‌ దేశ ప్రగతికి నాలుగు స్థంబాలుగా నిల్చుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరు ఉన్నత ఆశయంతో లక్ష్యాన్ని ఎంచుకొని దానిని చేరేందుకు పట్టుదలతో కృషి చేయాలన్నారు.

మనం చేసే పనిపట్ల పూర్తినమ్మకం ఉన్నప్పుడే ఆ పనిలో సఫలికృతులౌతారని చెప్పారు. ఏ సమస్య వచ్చిన సమర్ధవంతగా ఎదుర్కొన్నప్పుడే విజయం వరిస్తుందని చెప్పారు. ఏ పని చేసిన నీతి నియమాలు, అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. వ్యవసాయం సాంకేతిక విద్యా, నాణ్యమైన విద్యుత్‌ మొదలైన రంగాలన్నింటిని  అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సానుకూలంగా సమాదానం ఇచ్చారు. బోధన, అధ్యయనం, పరిషోధన విజన్‌ 2020 లక్ష్యాసాధనకు మార్గాలని తెలిపారు.

ఆ దిశగా యువత కృషి చేయాల్సిన అవసరం ఉందిన సూచించారు. మంచి పుస్తకాలు, ఉత్తమ ఉపాధ్యాయులు బోధనతో సమస్యలను సమర్ధవంతగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతాయన్నారు. 2020 నాటికి ప్రపంచంలోనే మన దేశం శక్తివంతమైన అగ్రగామి దేశంగా రూపొందేందుకు పుష్కలమైన వనరులతో పాటు మిలియన్‌ యువకులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అనంతరం క్యాంపస్‌ అవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో బిట్స్‌ డైరక్టర్‌ ప్రొపెసర్‌ విఎస్‌రావు, విద్యార్థులు పాల్గొన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot