ఆ ఫోన్ తయారీకి ఎడ్వర్డ్ స్నోడెన్ సహాయం చేస్తున్నాడా..?

అమెరికాకు సంబంధించిన రహస్య పత్రాలను లీక్ చేసారన్న అభియోగాలు నమోదు కావటంతో, ఆ దేశం వదలి రష్యాలో ఆశ్రయం పొందుతోన్న అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌ఎ) మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ ఓ స్పై ప్రూఫ్ ఐఫోన్ తయారీకి సంబంధించి ఎంఐటి మీడియా ల్యాబ్ రిసెర్చర్లతో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. స్నోడెన్ సహకారంతో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రిసెర్చర్లు అభివృద్థి చేస్తోన్న ఓ డివైస్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రభుత్వ గూఢచర్యాల నుంచి రక్షణనిస్తుందట.

Read More : ప్రతి కథకు ఓ మలుపు, నాడు జీరోలు.. నేడు హీరోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్లాస్టిక్ కేస్ తరహాలో ఉండే ఈ డివైస్

ప్లాస్టిక్ కేస్ తరహాలో ఉండే ఈ డివైస్ ఐఫోన్ 6 యాంటీనాను నిరంతరం మానిటర్ చేస్తూ సెల్యులార్, బ్లుటూత్, వై-ఫై, జీపీఎస్ ఇంకా ఎన్ఎఫ్‌సీ రేడియో చిప్‌ల నుంచి వెలువడే అనుమానిత ఇన్‌‍కమింగ్, అవుట్‌గోయింగ్ సిగ్నల్స్‌ను ఇట్టే పసిగట్టగలదట.

ప్రత్యేకమైన సెన్సార్ వ్యవస్థతో

ప్రత్యేకమైన సెన్సార్ వ్యవస్థతో వస్తోన్న ఈ కేస్ ఫోన్‌ను స్పై చేస్తున్నట్లు పసిగట్టిన వెంటనే అలారమ్‌ను మోగిస్తుంది.

ఈ స్పై ప్రూఫ్ సెన్సార్ కేస్

ఫోన్ ఆపరేటింగ్ సిస్టంను హ్యాక్ చేసే అన్ని ప్రయత్నాలను ఈ స్పై ప్రూఫ్ సెన్సార్ కేస్ తిప్పికొట్టగలదని బోస్టన్ గ్లోబ్ తెలిపింది.

ప్రముఖ రిసెర్చర్ ఆండ్రూ హువాంగ్

ప్రముఖ రిసెర్చర్ ఆండ్రూ హువాంగ్ సహకారంతో రూపొందించబడిన ఈ డివైస్‌ను అమెరికాలోని ఎంఐటి మీడియా ల్యాబ్ ఈవెంట్‌లో భాగంగా రివీల్ చేసారు.

నిరంతరం కీలక సమాచారాన్ని

నిరంతరం కీలక సమాచారాన్ని కలిగి ఉండే ఫీల్డ్ జర్నలిస్ట్‌లకు సంబంధించిన ఫోన్‌లను ఈ స్పై ప్రూఫ్ డివైస్ కాపాడగలదు.అమెరికాకు నిద్రలేని రాత్రులను మిగిల్చిన విజిల్ బ్లోయెర్ ఎడ్వర్డ్ స్నోడెన్ ట్విట్టర్‌ను సైతం వణికిస్తున్నారు. కెన్ యూ హియర్ మి అంటూ ఆయన పెట్టిన తొలి ట్వీట్‌కు 45 నిమిషాల్లో
లక్ష ఫాలోవర్లు లభించారు. ఒక్క రోజులో ఆయన వెనుక నడుస్తామని వచ్చిన వారి సంఖ్య 7.79 లక్షలకు చేరింది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Edward Snowden helping MIT team build spy proof iPhone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot