గూగుల్ Allo పై బాంబు పేల్చిన స్నోడెన్!

అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌ఎ) మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ గూగుల్ పై బాంబు పేల్చాడు. గూగుల్ లాంచ్ చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ మెసేజింగ్ యాప్ Allo పై అభ్యంతరాలు వ్యక్తం చేసారు.

గూగుల్ Allo  పై బాంబు పేల్చిన స్నోడెన్!

Read More : ఒక్క రోజులో లక్ష ఫోన్‌ల అమ్మకం, దుమ్మురేపిన Moto E3 Power

అంతేకాకుండా ఈ యాప్‌కు దూరంగా ఉండాలంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. గూగుల్ స్మార్ట్ మెసేజింగ్ యాప్ Allo పై యావత్ ప్రపంచం ఉత్కంఠగా చర్చించుకుంటున్న నేపథ్యంలో స్నోడెన్ ఈ వ్యాఖ్యలు చేయటం పలు సందేహాలకు తావిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రవైసీ సమస్యల పై

గూగుల్ Allo యాప్‌లోని ప్రవైసీ సమస్యల పై తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ స్నోడెన్ గత రాత్రి వరుస ట్వీట్‌లను పోస్ట్ చేసారు.

స్మార్ట్ రిప్లై

ఇందకుగాను ఈ యాప్‌లో స్మార్ట్ రిప్లై పేరుతో ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్
ఫీచర్‌ను గూగుల్ పొందుపరిచింది. ఈ ఫీచర్ మనం రిసీవ్ చేసుకున్న చివరి మెసేజ్ లేదా ఫోటోకు సంబంధించి కొన్ని రిప్లై సజెషన్స్ మనకి అందిస్తుంది.

ఈ పాయింట్‌ను ఆధారంగా చేసుకున్న స్నోడెన్

ఈ పాయింట్‌ను ఆధారంగా చేసుకున్న స్నోడెన్ స్మార్ట్ రిప్లై ఫీచర్ పై పలు అనుమానాలు వ్యక్తం చేసారు. యూజర్ తన Allo యాప్‌లో షేర్ చేసే మొత్తం సమాచారాన్ని గూగుల్ రికార్డ్ చేస్తుందని, ఈ సమాచారాన్ని గూగుల్ భవిష్యత్‌లో ఇతరులకు షేర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

గూగుల్ Allo యాప్‌ను

గూగుల్ Allo యాప్‌ను స్నోడెన్ ఈ విధంగా నిర్వచించారు... Google Allo as, "Free for download today: Google Mail, Google Maps, and Google Surveillance. That's #Allo. Don't use Allo."

అందరికి ఓపెన్ అయి ఉన్నప్పటికి

గూగుల్ కొత్త మెసేజింగ్ యాప్ అందరికి ఓపెన్ అయి ఉన్నప్పటికి చాలా మంది యాజర్లు ఇంకా వాట్సాప్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్‌లను అంటిపెట్టుకుని ఉన్నారని స్నోడెన్ తెలిపారు.

Allo యాప్ పాలసీల ప్రకారం

Allo యాప్ పాలసీల ప్రకారం గూగుల్ తన ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ మెసేజింగ్ సర్వీసును మరింత ఇంప్రూవ్ చేసుకునేందుకు అన్ని నానో ఇన్‌కాగ్నిటో మెసేజ్‌లను డీఫాల్ట్‌గా తన సర్వర్‌లలో స్టోర్ చేసుకుంటుందని కొన్ని రిపోర్ట్స్ వ్యక్తం కాగా, ఈ వార్తలను గూగుల్ ఖండించింది.

Allo యాప్ యూజర్‌కు సంబంధించి

Allo యాప్ యూజర్‌కు సంబంధించిన మెసేజ్‌లు తాత్కాలికంగా మాత్రమే స్టోర్ చేయబడతాయని, అవి కూడా గుర్తించలేని విధంగా ఉంటాయని గూగుల తెలిపింది. వీటిని యూజర్ మాన్యువల్‌గా డిలీట్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Edward Snowden warns against Google Allo. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot