Home
News

సెల్ఫీ పిచ్చితో చావు వడిలోకి 13ఏళ్ళ బాలుడు

By Anil

రంజాన్ వేడుకుల సందర్భం లో ఓ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడి ప్రాణాలు సముద్రం లో కలిసిపోయాయి, ముంబై మెరైన్ డ్రైవ్లో సెల్ఫీ తీసుకుంటుండగా మరణించాడు . రుతుపవనాల సమయంలో సముద్రం చాలా కఠినంగా ఉంటుంది, రాళ్ళపై వెళ్లవద్దని అధికారులు హెచ్చరిన పట్టించుకోకుండా వెళ్లి తన ప్రాణాలు కోల్పోయాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Selfie killed

బాలుడు అల్తాఫ్ సయ్యద్ షేక్ ముంబై లోని ట్రోమ్బే ప్రాంతం యొక్క నివాసిగా గుర్తించారు .ఈద్ సందర్బంగా ఇంటికి వచ్చిన వారి బంధువులతో సరదాగా గడిపారని మధ్యాహ్నం ఈద్ నమాజ్ ముగించుకొని వారి పెద్ద వారితో ఆశీర్వచనాలు పొంది సాయంత్రం స్నేహితులతో ఈద్ వేడుకుల జరుపుకుంటానని వెళ్లాడని వాళ్ళ నానా గారైన సయ్యద్ షేక్ ఓ ప్రధాన దిన పత్రిక interview లో కన్నీరు మున్నీరు అయ్యారు.

తరువాత సాయంత్రం, ఆల్ట్ఫ్ మరో ఇద్దరు మిత్రులతో కలిసి మెరైన్ డ్రైవ్కు వెళ్లాడు. అక్కడ సముద్రపు అలలు భారీగా వస్తున్నాయి అయినా పట్టించుకోకుండా అక్కడి రాళ్ల పై నడుస్తూ సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లి ప్రమాదం తెచ్చుకున్నాడు .

మెరైన్ డ్రైవ్ పోలీసు స్టేషన్ నుండి ఒక పోలీసు అధికారి ఇలా అన్నారు, "రంజాన్ పండుగ రోజున, మెరైన్ డ్రైవ్ వద్ద భారీ రద్దీ ఉందని , ఆ ప్రాంతం లో అదనపు పెట్రోలింగ్ పోలీసులను ఉంచామని , అయితే మా పోలీసులు వెళ్లిన తర్వాత,ఆ బాలుడు సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లాడని అందుకే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు

ఇంకొక పోలీసు అధికారి మాట్లాడుతూ, అల్తాఫ్ తన స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకోవడానికి వచ్చినప్పుడు హెచ్చరిస్తే ఆగిపోయాడని రెండవ సారి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఆ సమయం లో ఒక లైఫ్ గార్డ్ తనని రక్షినబోయాడని అతను కూడా గాయాలు పాలయ్యాడని, ఆ బాలుడిని రక్షించలేక పోయారని చెప్పారు . "

ఆదివారం ఉదయం, అల్తాఫ్ తల్లిదండ్రులు ట్రోంబే పోలీసు స్టేషన్ వద్ద ఒక తప్పిపోయిన ఫిర్యాదు దాఖలు చేశారు. మెరైన్ డ్రైవ్ ఈ సంఘటన యొక్క ఫోటోలు అందిచడం తో ఆ బాలుడి శరీరం గుర్తించారు

Best Mobiles in India

English summary
Eid celebrations turned fatal for the 13-year-old boy, he died while taking a selfie at Mumbai's Marine Drive. The 13-year-old boy was warned by the officials not to go on the rocks to take selfie, as during monsoon the sea is extremely rough.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X