వామ్మో!! మొబైల్‌ఫోన్ యూజర్లు 95కోట్లా..?

Posted By: Staff

వామ్మో!! మొబైల్‌ఫోన్ యూజర్లు 95కోట్లా..?

 

దేశంలో జనాభా పెరుగుదల మాట అలా ఉంచితే, మొబైల్ యూజర్ల సంఖ్య అనతికాలంలోనే 95కోట్లకు చేరుకుంది. తాజాగా టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), మార్చి 2012 గణాంకాలను విడుదల చేసింది. ఈ మార్చిలో కొత్తగా 80 లక్షల మంది కొత్తగా మొబైల్ కనెక్షన్ పొందినట్లు సంస్థ వెల్లడించింది. దింతో దేశంలోని మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 95.13కోట్లకు చేరింది.

ట్రాయ్ వెల్లడించిన గణంకాల ప్రకారం, గడిచిన మార్చిలో భారత ఎయిర్‌టెల్‌కు అత్యధికంగా 25 లక్షల మంది కొత్త యూజర్లు లభించారు. దింతో కంపెనీ మొత్తం చందాదారుల సంఖ్య 18.12కోట్లకు చేరుకుంది. తురువాత స్థానంలో ఉన్న ఐడియా సెల్యులర్ 20 లక్ష మంది కొత్త వినియోగదారులను దక్కించుకుంది. యూనినార్ 12.9 లక్షలు, రిలయన్స్ 10.4 లక్షలు, వొడాఫోన్ 4.2లక్షల మంది కొత్త కస్టమర్లతో సరిపెట్టుకున్నాయి.

సెకనుకు పైసా తప్పనిసరి

టెలికాం ఆపరేటర్లు తమ మొబైల్ కస్టమర్లకు సెకనుకు ఒక పైసా టారిఫ్ ప్లాన్ తప్పక అమలుచేయాలని భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) సూచించింది. ఈ మేరకు ట్రాయ్ తాజాగా టారిఫ్ సవరణ ఉత్తర్వును జారీచేసింది. టెలికాం ఆపరేటర్లు ఒక్కో సర్వీస్ ఏరియాలో పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ఖాతాదార్ల కోసం ‘ఒక సెకను’ పల్స్‌రేటుతో కనీసం ఒక్కో టారిఫ్ ప్లాన్ అమలుచేయడం ఆనవాయితీగా ఉండాలని ఉత్తర్వులో పేర్కొంది. అలాగే మొత్తం మీద 25 టారిఫ్ ప్లాన్‌లు దాటని విధంగా ఏ పల్స్‌రేటుతోనైనా ప్రత్యామ్నాయ టారిఫ్ ప్లాన్‌లను అమలుచేసుకునే స్వేచ్ఛ ఆపరేటర్లకు ఉన్నదని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot