ఈ ఎలక్ట్రిక్ టోపీ ధరిస్తే మీ బట్టతలపై కొత్త జుట్టు వస్తుంది

By Gizbot Bureau
|

బట్టతల ఇప్పుడు మగవారికి ఇదో పెద్ద సమస్యగా మారింది. 35 ఏళ్లు దాటగానే జుట్టు ఊడిపోవడం మొదలై 40 ఏళ్లకు ఖాళీ గుండుగా మారుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది హెయిర్ ప్లాంటేషన్ తో మళ్లీ తిరిగి మాములు జుట్టును తెచ్చుకుంటున్నారు. అయితే ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది కావడంతో చాలామంది విగ్గుతో కవర్ చేస్తున్నారు. ఇంతమందిని వేధిస్తున్న బట్టతల సమస్యకు అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కొత్త పరిష్కారం కనుగొన్నారు. వారు ఎలుకలపై చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడు బట్టతల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.

చౌకగా ఉండే టోపీ

చౌకగా ఉండే టోపీ

విష్కాన్ సన్ మాడిసన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు దీనిపై పరిశోధన చేసి ఓ పరిష్కారం కనుగొన్నారు. అత్యంత చౌకగా ఉండే టోపీ ఒకదానిని తయారు చేశారు. ఈ టోపీని తలపై పెట్టుకున్నప్పుడు.. అందులో ఉండే ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ద్వారా ఎలక్ట్రిక్ పల్స్ బట్టతలపై ఉండే చర్మపు కణాలను ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా తిరిగి జుట్టు పెరగడానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయని పరిశోధకులు చెప్తున్నారు. 

బట్టతలపై కొత్త జుట్టు

బట్టతలపై కొత్త జుట్టు

విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా నానో జనరేటర్లను తయారు చేశారు. నానో జనరేటర్ల దండను ఎలుకల తలకు కట్టారు. అవి అటూ ఇటూ కదలుతున్నప్పుడు నానో జనరేటర్ల నుంచి అతి స్వల్ప పౌనఫున్య విద్యుత్ తరంగాలను వెలువడేలా చేశారు. వాటి ప్రభావంతో బట్టతలపై నిద్రాణంగా ఉన్న సూక్ష్మరంధ్రాలు చైతన్యవంతమై వెంట్రుకలు మొలవడం ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగంతో బట్టతలపై కొత్త జుట్టు వచ్చింది.

తలపై కొన్ని గంటలపాటూ 

తలపై కొన్ని గంటలపాటూ 

మిల్లీమీటర్ మందం మాత్రమే ఉండే ప్యాచ్‌ని రోజూ తలపై కొన్ని గంటలపాటూ పెట్టుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. అప్పుడు ఈ ప్యాచ్... మన శరీర కదలికలను బట్టీ... ఎలక్ట్రిసిటీ పల్సెస్‌ను ఉత్పత్తి చేస్తుంది. అవి బట్టతలపై చుండ్రును తరిమికొట్టడమే కాదు. బట్టతలపై తిరిగి జుట్టు మొలిచేందుకు వీలయ్యేలా చేస్తుంది. ఈ ప్రక్రియను ట్రిబోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ (triboelectric effect) అంటున్నారు. ఏ ఆపరేషన్ లేకుండా కేవలం నానో జనరేటర్ల సాయంతో వెలువడే స్వల్ప విద్యుత్ తరంగాలతో కొత్త జట్టును మొలిపించే ఈ టెక్నాలజీని మనుషులపై ప్రయోగించి త్వరలోనే ఈ చికిత్సను అందుబాటులోకి తేవడానికి శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. 

కొత్తగా జుట్టు రాలిపోయిన వాళ్లకు మాత్రమే

కొత్తగా జుట్టు రాలిపోయిన వాళ్లకు మాత్రమే

పరిశోధకులు చెబుతున్నదాన్ని ప్రకారం ఆ క్యాప్ ధరిస్తే బట్టతల ఉన్న మగాళ్లందరికీ జుట్టు రాదు. కొత్తగా జుట్టు రాలిపోయిన వాళ్లకు మాత్రమే కొత్త జుట్టు వస్తుందట.ఇక మగాళ్లు నిద్రపోతున్నప్పుడు ఆ క్యాప్ పెట్టుకుంటే ప్రయోజనం ఉండదట. ఎందుకంటే... నిద్రపోతున్నప్పుడు తలలో కదలికలు ఉండవు కాబట్టి... ప్యాచ్ పరికరానికి పవర్ అందదట. అందువల్ల మెలకువగా ఉన్నప్పుడు, పగటివేళ కొన్ని గంటలపాటూ ఆ క్యాప్ పెట్టుకుంటే... నెల రోజుల్లో జుట్టు మొలుస్తుందని చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
Electric hat may help reverse baldness

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X