India

ఆన్‌లైన్‌లో విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారా? ఈ స్కామ్ గురించి తెలుసుకోండి...

|

ప్రపంచం మొత్తం స్మార్ట్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నది. అంతేకాకుండా స్కామ్‌లు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. అనుమానాస్పద వ్యక్తులు చేసే దోపిడీ మోసాలతో ఎక్కువ మంది ప్రజలు బలైపోతున్నారు. అలాంటి స్కామ్‌లలో ఒకటి విద్యుత్ బిల్లు స్కామ్. వినియోగదారులు తమ విద్యుత్ కనెక్షన్‌ను కోల్పోనున్నట్లు భయాన్ని కలిగించడం మరియు బిల్ పేమెంట్ లో డిస్కౌంట్‌లను పొందడానికి క్లెయిమ్ చేయడం వంటి ప్రలోబాలతో బాధితులను ఆకట్టుకునే ప్రయత్నంతో మోసాలకు పాల్పడుతున్నారు. మోసగాళ్లు ఇటువంటి మెసేజ్ లను జనాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ల ద్వారా టెక్స్ట్‌ల రూపంలో పంపుతూ బాధితులను ఆకట్టుకుంటున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

విద్యుత్ బిల్లు స్కామ్ అంటే ఏమిటి?

విద్యుత్ బిల్లు స్కామ్ అంటే ఏమిటి?

వేసవి కాలంలో ముఖ్యంగా ఎయిర్ కండీషనర్ల వల్ల విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతుంది. స్కామర్లు ఈ విషయం దృష్టిలో ఉంచుకొని అధిక మొత్తంలో డబ్బును డిమాండ్ చేస్తూ ప్రజలను దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో నకిలీ బిల్లులు చెల్లించేలా వారిని గందరగోళానికి కూడా గురిచేస్తున్నారు. స్కామర్లు వినియోగదారులకు పంపుతున్న టెక్స్ట్ మెసేజ్ యొక్క సారాంశం విషయానికి వస్తే బిల్లును వెంటనే చెల్లించకపోతే వారి విద్యుత్తు కనెక్షన్ డిస్‌కనెక్ట్ చేయబడుతుందని క్లెయిమ్ చేస్తూ వారికి కాల్ చేస్తాడు. ఇది కొద్దిగా సాధారణమైన ఫోన్ కాల్ అనిపించడానికి వారు కాల్ లేదా టెక్స్ట్ నుండి కొన్ని గంటల వ్యవధిలో గడువును ఇస్తారు. ట్విట్టర్‌లో "విద్యుత్ బిల్ స్కామ్" అని సెర్చ్ చేయడంతో మీకు అలాంటి మెసేజ్లకు సంబంధించిన టన్నుల కొద్దీ ఉదాహరణలు కనిపిస్తాయి. మోసగాళ్లు ఈ టెక్స్ట్ మెసేజ్‌లలో నకిలీ నంబర్‌ను కూడా అందజేసి ధృవీకరించడానికి వినియోగదారుని కాల్ చేయమని అడుగుతారు. వారు కొంత తగ్గింపు పొందడానికి బిల్లును చెల్లించే పరిమిత-సమయ ఒప్పందాన్ని కూడా అందించవచ్చు.

విద్యుత్ బిల్లు స్కామ్ మోసగాళ్లను గుర్తించే విధానం
 

విద్యుత్ బిల్లు స్కామ్ మోసగాళ్లను గుర్తించే విధానం

విద్యుత్ బిల్లు స్కామ్ కోసం ప్రయత్నించే మోసగాళ్లు మరియు కాన్ ఆర్టిస్టులు తరచుగా కాల్ చేస్తున్నప్పుడు లేదా టెక్స్ట్‌లో అత్యవసర భావాన్ని సృష్టిస్తారు. అంతేకాకుండా వారు మీ స్థానిక యుటిలిటీ కంపెనీ లేదా ఎనర్జీ ప్రొవైడర్‌కి చెందిన ప్రతినిధి అని క్లెయిమ్ చేసే కమాండింగ్ టోన్‌ను కూడా కలిగి ఉంటారు. బిల్లు పేమెంట్ జరగలేదని లేదా మీకు చాలా బిల్లులు ఉన్నాయని వారు క్లెయిమ్ చేస్తారు. మీరు చెల్లించకపోతే వెంటనే మీ విద్యుత్తును ఆపివేస్తామని కూడా వారు బెదిరిస్తారు.

విద్యుత్ బిల్లు స్కామ్ మోసాన్ని గుర్తించే విధానం

విద్యుత్ బిల్లు స్కామ్ మోసాన్ని గుర్తించే విధానం

మొదటి సిట్యువేషన్

డబ్బులు చెల్లించకపోతే కనుక వెంటనే మీ పవర్ కట్ చేస్తామని బెదిరిస్తారు.

రెండవ సిట్యువేషన్

మోసగాళ్లు మీ యొక్క విద్యుత్ బిల్లింగ్ గురించిన అన్ని వివరాలను కలిగి ఉండరు. కానీ అది చట్టబద్ధంగా అనిపించేలా వారు యాదృచ్ఛికంగా కానీ నిర్దిష్ట మొత్తాన్ని కలిగి ఉండి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.

మూడవ సిట్యువేషన్

మోసగాళ్లు ఆన్‌లైన్‌లో మాత్రమే డబ్బును చెల్లించమని అడుగుతారు. ఇది UPI ద్వారా కావచ్చు లేదా మీ క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలను కూడా అడగవచ్చు. ఈ వివరాలను అడిగిన వెంటనే త్వరగా గుర్తుపెట్టుకోవచ్చు వారు మోసగాళ్లు అని.

మోసగించబడే బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉండడం గమనార్హం. వృద్దులు ఆన్‌లైన్ పేమెంట్ మోడ్‌లను ఉపయోగించడానికి బదులుగా మరొక మార్గాన్ని అన్వేశించడం ఉత్తమం. ఆన్‌లైన్ ద్వారా వినియోగదారుల యొక్క వివరాలను ఇవ్వడం మరియు డబ్బును తీసివేయడం వంటి వాటిని మార్చవచ్చు.

 

మీకు అలాంటి కాల్ లేదా టెక్స్ట్ వస్తే ఏమి చేయాలి?

మీకు అలాంటి కాల్ లేదా టెక్స్ట్ వస్తే ఏమి చేయాలి?

విద్యుత్ బిల్లు స్కామ్ కి సంబందించిన ఏదైనా కాల్ వస్తే వెంటనే మీ సంభాషణను ముగించడం మంచిది. మోసగాళ్లు తరచుగా బెదిరించడానికి మరియు గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. బిల్లింగ్ చేయడానికి బిల్లుపై లేదా అధికారిక వెబ్‌సైట్‌లోని అధికారిక కాంటాక్ట్ వివరాలను ఉపయోగించి మీ ఎనర్జీ ప్రొవైడర్‌ను సంప్రదించడం ఉత్తమ ఎంపిక. ధృవీకరణ పొందడానికి మీరు కరెంట్ యొక్క కార్యాలయాన్ని కూడా సందర్శించవచ్చు. బిల్లు వివరాలను స్వయంగా ధృవీకరించుకోకుండా ఎవరైనా తొందరపడి చెల్లించకూడదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Electricity Bill Scam: How to Identify Online Paying Fraud Bills

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X