ఆ సిగరెట్టు తాగొచ్చు.. సేఫ్?

Posted By: Staff

ఆ సిగరెట్టు తాగొచ్చు.. సేఫ్?

ఏథెన్స్: పొగతాగే అలవాటును వదిలించుకోడానికి మార్గమైన ఎలక్ట్రానిక్ సిగరెట్ల వల్ల గుండెకు ముప్పేమీ లేదని గ్రీక్ పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. అంత ఆరోగ్యకరమైన అలవాటు కాకపోయినా, మామూలు సిగరెట్ల కంటే నయమేనని ఏథెన్స్‌లోని ఒనాసిస్ కార్డియాక్ సర్జరీ సెంటర్‌కు చెందిన కాన్‌స్టాంటినోస్ ఫార్సలినోస్ తెలిపారు. సిగరెట్లు తాగే 20 మంది, ఈ-సిగరెట్లు తాగే 22 మందిపై పరిశోధనలు చేసి ఈ విషయం తేల్చారు.

బ్రిటన్‌లో ఆంక్షలు?

సిగరెట్లు తాగే అలవాటును మానుకునే క్రమంలో వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ సిగరెట్లను అదే పనిగా ఉపయోగించటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారీతీసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపధ్యంలో బ్రిటన్ ప్రభుత్వం వాటిని రద్చు చేసే యోచనలో పడింది. వివరాల్లోకి వెళితే.. నికోటిన్‌తో కూడిన నీటి ఆవిరిని పీలుస్తూ సిగరెట్ వ్యసనపరులు ఎలక్ట్రానిక్ సిగరెట్ ద్వారా ఉపశమనం పొందుతున్నారు.

సిగరెట్లను వదిలిపెట్టే పేరుతో వీటిని అదే పనిగా వాడడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉందని వార్తలు వస్తుండడంతో వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిటిష్ వైద్యాధికారులు భావిస్తున్నారు. ఇరవై లక్షల మంది ఎలక్ట్రానిక్ సిగరెట్లను వినియోగిస్తున్నట్లు అంచనా. వారిలో ఆరున్నర లక్షల మంది నిత్యం వాడుతున్నారని సమాచారం. దీంతో ఇకపై వైద్యులు సూచిస్తే తప్ప వీటిని విక్రయించరాదని అక్కడి అధికారులు ఆంక్షలు విధించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot