చీటింగ్ కేసులో ‘ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్’

|

Electronics e-tailer Timtara co-founder Arindam Bose arrested for alleged cheating
నేర విభాగానికి చెందిన ఆర్ధిక నేరాల వింగ్ (ఈఓడబ్ల్యూ) చీటింగ్ ఆరోపణల క్రింద ప్రముఖ ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ టిమ్‌టారా (Timtara)కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించి 200 షాపర్ల నుంచి రూ.12 లక్షల విలువగల ఆర్డర్లను సేకరించిన టిమ్‌టారా ఆయా ఉత్పత్తులను పంపిణి చేయటంలో విఫలం కావటంతో బాధితులు న్యాయపోరాటానికి దిగినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

అరెస్ట్ అయిన వారిలో టిమ్ టారా సహ వ్యవస్థాపకులు అరిందమ్ బోస్, సీఈవో హరీస్ అహ్లువాలియాలు ఉన్నారు. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ‘టిమ్‌టారా డీల్స్' ప్రత్యేక ఆన్‌లైన్ ఆఫర్ల పై వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విక్రయిస్తుంది. సంస్థలకు సహవ్యవస్థాపకులగా వ్యవహరిస్తున్న బోస్ గతంలో ఫిలిప్స్, ఏటీ&టి, ఎల్‌జి, వీడియోకాన్ వంటి సంస్థల్లో పనిచేసారు. 2010లో మరో ముగ్గురితో కలిసి టిమ్‌టారా డాట్ కామ్‌ను ప్రారంభించారు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X