Budget 2024 కేంద్ర బడ్జెట్ 2024 అంచనాలేంటి.. లైవ్ ఎక్కడ చూడాలి?
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన మధ్యంతర బడ్జెట్‌ను (Budget 2024) ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ముందు వచ్చే బడ్జెట్‌పై అన్ని రంగాలతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఎలక్ట్రానిక్స్ రంగంపై బడ్జెట్ అంచనాలు ఎలా ఉన్నాయంటే?
అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంటే పూర్తి స్థాయిలో కాకుండా కొత్త ప్రభుత్వం కొలువు తీరేంత వరకు మాత్రమే ఈ బడ్జెట్ అమల్లో ఉంటుంది. అందువల్ల దీనిని మధ్యంతర బడ్జెట్‌గా పిలుస్తారు. దీనినే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని కూడా పిలుస్తారు.

తాజా నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇందులో రానున్న సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ ఆదాయ, వ్యయ ప్రణాళికలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి లోక్ సభలో వెల్లడిస్తారు.
ఇబ్బందులు, ఎదురుచూపులు : బడ్జెట్ 2024 సమీపిస్తున్న కొద్ది ఎలక్ట్రానిక్స్, డ్యూరబుల్స్ పరిశ్రమ కొన్ని ఎదురుచూపులు మరికొన్ని భయాందోళనను కలిగి ఉంది. గత సంవత్సరం ఈ రంగం ఇటీవల ఆశాజనకమైన వృద్ధిని సాధించింది. దీంతోపాటు 'మేక్ ఇన్ ఇండియా' వంటి ప్రభుత్వం కార్యక్రమాలు ఈ రంగానికి ఊతమిచ్చాయి.

ఈ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ మరింత వృద్ధి చెందేందుకు స్మార్ట్‌టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల తయారీకి PLI పథకాలను విస్తరించాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉత్పత్తులపై ఇన్‌కం ట్యాక్స్ శ్లాబులను తిరిగి పునఃసమీక్ష చేయవచ్చని భావిస్తున్నారు. ఇది సాధారణ వినియోగాన్ని పెంచుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ బడ్జెట్ 2024లో మొబైల్ ఫోన్ విడిభాగాలపై దిగుమతి సుంకాలను ( ఇంపోర్టు డ్యూటీస్ ) తగ్గించే అవకాశం ఉందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆపిల్ వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

స్మార్ట్‌ఫోన్ల తయారీ ఖర్చులను తగ్గించేందుకు అనేక విడిభాగాలపై సంకాన్ని తగ్గించాలని అనేక తయారీ సంస్థలు కోరుతున్నాయి. ఇండియా సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ సమాచారం ప్రకారం.. కెమెరా మాడ్యూల్స్, ఛార్జర్‌లతో సహా మొబైల్ ఫోన్ విడి భాగాలపై దిగుమతి సుంకాలు 2.5 నుంచి 20 శాతం వరకు ఉన్నాయి. చైనా సహా ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంది.
టెలివిజన్ తయారీలో ముఖ్యమైన ఓపెన్ సెల్ కాంపోనెంట్స్‌పై ధరలు గణనీయ స్థాయిలో మారుతుంటాయి. 10% నుంచి 800% మధ్య హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున టీవీల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనిపై బడ్జెట్‌లో మరింత స్పష్టత వచ్చే్ అవకాశం ఉంది.
అయితే గత రెండు బడ్జెట్‌లలో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు కంప్యూటర్ల ధరలు కొంతమేర తగ్గాయి. అయితే ఈ ఏడాడి కూడా కొంత వరకు తగ్గే అవకాశం ఉంటుందని ఎలక్ట్రానిక్ పరిశ్రమ భావిస్తోంది. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో భారీ ఉపసమనం లభించే అవకాశం లేదని తెలుస్తోంది.
బడ్జెట్ 2024 లైవ్ వివరాలు: ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో మధ్యంత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దూరదర్శన్ సహా పార్లమెంట్ టీవీల ద్వారా లైవ్ చూడవచ్చు. దీంతోపాటు ఆయా సంస్థల యూట్యూబ్, సోషల్‌మీడియా వేదికల ద్వారా కూడా బడ్జెట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.


Click it and Unblock the Notifications








