ఆకాశం నుంచి సెల్ఫోన్కు సిగ్నల్ రానుందా.. జనవరి 27 న ఎలాన్ మస్క్ ఏం చేయనున్నారు..?
మొబైల్ ఫోన్కు సిగ్నల్ ఎక్కడ నుంచి వస్తుందంటే నెట్వర్క్ టవర్ల నుంచి అని అందరూ చెప్తారు. మరి కొన్ని నెలలు లేదా సంవత్సరాల్లో ఇదే ప్రశ్న మీరు ఎవరినైనా అడిగితే ఆకాశం నుంచి కూడా సిగ్నల్ వస్తుంది అని చెప్పే రోజులు రానున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు ఉపగ్రహాలతో సిగ్నల్ను అందించేందుకు కృషి చేస్తున్నాయి. అయితే దీని వల్ల ఉపయోగం ఏంటి అనే ప్రశ్న అందరిలో తలెత్తే అవకాశం ఉంది. అయితే ఈ కథనం పూర్తిగా చదివేయండి మరి.
డైరెక్ట్ టూ సెల్ :
గతంతో పోలిస్తే మొబైల్ నెట్వర్క్ విస్తరించింది. దేశంలో అత్యధిక ప్రాంతాలకు మొబైల్ సిగ్నల్స్ అందుతున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్య ఉంది. దీంతోపాటు ప్రకృతి విపత్తుల వంటి అత్యవసర సమయాల్లో సెల్ టవర్ల వ్యవస్థ డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొండ ప్రాంతాలు, మారుమూల ప్రదేశాల్లో ఉహగ్రహాల ద్వారా నెట్వర్క్ను అందించవచ్చు. దీన్ని 'డైరెక్ట్ టూ సెల్' (Direct to Cell) అని అంటారు.

కీలక ప్రకటన చేసిన ఎలాన్ మస్క్ :
అయితే SpaceX అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక ప్రకటన చేశారు. జనవరి 27 నుంచి స్పేస్ఎక్స్ డైరెక్ట్ టూ సెల్ బీటా టెస్టింగ్ సర్వీస్ ప్రారంభిస్తుందని తెలిపింది. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ టెస్టింగ్ విజయవంతం అయితే డెడ్ జోన్ అనే పేరే వినిపించదు. ఫలితంగా ఏ ప్రాంతం నుంచి అయినా.. కాల్, SMS, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయవచ్చు.
మొబైల్ టవర్ల అవసరం ఉండదా?
డైరెక్ట్ టూ సెల్ టెక్నాలజీతో మొబైల్ టవర్ల అవసరం ఉండదు. దిగువ కక్ష్యలో ఉండే ఉపగ్రహాల ద్వారా సిగ్నల్ అందుతుంది. ఈ శాటిలైట్లే మొబైల్ టవర్లుగా పనిచేస్తాయి. అయితే ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొనేందుకు కొత్త ఫోన్లు మరియు అదనపు హార్డ్వేర్ అవసరం లేదని తెలుస్తోంది.
అడ్వాన్స్డ్ రాకెట్లు :
గతంతో పోలిస్తే దేశంలో అత్యధిక ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన నెట్వర్క్ అందుబాటులో లేదు. స్టార్లింక్ తాజా ప్రయోగంతో ఎప్పటి నుంచో ఉన్న కనెక్టివిటీ సమస్యకు చెక్పెట్టే అవకాశం ఉంది. ఇందుకోసం స్పేస్ఎక్స్ తన అనుభవాన్ని అంతా ఉపయోగించింది. మరియు అడ్వాన్స్డ్ రాకెట్లను మరియు స్పేస్క్రాఫ్ట్లను వినియోగించింది.
BSNL కూడా :
ప్రభుత్వ రంగ సంస్థ BSNL కూడా D2D (డైరెక్ట్ టూ డివైజ్) టెక్నాలజీ కోసం అమెరికా సంస్థ వయాశాట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల ఈ టెక్నాలజీని టెస్టింగ్ చేసింది. నాన్ టెర్రిస్ట్రియల్ నెట్వర్క్ కనెక్టివిటీతో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను ఉపయోగించి ఈ టెక్నాలజీని పరీక్షిస్తోంది.
త్వరలో మరిన్ని వివరాలు :
స్టార్లింక్ శాటిలైట్లు భూమికి కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఫలితంగా మెరుగైన కనెక్టివిటీని పొందవచ్చు అని తెలుస్తోంది. అదే BSNL D2D టెక్నాలజీ వయాశాట్ జియో స్టేషనరీ L బ్యాండ్ ఉపగ్రహాలపై ఆధారపడి పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








