ట్విట్టర్ (X) వినియోగదారులు అందరూ కనీస నగదు చెల్లించాల్సిందే..?
ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక ఎలాన్ మస్క్ అనేక కీలక మార్పులు చేశారు. ట్వి్ట్టర్ పేరు సహా లోగో మార్చేశారు. దీంతోపాటు ట్విట్టర్ (X)ను ఎవ్రీథింగ్ యాప్‌గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు X సీఈవో లిండా గతంలోనే వెల్లడించారు. ఈ విధంగానే తమ లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
అయితే X (ట్విట్టర్) గురించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రానున్న రోజుల్లో X (ట్విట్టర్) ను వినియోగించేందుకు నెలవారీగా కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. నకిలీ ఖాతాలు సహా ఇతర సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే చెల్లించాల్సి ఉంటుందో వెల్లడి కాలేదు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన సంభాషణలో ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంభాషణలో ప్రస్తుతం ప్రతినెలా 550 మిలియన్ల మంది Xను వినియోగిస్తున్నారు. ఇందులో ప్రతిరోజూ 100 నుంచి 200 మిలియన్ల మంది పోస్టులు చేస్తున్నట్లు మస్క్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎన్ని నకిలీ ఖాతాలు ఉన్నాయో వెల్లడించలేదు.
ఎలాన్ మస్క్, నెతన్యాహు మధ్య జరిగిన సంభాషణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, నియంత్రణ, ప్రమాదాలు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ద్వేషపూరిత ప్రసంగాల ప్రసారం వంటి ఘటనలపై మస్క్‌కు ఎదురుదెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది. అయితే పెయిడ్ వెర్షన్‌గా ట్విట్టర్ ఎప్పటి నుంచి మార్పులు చోటుచేసుకుంటాయో వెల్లడికాలేదు.
ఎలాన్‌మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక అనేక కీలక మార్పులు చేశారు. ప్రారంభంలోనే కీలక స్థానాల్లోని వారిని తొలగించారు. దాంతోపాటు వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక.. ఒకరకంగా దానిపై ఎలాన్ మస్క్ ప్రయోగాలు చేశారు. ప్రముఖుల అకౌంట్లకు ఉన్న బ్లూటిక్‌ను తొలగించారు. అనంతరం మళ్లీ పునరుద్ధరించారు.
బ్లూటిక్ కోసం ప్రత్యేక ప్లాన్‌లను తీసుకొచ్చాడు. కొన్నిరోజుల క్రితం ట్వీట్లకు పరిమితిని విధించాడు. దీనిపై నెటిజన్ల నుంచి భారీ అసంతృప్తి వ్యక్తం అయింది. వెరిఫైడ్ ఖాతాల కలిగిన వ్యక్తులు రోజుకు పదివేల ట్వీట్లు, వెరిఫైడ్ ఖాతా లేకున్నా చాలా కాలం నుంచి ట్వీట్టర్ అకౌంట్ కలిగి వ్యక్తులు రోజుకు వెయ్యి ట్వీట్లు, కొత్తగా అకౌంట్ తెరిచి వెరిఫైడ్ అకౌంట్ లేకుంటే కేవలం 500 ట్వీట్లు మాత్రమే చూడగలిగేలా మార్పులు చేశారు.
దాంతోపాటు ట్విట్టర్ సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఎక్స్ కార్ప్‌లో విలీనం చేశారు. అనంతరం 2012 నుంచి ఉన్న ట్విట్టర్ లోగోను తొలగించి, దాని స్థానంలో Xను ఏర్పాటుచేశారు. పూర్తిగా రీబ్రాండ్ వెర్షన్‌గా మార్చేందుకు కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవ్రీథింగ్ యాప్‌గా మార్చే దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. గతంలో ట్విట్టర్ నుంచి నిషేధించబడిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను X ఫ్లాట్‌ఫాంలోకి అనుమతి ఇచ్చారు.
ఇటీవలే ట్విట్టర్ వీడియో స్వైప్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ తరహా ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మాదిరిగా ఉంటుంది. Xలో వీడియోలు చూసేందుకు పైకి స్వైప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌కు సంబంధించిన ఫోన్ X (ట్వి్ట్టర్) తన అధికారిక హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. అల్గారిథమ్ ద్వారా వీడియోలను సిఫార్సు చేస్తుందని తెలిపింది. దీంతోపాటు X ఫ్లాట్‌ఫాంలో ఆడియో, వీడియో కాల్ సదుపాయం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది.


Click it and Unblock the Notifications








