యూట్యూబ్‌ను టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్.. త్వరలో కొత్త యాప్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటన..!
ప్రపంచ కుబేరుడు X (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. త్వరలో టీవీ యాప్ లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అమెజాన్ మరియు శాంసంగ్ యూజర్లు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు చూసేందుకు వీలుగా వచ్చే వారం టీవీ యాప్‌ను లాంచ్ చేస్తున్నట్లు మస్క్ తెలిపారు. ఓ సోషల్‌మీడియా యాజర్‌కు ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.
యూట్యూబ్‌కు పోటీ..?
కొన్ని కథనాల ప్రకారం ఎలాన్ మస్క్ విడుదల చేయనున్న టీవీ యాప్.. ప్రస్తుతం యూట్యూబ్ టీవీ యాప్ తరహాలోనే ఉంటుందని తెలుస్తోంది. మరో నివేదిక ప్రకారం యూట్యూ్బ్‌కు పోటీనిచ్చే విధంగా ఈ కొత్త టీవీ యాప్‌ను మస్క్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.

* ఎవ్రీథింగ్ యాప్‌గా.. : దీంతోపాటు ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పుటి నుంచి పూర్తిస్థాయి మార్పులకు శ్రీకారం చుట్టారు. X (ట్విట్టర్) ఎవ్రీథింగ్ యాప్‌గా మార్చే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫోన్ నంబర్‌లో సంబంధం లేకుండా X నుంచి నేరుగా ఆడియో, వీడియో కాల్స్ చేసుకొనే ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
విడుదల సమయంలో ఈ ఫీచర్ కేవలం ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇటీవల ఆడియో/ వీడియో కాలింగ్ ఫీచర్ X ప్లాట్‌ఫాం వినియోగదారులు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతోపాటు ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. త్వరలో X మనీ ట్రాన్సిమీటర్ లైసెన్స్ పొందుతుందని చెప్పారు. అంటే ఈ ప్లాట్‌ఫాం ద్వారా నగదు బదిలీ చేసేకొనే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
దీంతోపాటు X ప్లాట్‌ఫాంను ఉద్యోగ నియామక సమాచారం (Job Search) అందించే ప్లాట్‌ఫాంగా మార్చే ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. X వేదికగా నియామకాలు చేపట్టేందుకు సుమారు 1 మిలియన్ సంస్థలు ఎదురుచూస్తున్నాయని సంస్థ వెల్లడించింది. అనేక సంస్థల్లో లక్షలాది ఉద్యోగాల కోసం ఇప్పటికే Xలో పోస్టులు చేయబడ్డాయని సంస్థ తెలిపింది.
ప్రస్తుతం X ప్లాట్‌ఫాంలో 1 మిలియన్‌కి పైగా ఉద్యోగాలకు సంబంధించిన పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థికపరమైన సేవలకు సంబంధించిన సర్వీసులు మరియు ఇతర సంస్థలు తమకు కావాల్సిన అభ్యర్థుల కోసం X ద్వారా వెతుకుతున్నాయని పేర్కొంది. లింక్‌డిన్ వంటి సంస్థలు ఇప్పటికే ఉద్యోగ సమాచారాన్ని అందిస్తు్న్నాయి.
దీంతోపాటు త్వరలో తాను మొబైల్ నంబర్‌ను నిలిపేస్తానని, X ఆడియో/ వీడియో కాల్ ఫీచర్ ద్వారా మెసెజ్, ఆడియో, వీడియో కాల్స్ చేస్తానని వెల్లడించారు. ఈ ఫీచర్‌ను ప్రమోట్ చేసే ఉద్దేశంతోనే ఎలాన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌లో ఎవరు తమకు కాల్ చేయవచ్చునో ఎంపిక చేసుకోవచ్చు. అక్కడ మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
ఈ ఆప్షన్ మీకు కనిపించకుంటే ముందుగా X (ట్విట్టర్) యాప్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. తర్వాత ప్రైవసీ మరియు సెక్యూరిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అనంతరం డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి. చివరికి అక్కడ కనిపించిన ఆడియో మరియు వీడియో కాలింగ్ ఫీచర్‌ను ఎంచుకోవాలి. అక్కడ కుడివైపున ఫోన్ సింబల్‌ను గుర్తించవచ్చు.


Click it and Unblock the Notifications








