Elon Musk శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీ స్టార్‌లింక్ సేవలు ఇండియాలో!!! త్వరలోనే...
ఎలోన్ మస్క్ యొక్క స్పేస్‌ఎక్స్ సంస్థ మద్దతు గల శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీ స్టార్లింక్ భవిష్యత్తును ఇండియాలోకి తీసుకురావడానికి కష్టపడుతోంది. భారతదేశంలోని అనేక సంస్థలు దేశంలో సంస్థ యొక్క సేవలను ప్రారంభించినప్పుడు ప్రజలు దాని యొక్క దాని భవిష్యత్తు మరియు దాని సర్వీసుల యొక్క ప్లాన్ల విషయంలో చాలా వాదనలు వినిపించాయి. ఇటువంటి సందేహాలను తొలగిస్తూ ఐలోన్స్ నివేదిక ప్రకారం భారతదేశంతో సహా పలు కొత్త ప్రాంతాలలో స్టార్లింక్ తన అప్‌గ్రేడ్ సాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభిస్తున్నట్లు ఎలోన్ మస్క్ తెలిపారు. స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా వేగవంతమైన ఇంటర్నెట్‌ను సరసమైన ధరల వద్ద అందిస్తున్నట్లు మస్క్ అభిప్రాయపడ్డారు. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

స్టార్లింక్ బ్రాడ్‌బ్యాండ్ 300 Mbps స్పీడ్ ఆఫర్
స్టార్లింక్ బ్రాడ్‌బ్యాండ్ తన యొక్క వినియోగదారులకు అందించే గరిష్ట వేగాన్ని కూడా ఇప్పుడు అప్‌గ్రేడ్ చేస్తుంది. ప్రస్తుతం కంపెనీ గరిష్టంగా 150Mbps వరకు వేగంతో ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. అయితే అది త్వరలో 300Mbps కు అప్‌గ్రేడ్ అవుతుంది. 12,000 ఉపగ్రహాల నెట్‌వర్క్ సహాయంతో ఇటువంటి హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించాలని కంపెనీ యోచిస్తోంది. స్టార్లింక్ ఇప్పటికే 1,200 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది మరియు త్వరలో మరిన్ని పంపించే పనిలో ఉంది.

మస్క్ ఈ విషయాన్ని తన యొక్క ట్విట్టర్‌లో ఒక వినియోగదారుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ధృవీకరించారు. బిలియనీర్ ఈ ఏడాది చివర్లో స్టార్లింక్ సేవలు పూర్తిగా ‘మొబైల్' అవుతాయని, వినియోగదారులు తాము కోరుకున్న చోట ‘డిషీ మెక్‌ఫ్లాట్‌ఫేస్' (కంపెనీ అందించిన డిష్ టెర్మినల్) ను తీసుకెళ్లగలరని చెప్పారు. వినియోగదారులు తమ హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను వారు ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్లగలరని దీని అర్థం.

బ్యాండ్‌విడ్త్ మరియు జాప్యంతో పాటు స్టార్‌లింక్ యొక్క సేవ సమయాలు వేగంగా మెరుగుపడుతున్నాయని మస్క్ చెప్పారు. ఈ కొత్త ప్రయోగం వేసవి నాటికి బీటా నుండి బయటకు వస్తుందని భావిస్తున్నారు. భారతదేశంలోని ప్రజలు ప్రస్తుతం $99 పేమెంట్ ను ఎంచుకోవడం ద్వారా స్టార్లింక్ నుండి కనెక్షన్‌ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో వినియోగదారుడు సేవలను పొందకూడదనుకుంటే అది పూర్తిగా తిరిగి చెల్లించబడుతుందని కంపెనీ తెలిపింది. ఈ సేవలు అతి త్వరలో భారతదేశానికి వస్తాయని మస్క్ చెప్పినప్పటికీ సాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు అప్‌గ్రేడ్ కు సంబందించిన మార్గదర్శకాలు ఏమిటో చూడాలి. ప్రభుత్వం త్వరలో కొత్త మార్గదర్శకాలను వెల్లడిస్తుంది.


Click it and Unblock the Notifications








