Home
News

X (ట్విట్టర్‌) ను విక్రయించిన ఎలాన్‌ మస్క్‌.. ఈ ట్విస్ట్ ఉహించలేరు..!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ (Elon Musk) కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం X ను (గతంలో ట్విట్టర్‌) తిరిగి విక్రయించినట్లు ప్రకటన చేశారు. X లో ఈ మేరకు పోస్ట్‌ చేశారు. ఇందుకు కారణాలను కూడా ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. 2022 లో ట్విట్టర్‌ ను కొనుగోలు చేసిన మస్క్‌.. కీలక మార్పులు చేశారు. పేరు, లోగోతో సహా భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసివేశారు. దీంతోపాటు అనేక ఫీచర్‌లను తీసుకొచ్చారు. అయితే తాజాగా ఎవరూ ఉహించని విధంగా X ప్లాట్‌ఫాంను అమ్మేశారు.

ఎవరు కొనుగోలు చేశారు? :
ChatGPT ను లాంచ్‌ చేసిన ఓపెన్‌ఏఐ కు పోటీగా ఎలాన్‌ మస్క్‌ 2023 లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ xAI స్టార్టప్‌ ను ప్రారంభించారు. ప్రస్తుతం అదే సంస్థకు X ప్లాట్‌ఫాంను విక్రయించినట్లు చెప్పారు. 33 బిలియన్‌ డాలర్‌లకు X ను విక్రయినట్లు చెప్పారు. ప్రస్తుతం xAI విలువ 80 బిలియన్‌ డాలర్‌లుగా ఉందని తెలిపారు. ఈ లావాదేవీ పూర్తిగా స్టాక్‌ రూపంలో జరిగిందన్నారు.

elon musk sold X platform to his own artificial intelligence startup xAI in telugu

ఉత్తమ ఫలితాలు :
xAI, X ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని, డేటా మోడల్స్‌ ను అనుసంధానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. xAI అడ్వాన్స్‌డ్‌ AI సామర్థ్యాలను X (గతంలో ట్విట్టర్‌) కు అనుసంధానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయని చెప్పారు.

అనేక మార్పులు, వివాదాలు :
X ప్లాట్‌ఫాం ఎవ్రీథింగ్‌ యాప్‌ గా మార్చాలనే లక్ష్యంతో అనేక మార్పులు చేశారు. అనేక ఫీచర్‌లను తీసుకొచ్చారు. దీంతోపాటు అనేక వివాదాలు కూడా చెలరేగాయి. X లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చాట్‌బాట్‌ ను గ్రాక్‌ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా అనేక ఫీచర్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.

డేటా సెంటర్‌లను నిర్మించే స్థాయికి :
X, xAI సంస్థలు ఇక నుంచి కలిసి పనిచేస్తాయని, యూజర్‌లకు మరింత మెరుగైన ప్రయోజనాలు అందుతాయని చెప్పారు. 2023 సంవత్సరంలో xAI ను ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద AI ల్యాబ్స్‌ లో ఒకటిగా ఉంది. డేటా సెంటర్‌లను నిర్మించే స్థాయికి చేరుకుంది. x లో ప్రస్తుతం 600 మిలియన్‌ల కంటే ఎక్కువ మంది యాక్టివ్‌ యూజర్‌లను కలిగి ఉంది.

మానవ పురోగతికి :
ఇవాళ అధికారికంగా డేటా, మోడల్స్‌, కంప్యూట్‌, డిస్ట్రిబ్యూషన్‌, ప్రతిభను అనుసంధానం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇది ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాకుండా మానవ పురోగతిని మరింత వేగవంతం చేసే ప్లాట్‌ఫాంను నిర్మించడానికి వీలు కల్పిస్తుందని ఎలాన్‌ మస్క్‌ తెలిపారు.

ఎలాన్‌ మస్క్‌ :
ఎలాన్ మస్క్‌ ప్రస్తుతం స్పేస్‌ఎక్స్‌, టెస్లా సంస్థలకు అధినేతగా ఉన్నారు. దీంతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు సలహాదారుడిగా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్న్‌మెంట్‌ ఎఫీషియన్సీ (డీఓజీ) లోను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మే నెలాఖరులో ఈ డీవోజీ బాధ్యతల నుంచి వైదొలగాలను భావిస్తున్నట్లు ఇటీవలే మస్క్‌ ప్రకటన చేశారు.;

More from GizBot

Best Mobiles in India

English summary
elon musk sold X platform to his own artificial intelligence startup xAI
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X