Home
News

భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ పరిశ్రమ... రిలయన్స్‌తో కీలక చర్చలు జరుగుతున్నాయా..!

భారత్‌లో భవిష్యత్‌ ఎలక్ట్రిక్‌ కార్ల రంగానిదేనని కేంద్ర ప్రభుత్వం సహా అనేక కార్ల తయారీ సంస్థలు బలంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా భారీగా నిధులు వెచ్చిస్తోంది. అయితే ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌ ఎంట్రీపై (Tesla EV Plant in india) ఎప్పటి నుంచో సన్పెన్స్ కొనసాగుతోంది.

అయితే ఈ సస్పెన్స్‌కు త్వరలో ముగింపు దొరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ది హిందూ బిజినెస్‌లైన్‌ కథనం ప్రకారం భారత్‌లో సరైన భాగస్వామి కోసం ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నేతృత్వంలోని టెస్లా సంస్థ ప్రయత్నాలు చేస్తోందని తెలిసింది. ఇందుకోసం టెస్లా.. రిలయన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

tesla in talks with reliance industries limited

దేశీయ భాగస్వామంతో భారత్‌లో టెస్లా తన తొలి తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఈ కథనం సారాంశం. ఇందులో రిలయన్స్‌ పాత్ర ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గత సంవత్సరం రిలయన్స్‌ సంస్థ తొలిగించదగిన మరియు మార్చుకోదగిన (Removable and Swappable) బ్యాటరీల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసింది.

ఎలాన్‌ మస్క్ భారత్ పర్యటన :
దీంతోపాటు ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఆసక్తి చూపిస్తోంది. ఇది టెస్లా కార్యకలాపాలకు ఎంతో అనువుగా ఉండే అవకాశం ఉంది. ఈ నెలలోనే ఎలాన్‌ మస్క్‌.. టెస్లా సీనియర్‌ అధికారులతో కలిసి భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరియు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

గుజరాత్‌ మరియు మహారాష్ట్రలో :
ఈ పర్యటనలోనే టెస్లా తయారీ ప్లాంట్‌కు సంబంధించిన ప్రాంతాన్ని ఖరారు చేయడం ప్రధాన ఎజెండాగా ఉంది. అయితే ఈ జాబితాలో గుజరాత్‌ మరియు మహారాష్ట్ర ముందు వరుసలో ఉన్నాయి. గత సంవత్సరమే ఎలాన్ మస్క్‌ భారత్‌ మార్కెట్‌పై తన ఆసక్తిని వెల్లడించారు.

దీంతోపాటు భారత్‌ ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహిస్తోంది. అయితే కొత్త ప్లాంట్‌ కోసం టెస్లా $2 బిలియన్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు భారత్‌ నుంచి ఆటో విడిభాగాల కొనుగోలుకు గణనీయంగా పెంచాలని టెస్లా భావిస్తోంది. మరియు దీన్ని $15 బిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

అయితే బెంగళూరులో టెస్లాకు చెందిన X మోడల్‌ కారు చక్కర్లు కొట్టింది. అయితే ఈ రెడ్‌ కలర్‌ కారును దుబాయ్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్‌లో టెస్లా తన Y మోడల్‌తో ప్రారంభించాలని భావిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
elon musk tesla in discussion with reliance to setup EV manufacturing plant
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X