2019లో భారత పర్యటనకు ఎలాన్ మస్క్?

By GizBot Bureau

  టెస్లా కంపనీ సీఈఓ ఇంకా స్పేక్స్ ఎక్స్ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ త్వరలో భారత్ లో పర్యటించే ఆవకాశం ఉంది. అంతా ఓకే అయితే 2019 ఆరంభంలో ఈ పర్యటన ఉంటుంది. ఇటీవలే చైనా పర్యటనను పూర్తిచేసుకున్న ఆయన భారత్‌లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసారు. ఓ ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా భారత పర్యటనకు సంబంధించి తన అభిప్రాయాన్ని ఎలాన్ మస్క్ వ్యక్తం చేసారు.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  చట్టాలు మరింత కఠినతరంగా ఉండటంతో...

  మార్కెట్ విస్తరణలో భాగంగా ఎలాన్ మస్క్ తన టెస్లా ఎలక్ట్రిక్ కార్లను 2017లోనే భారత్‌లో ప్రవేశపెట్టాలనుకున్నారు. అయితే, ఇక్కడి చట్టాలు మరింత కఠినతరంగా ఉండటంతో ప్రాజెక్టుకు ఆదిలోనే బ్రేకులు పడ్డాయి. మేము భారత్‌లో విస్తరించాలనుకుంటున్నాం, అయితే ఊహించని రీతిలో ఇక్కడ నెలకున్న పరిస్థితులు మాకు ఛాలేంజింగ్‌గా ఉన్నాయంటూ ఎలాన్ మస్క్ గడచిన మేలో ఓ ట్వీట్‌ను పోస్ట్ చేసారు.

  మోడల్ 3 కార్లతో మార్కెట్లోకి..

  టెస్లా ఎలక్ట్రిక్ కార్లు భారత్ మార్కట్లోకి అడుగుపెట్టకపోవటానికి ఫారిన్ డైరక్ట్ ఇన్వెస్టిమెంట్ నిబంధనలే ప్రధాన కారణమని మస్క్ ఆరోపించారు. ఈ సమస్య పరిష్కారం పై తమ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దీపక్ అహూజా శ్రమిస్తున్నారని, త్వరలోనే తమకు సానుకూలమైన స్పందన లభించే అవకాశముందని ఆయన తెలిపారు. వాస్తవానికి టెస్లా కంపెనీ మోడల్ 3 కార్లలో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టాలనుకుంది. ఈ కారు ఖరీదు 35,000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ 23,97,000 రూపాయిలు).

  చైనా పర్యటన విజయవంతం..

  తన చైనా పర్యటన పై ఎలాన్ మస్క్ స్పందిస్తు మూడు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసిందని తెలిపారు. సీనియర్ లీడర్స్ తో తాను జరిపిన చర్చలు విజయవంతంగా ముగిసాయిని, ఈ చర్చల్లో భాగంగా దేశంలో సుధీర్ఘ పెట్టుబడుల పై తాము చర్చించినట్లు మస్క్ తెలిపారు. చైనాలో టెస్లా గిగాఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి షాంఘై ప్రభుత్వంతో ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ కంపెనీ ద్వారా సంవత్సరానికి 5 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేయాలనుకుంటున్నట్లు మస్క్ తెలిపారు.

   

   

  రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్...

  తన విప్లవాత్మక ఆలోచనలతో ఆకాశమే హద్దుగా ఎలాన్ మస్క్ (Elon Musk) దూసుకుపోతున్నారు. ఈ రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దక్షిణాఫ్రికాలో జన్మించిన ఈ కెనడియన్-అమెరికన్ వ్యాపార దిగ్గజం టెస్లా మోటార్స్, సోలార్ సిటీ, స్పేస్ ఎక్స్, పేపాల్ వంటి సంస్థలను స్థాపించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.

  ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్‌కు మొట్టమొదటి కమర్షియల్ రాకెట్‌...

  ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్‌కు మొట్టమొదటి కమర్షియల్ రాకెట్‌ను అందించిన ఘనత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని SpaceX కంపెనీకే దక్కుతుంది. మానవ అంతిరక్ష ప్రయాణాన్ని మరింత విప్లవాత్మకం చేసే క్రమంలో ఇలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కార్పొరేషన్ తీవ్రంగా శ్రమిస్తోంది. తిరిగి ఉపయోగించుకోదగిన (రీయూజబుల్) రాకెట్‌ను దిగ్విజయంగా పరీక్షించి ఓ సరికొత్త ఆవిష్కరణను SpaceX కార్పొరేషన్ విజయవంతం చేయగలిగింది.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Tesla CEO Elon Musk who just completed his three-day visit to China, has shown an interest in visiting India in early 2019. He has said India generally makes him hopeless when it comes to tough government regulations.
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more