ఏప్రిల్-జూన్‌లలో భారీ ఎత్తున ఐటీ, టెలికాంలో నియామకాలు

Posted By: Super

ఏప్రిల్-జూన్‌లలో భారీ ఎత్తున ఐటీ, టెలికాంలో నియామకాలు

వ్యాపార పరిస్థితులు ఆశావహంగా ఉన్న నేపథ్యంలో దేశీ కంపెనీలు జోరుగా రిక్రూట్‌మెంట్ జరపనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పెద్ద ఎత్తున కొలువులు ఇవ్వనున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్ సర్వీసెస్ ఈ విషయాలు వెల్లడించింది. సంస్థ నిర్వహించే ఉపాధి అవకాశాల సూచీ ఈ ఏడాది రెండో త్రైమాసికానికి సంబంధించి.. అంతకు ముందు క్వార్టర్‌తో పోలిస్తే అయిదు పాయింట్లు పెరిగి 74కి చేరింది.

దీని ప్రకారం, ఐటీ, ఐటీఈఎస్, టెలికాం రంగాల్లో హైరింగ్ సెంటిమెంట్ అత్యధికంగా 20 శాతం మేర పెరిగింది. టెలికాం వృద్ధికి అనుగుణంగా ఈ రంగంలో నియామకాలు ఎక్కువగా ఉండనున్నట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ సంగీతా లాలా తెలిపారు. ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులకు సంబంధించి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పుణేలో హైరింగ్ సెంటిమెంటు అత్యధికంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. అయితే, ఇంజనీరింగ్, తయారీ రంగాల్లో ఈ క్వార్టర్లో అవకాశాలు తగ్గనున్నాయి. మొత్తం మీద ఎంట్రీ, మిడిల్, సీనియర్ వంటి అన్ని స్థాయిల్లోనూ నియామకాలు ఉంటాయని సర్వే వెల్లడించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot