నిలిచిపోనున్న విండోస్ ఎక్స్‌పీ సేవలు.. ఇబ్బందులో ఏటీఎమ్ సెంటర్లు

Posted By:

గత కొద్ది సంవత్సరాల కాలంగా కంప్యూటింగ్ ప్రపంచానికి విశిష్టసేవలందిస్తున్న అత్యుత్తమ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ ఎక్స్‌పీ మరో నెల రోజుల్లో కనుమరుగు కానుంది. దింతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఏటీఎమ్ సెంటర్లు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొనున్నాయి.

హ్యాకర్ల రిస్క్‌లో ఏటీఎమ్ సెంటర్లు..?

విండోస్ ఎక్స్‌పీ సపోర్ట్ నిలిచిపోనున్న నేపధ్యంలో ఏటీఎమ్ సెంటర్ల పై హ్యాకర్ల ముప్పుతో పాటు వైరస్ దాడులు హచ్చుమీరే అవకశాలు లైకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇందుకు కారణం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పనిచేస్తున్న లక్షలాది ఏటీఎమ్ సెంటర్లు విండోస్ ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవటమే!. ఏప్రిల్ 8తో మైక్రోసాఫ్ట్ తన విండోస్ ఎక్స్‌పీ సపోర్ట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది. 2001 నుంచి విండోస్ ఎక్స్‌పీ సేవలందిస్తోంది.

అమెరికాలో 95శాతం ఏటీఎమ్‌లు విండోస్ ఎక్స్‍‌‌పీ పైనే రన్ అవుతున్నాయట. విండోస్ ఎక్స్‌పీ కనమరుగుకానుందన్న వార్తను తెలుసుకన్న కోట్లాది మంది మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్లు ఇప్పటికే విండోస్ 7, విండోస్ 8 ఆపరేటింగ్ వర్షన్‌లకు అప్‌గ్రేడ్ అయ్యారు. విండోస్ ఎక్స్‌పీ ముగింపు నేపధ్యంలో ఏటీమ్ సెంటర్ల నిర్వహణ యాజమాన్యాలు ఏవిధమైన చర్యలు తీసుకోనున్నాయో త్వరలో వెల్లడికానుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot