‘ఎనర్జీ ఎగ్’.. ఓ నాన్న ప్రయోగం!

Posted By: Prashanth

‘ఎనర్జీ ఎగ్’.. ఓ నాన్న ప్రయోగం!

 

‘పనిలోపడో.. ఆదమరుపునో విద్యుత్‌ను వృథా చేస్తున్నారా..? బయటకు వెళ్లిన సందర్భాల్లో లైట్లు, ఫ్యాన్లను ఆఫ్ చేయటం మర్చిపోతున్నారా..? ‘ఎనర్జీ ఎగ్’ అనే కొత్త సాంకేతిక పరికరంతో విద్యుత్‌ను అవసరం మేరకే వాడుకుంటూ ఇతరులకు ఆదర్శప్రాయులు కండి’

తన కుటుంబ సభ్యులు విద్యుత్‌ను వృథాచేస్తుండటాన్ని ఏమాత్రం ఇష్టపడని ఆ తండ్రి వినూత్న ఆలోచనతో కొత్త ఆవిష్కరణకు తెరలేపాడు. ఎవరూ లేని సమయంలో నిరుపయోగంగా పనిచేస్తున్న విద్యుత్ ఉపకరణాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసే సాంకేతిక పరికరాన్నిఅమెరికన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బ్రియాన్ రెయిలీ రూపొందించాడు. పేరు ‘ఎనర్జీ ఎగ్’. గుడ్డు ఆకారంలో ఉండే ఈ పరికరం సెన్సర్ల ద్వారా వ్యక్తుల కదలికలను గుర్తిస్తుంది. వైర్‌లెస్ టెక్నాలజీతో దీన్ని విద్యుత్ కంట్రోల్ బోర్డుకు అనుసంధానిస్తారు. గదిలో ఎవరూ లేకపోతే నిమిషం పాటు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువులకు విద్యుత్ సరఫరా నిలిపేస్తుంది. ఈ ప్రయోగం విజయవంతం కావటంతో బ్రియాన్ తన ఉద్యోగానికి స్వస్తిచెప్పి ఈ ఉపయోగకర పరికరాన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. అంతేకాదండోయ్.. మనోడు ఇదే ఉత్సాహంతో విద్యుత్ ఆదా చేసే స్మార్ట్‌ఫోన్ చార్జర్, స్మార్ట్‌లైట్ స్విచ్ పరికరాలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాడు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting