18న వికీపీడియా మూత, పైరసీ బిల్లుపై ఆగ్రహం?

Posted By: Prashanth

18న వికీపీడియా మూత, పైరసీ బిల్లుపై ఆగ్రహం?

 

జనవరి 18, 2012ని, బ్లాక్ అవుట్‌గా పరిగణించి ఇంగ్లీషు వీకీపీడియా కమ్యూనిటీ 24 గంటలు మూత పడనుంది. దీనికి గల కారణం అమెరికా సంయుక్త సెనేట్ లో సంయుక్త హౌస్ లో స్టాప్ ఆన్లైన్ పైరసీ చట్టాన్ని (SOPA) ప్రవేశపెట్టారు. ఈ చట్టం వల్ల యునైటెడ్ స్టేట్స్ లోపల అంతర్జాతీయ వెబ్సైట్లను సెన్సార్షిప్ కొత్త ఉపకరణాలు, ఓపెన్ ఇంటర్నెట్ హాని గురించి తెస్తుంది. దీంతో యునైటెడ్ స్టేట్స్ ప్రతిపాదిత చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ వికీపీడియా కమ్యూనిటీ ఈ అపూర్వమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని సోమవారం పత్రికా ముఖంగా తెలియజేశారు.

72 గంటలు కాలంలో 1800 వికిపీడియన్స్ కమ్యూనిటీ ఏకమయ్యి SOPA మరియు పిపా వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు చర్చలు ప్రారంభించారు. వీకీపీడియా చరిత్రలో ఇంత మంది వీకీపీడియన్స్ ఒక్కసారిగా కలసి చర్చించడం ఇదే మొదటి సారి. ఈ రెండు బిల్లులను ప్రతిస్పందనగా ఎక్కువ ప్రజా చర్య ప్రోత్సహించడానికి కమ్యూనిటీ చర్య మద్దతుగా అఖండమైన మెజారిటీని కోరారు. ఈ సందర్బంలో జిమ్మీ వేల్స్, వికీపీడియా స్థాపకుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నేడు వికిపీడియన్స్ ఈ విధ్వంసక చట్టం తమ వ్యతిరేకతను గురించి మాట్లాడారని అన్నారు.

In English

ఇక గతంలో భారతదేశంలో వీకిపిడియా మొట్టమొదటి సారి ఆఫీసుని ప్రారంభిస్తునందుకు గాను ముంబైలో నవంబర్ 18న మూడు రొజుల అతిపెద్ద కాన్పరెన్స్‌ని ఏర్పాటుచేయనుంది. ఈ కార్యక్రమానికి వీకిపిడియా వ్యవస్దాపకుడు జిమ్మీ వేల్స్ ముఖ్య అతిధిగా వచ్చిన విషయం తెలిసిందే. ఇండియాలో జరిగే వీకి కాన్ఫరెన్స్‌కి జిమ్మీ వేల్స్ రావడం ఇదే మొదటి సారి.

ఈ కార్యక్రమాన్ని ముంబైలో ఉన్న చారిత్రాత్మక యూనివర్సిటీ(ముంబై యూనివర్సిటీ)లో ఉన్న ఫోర్ట్ క్యాంపస్‌ కన్వెక్షన్ హాలులో నిర్వహించనున్నారు. ఈ సందర్బంలో వీకిపిడియా ప్రెసిడెంట్ అర్జున్ రావ్ చావ్లా మాట్లాడుతూ ఈ వీకి కాన్పరెన్స్‌ని ఇంత మెగా ఈ వెంట్‌గా నిర్వహించడానికి గల కారణం, భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ భాషలను ఒకతాటి మీదకు తీసుకొని రావడం కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరించడం జరుగుతుంది. దేశం మొత్తం మీద ఉన్న 20 ప్రాంతీయ భాషలకు సంబంధించి సమాచారాన్ని రాబోయే భావితరాలకు ఎలా భద్ర పరచాలో తెలియజేయడం జరుగుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot