మీ పాత నెంబర్‌తోనే Reliance Jioలోకి మారటం ఎలా..?

తన సూపర్ ఫాస్ట్ నెట్‌వర్క్ కవరేజ్‌తో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న రిలయన్స్ జియో 4జీ, ప్రస్తుత ఇండియన్ టెలికామ్ సెక్టార్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపుగా 4జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే ప్రతిఒక్కరూ జియో 4జీ సిమ్ కార్డ్ కోసం పరితపిస్తున్నారు.

Read More : మీ ఫోన్ బ్యాలన్స్‌ను నిమిషాల్లో వేరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయటం ఏలా..?

 మీ పాత నెంబర్‌తోనే Reliance Jioలోకి మారటం ఎలా..?

ఈ నేపథ్యంలో రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లు జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి. భారీ రష్ నేపథ్యంలో జియో సిమ్ కోసం గంటల తరబడి లైన్‌లలో వేచి ఉండాల్సిన పరిస్థితి దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఒకేవేళ సిమ్ పొందినప్పటికి అది యాక్టివేషన్ అవటానికి చాలా సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది యూజర్లు రిలయన్స్ జియో లాంచ్ చేసే మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సదుపాయం కోసం వేచి చేస్తున్నారు. ప్రసుతానికైతే మొబైల్ నెంబర్ పోర్టబులిటీ గురించి రిలయన్స్ జియో అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

Read More : Jio 4జీ ఆఫర్‌ను సపోర్ట్ చేస్తున్న 245 స్మార్ట్‌ఫోన్‌ల కంప్లీట్ లిస్ట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

Mobile Number Portabilityకి రిలయన్స్ జియో తెరలేపినట్లయితే ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్, ఐడియా వంటి ప్రముఖ నెట్‌వర్క్‌ల నుంచి భారీ సంఖ్యలో చందాదారులు రిలయన్స్ జియోలోకి మారిపోయే అవకాశముంది. రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లోకి మారటం ద్వారా తమ పాత నెంబర్ అలానే ఉండటంతో పాటు 90 రోజుల ప్రివ్యూ ఆఫర్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు.

#2

రిలియన్స్ జియో సేవలు అధికారికంగా మార్కెట్లో లాంచ్ అయిన తరువాతనే ఈ మొబైల్ నెంబర్ పోర్టబులిటీ విధానం అందుబాటులోకి వచ్చే అవాకశముంటుంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుతోన్న సమాచారం ప్రకారం Reliance Jio సేవలను అధికారింగా సెప్టంబర్ 1న మార్కెట్లో లాంచ్ చేసే అవకాశముంది.

#3

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ విధానం ద్వారా మీ పాత నెంబర్‌తోనే రిలయన్స్ జియోలోకి మారేందుకు ఇలా చేయండి...

#4

మీ మొబైల్ నెంబర్ నుంచి పోర్ట్ (port) అని టైప్ చేసి కొంత స్పేస్ ఇచ్చి బ్రాకెట్లో మీ మొబైట్ నెంబర్‌ని జత చేసి 1900కి ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఎనిమిది అంకెల యూనిక్ పోర్టింగ్ కోడ్ మీ మొబైల్‌కు సందేశం రూపంలో అందుతుంది.

#5

ఈ కోడ్ ఆధారంగా మీ సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్ లేదా ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్‌‌ను సంప్రదించి సంబంధిత అప్లికేషన్‌లను పూరించాల్సి ఉంటుంది.

#6

సిమ్ యాక్టివేషన్ ప్రక్రియలో  భాగంగా మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఇతర ధృవీకరణ ప్రతాలను జియో ప్రతినిధులకు సమర్పించాల్సి ఉంది.

#7

ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే 90 రోజుల ప్రివ్యూ ఆఫర్‌తో కూడిన జియో 4జీ సిమ్ కార్డ్ మీకు అందుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Enjoy Free Reliance Jio 4G Data and Calls for 90 Days On Your Existing Number with MNP. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot