దేశంలోని Broadband ప్లాన్స్‌లో బెస్ట్ ప్లాన్ ఏదో తెలుసా..!

|

మీరు వ‌ర్క్ ఫ్రం హోం ద్వారా ఉద్యోగాన్ని చేస్తున్నారా! అయితే మీకు ఇంట్లో ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ (Broadband) స‌దుపాయానికి సంబంధించిన ప్రాధాన్య‌త గురించి తెలిసే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అఫర్డ‌బుల్ ధ‌ర‌లోనే ఇంట‌ర్నెట్ (Broadband) క‌నెక్ష‌న్లు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ.. ఇంకా చాలా ప్రాంతాల్లో ఉండే వారికి ఇది చాలా ఖ‌రీదైన విష‌యంగా ఉంది.

 
దేశంలోని Broadband ప్లాన్స్‌లో బెస్ట్ ప్లాన్ ఏదో తెలుసా..!

అందుకే ప్ర‌స్తుతం దేశంలో ఉన్న టెల్కోలు దేశ‌వ్యాప్తంగా ఫైబ‌ర్ ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని విస్త‌రిస్తున్నాయి. అంతేకాకుండా, అఫ‌ర్డ‌బుల్ ధ‌ర‌ల్లో ఎంట్రీ లెవెల్ ప్లాన్ల‌ను కూడా అందిస్తున్నాయి. Jio, Airtel, Vodafone Idea మరియు BSNL అన్నీ రూ.500లోపు ఎంట్రీ-లెవల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇప్పుడు ఆయా కంపెనీలు అందిస్తున్న ఎంట్రీ లెవెల్ ప్లాన్ల‌న్నింటినీ ఒకసారి చూద్దాం.

దేశంలోని Broadband ప్లాన్స్‌లో బెస్ట్ ప్లాన్ ఏదో తెలుసా..!

Airtel ఎంట్రీ లెవెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌:

భార‌తీ Airtel కంపెనీ రూ.499 ధ‌ర‌లో ఎంట్రీ లెవెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ (ట్యాక్స్‌లు అద‌నం) అందిస్తోంది. ఈ ప్లాన్‌తో కంపెనీ 40ఎంబీపీఎస్ ఇంట‌ర్నెట్ వేగంతో 3.3టీబీ డేటాను అందిస్తోంది. ఇది నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాకుండా, వినియోగదారులు కంపెనీ నుండి ఉచిత ఫిక్స్‌డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్‌ని పొందవచ్చు, అయితే వారు పరికరాల కోసం అదనపు చెల్లించాల్సి ఉంటుంది.

దేశంలోని Broadband ప్లాన్స్‌లో బెస్ట్ ప్లాన్ ఏదో తెలుసా..!

BSNL ఎంట్రీ లెవెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌:
భార‌త ప్ర‌భుత్వ రంగ టెల్కో BSNL రూ.329 ధ‌ర‌లో ఎంట్రీ లెవెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ (ట్యాక్స్‌లు అద‌నం) అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా యూజ‌ర్లు 20ఎంబీపీఎస్ ఇంట‌ర్నెట్ వేగంతో 1000జీబీ డేటాను అందిస్తోంది. ఇది నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాకుండా, ఈ ప్లాన్‌తో పాటు ఉచిత ఫిక్స్‌డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ కూడా ఉంది, అయితే వినియోగదారులు డివైజుల కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

దేశంలోని Broadband ప్లాన్స్‌లో బెస్ట్ ప్లాన్ ఏదో తెలుసా..!

రిల‌య‌న్స్ Jio ఎంట్రీ లెవెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌:
భార‌త దేశంలోనే అతిపెద్ద టెల్కో రిల‌య‌న్స్ Jio కంపెనీ రూ.399 ధ‌ర‌లో ఎంట్రీ లెవెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ (ట్యాక్స్‌లు అద‌నం) అందిస్తోంది. ఈ ప్లాన్‌తో కంపెనీ 30ఎంబీపీఎస్ ఇంట‌ర్నెట్ వేగంతో 3.3టీబీ డేటాను అందిస్తోంది. ఇది నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాకుండా, వినియోగదారులు కంపెనీ నుండి ఉచిత ఫిక్స్‌డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్‌ని పొందవచ్చు.

Vodafone Idea ఎంట్రీలెవెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌:
Vodafone Idea కంపెనీ త‌మ బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల్ని యూ బ్రాడ్‌బ్యాండ్ అనే స‌బ్సిడ‌రీ ద్వారా అందిస్తోంది. ఈ కంపెనీ నుంచి రూ.400 ధ‌ర‌లో ఎంట్రీ లెవెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ (ట్యాక్స్‌లు అద‌నం) అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా యూజ‌ర్లు 40ఎంబీపీఎస్ ఇంట‌ర్నెట్ వేగంతో 3.5టీబీ డేటాను అందిస్తోంది. ఇది నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ కంపెనీ సేవ‌లు ప‌లు ఎంపిక చేయ‌బ‌డిన న‌గ‌రాల్లో మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి.

 

ఇవే కాకుండా, ACT Fibernet, Excitel మరియు మరిన్ని ఇతర ISPలు (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు) కూడా ఎంట్రీ-లెవల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు అందిస్తున్నాయి. ఇలా అన్ని కంపెనీల‌కు సంబంధించి ప్లాన్లు ప‌రిశీలించిన త‌ర్వాత‌, మీ ప్రాంతంలో వారి నెట్‌వ‌ర్క్ సేవ‌ల‌ను తెలుసుకుని మీరు క‌నెక్ష‌న్ తీసుకోవ‌చ్చు.

2030 నాటికి భార‌త Fiber Broadband యూజ‌ర్లు @110 మిలియ‌న్లు!

భార‌త్‌లో Fiber Broadband ప్ర‌యాణం ఇటీవ‌లె ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ.. ఈ ద‌శాబ్దం చివ‌రి నాటికి భార‌త్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో వేగ‌వంత‌మైన వృద్ధిని సాధిస్తుంద‌ని గ‌తంలో నివేదిక పేర్కొంది. దేశంలోని ప్ర‌తి మూల‌కు ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవ‌లు విస్తరించ‌డానికి ఇంకా స‌మ‌యం ప‌డుతుంద‌ని అంచ‌నా వేసింది. 2030 నాటికి భారతదేశ ఫైబర్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 110 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఇంకా ఆ నివేదిక‌లో యూఎస్‌కు చెందిన‌ విశ్లేషకుడు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సెగ్మెంట్‌లో ఇండోనేషియా కూడా పెద్ద లాభాలను పొందగలదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

దేశంలోని Broadband ప్లాన్స్‌లో బెస్ట్ ప్లాన్ ఏదో తెలుసా..!

భారతదేశంలో ఫైబ‌ర్ స‌బ్‌స్క్రైబ‌ర్స్ ట్రాజెక్ట‌రీ 2025లో పుంజుకుంటుంద‌ని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా భార‌త్ 2028 నాటికి U.S (యునైటెడ్ స్టేట్స్) తో స‌మాన స‌బ్‌స్క్రైబ‌ర్ సంఖ్య‌ను పొందుతుంద‌ని భావిస్తున్నట్లు నివేదిక వెల్ల‌డించింది. మ‌రోవైపు, 2030 నాటికి భారతదేశ ఫైబర్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 110 మిలియన్లకు చేరుకుంటుందని నివేదిక‌ అంచనా వేసింది. చైనా అంచ‌నాలు చూసుకుంటే (523 మిలియన్ ఫైబర్ సబ్‌స్క్రైబర్లు) ఉండ‌గా, దానితో పోలిస్తే భార‌త‌ గణాంకాలు ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయనే విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని నివేదిక వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

అదే సమయంలో, ప్ర‌స్తుతం U.S. దాదాపు 80 మిలియన్ల ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ చందాదారులను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది, ఇండోనేషియా 60 మిలియన్ల చందాదారుల‌ను కలిగి ఉండ‌గా, బ్రెజిల్ మ‌రియు జపాన్ 40 మిలియన్ల ఫైబర్ సబ్‌స్క్రైబర్‌లతో ఐదవ స్థానం కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు నివేదిక పేర్కొంది.

భార‌త్‌లో ప్ర‌తి మూల‌కు ఫైబ‌ర్ అమ‌లుకు కేంద్ర ప్ర‌య‌త్నాలు:
భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం టెల్కోలు మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లు (IPలు) ఫైబర్‌ను వేగంగా అమ‌లు చేయ‌డానికి ప్రతి రాష్ట్రంలో రైట్-ఆఫ్-వే (RoW) నియమాలను సవరించడానికి ప్రయత్నిస్తోంది. వాస్త‌వానికి భార‌త్‌లో పాయింట్ టాపిక్ నివేదిక‌లు సూచించిన డేటా కంటే బ్రాడ్‌బ్యాండ్ వినియోగ‌దారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చు. కానీ, అది ఎంత‌మేర అనేది.. ప్రభుత్వం, అలాగే టెలికాం రంగం పని చేసే విధానంపై ఆధారపడి ఉంటుందని అంతా భావిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Entry-Level Broadband Plans from Jio, Airtel, Vodafone Idea and BSNL in August 2022

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X