Home
News

మీకు PF అకౌంట్‌ ఉందా.. EPFO కీలక నిర్ణయం.. పూర్తి వివరాలు..!

EPFO (ఎంప్లాయిస్ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌) సంస్థ ఇటీవల ఉద్యోగుల సౌకర్యం కోసం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. PF నగదు విత్‌డ్రాను సులభతరం చేయడంతోపాటు ATM ద్వారా నగదు విత్‌డ్రా చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది. అయితే తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆగస్టు 1 వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు చెప్పింది.

ఈ యాప్‌ ద్వారానే క్రియేట్‌, యాక్టివేషన్‌ :
UAN (యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్) ను కొత్తగా క్రియేట్‌ చేయడం లేదా యాక్టివేట్‌ చేసేందుకు UMANG యాప్‌ను మాత్రమే ఉపయోగించాలని EPFO స్పష్టం చేసింది. ఈ కొత్త ప్రక్రియను మరింత సురక్షితంగా ఉంచేందుకు ఆధార్ ఆధారిత ఫేస్‌ అథెంటికేషన్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు చెప్పింది.

EPFO mandates UMANG app

ఆధార్‌ ఫేస్‌ RD యాప్ కూడా ఉండాలి :
UMANG యాప్‌ ద్వారా UAN క్రియేట్‌ యాక్టివేట్‌ చేసేందుకు ఆధార్‌ ఫేస్‌ RD యాప్‌ (Aadhaar Face RD App) ను కూడా ఇన్‌స్టాల్‌ చేయాల్సి ఉంటుందని EPFO తెలిపింది. ఈ రెండు యాప్స్‌తోపాటు ఆధార్‌తో లింక్‌ చేసి ఉన్న మొబైల్‌ నంబర్‌ను కూడా అందుబాటులో ఉండాలి.

UMANG యాప్‌ ద్వారా UAN ఎలా క్రియేట్‌, యాక్టివేట్‌ చేయాలి :
స్టెప్‌ 1 : తొలుత యాప్‌ను ఓపెన్‌ చేయాలి.
స్టెప్‌ 2 : అనంతం ఆధార్‌ నంబర్‌తోపాటు, ఆధార్‌ లింక్‌ చేసి ఉన్న మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.
స్టెప్‌ 3 : ఈ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ను నమోదు చేయాల్సి ఉంటుంది.
స్టెప్‌ 4 : OTP ను వెరిఫై చేసిన తర్వాత ఫేస్‌ స్కాన్‌ వెరిఫికేషన్‌ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
స్టెప్‌ 5 : మీకు సంబంధించి ఎటువంటి UAN లేకుంటే.. కొత్తగా UAN క్రియేట్‌ చేస్తుంది.

స్టెప్ 6 : అనంతరం మీ మొబైల్‌ నంబర్‌కు UAN నంబర్‌ పంపుతుంది.
స్టెప్‌ 7 : అనంతరం ఆ UAN నంబర్‌ను యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
స్టెప్‌ 8 : UMANG యాప్ ద్వారానే UAN ను యాక్టివేట్‌ చేయవచ్చు.
స్టెప్‌ 9 : ఇందుకోసం ఈ యాప్‌లో UAN యాక్టివేషన్‌ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 10 : అనంతరం UAN, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌లను నమోదు చేయాలి.
స్టెప్‌ 11 : ఆ తర్వాత మీ మొబైల్‌ నంబర్‌కు OTP వస్తుంది.
స్టెప్‌ 12 : అనంతరం ఆధార్‌ ఫేస్‌ RD యాప్‌ ద్వారా అథెంటికేషన్‌ చేయాల్సి ఉంటుంది.
స్టెప్‌ 13 : ఆ తర్వాత UAN యాక్టివేట్ చేసినట్లు మీకు మెసేజ్‌ వస్తుంది.

ఇప్పటికే UAN యాక్టివేట్‌ చేసుకున్న యూజర్లు బయోమెట్రిక్‌ అథెంటికేషన్ పూర్తి చేయాలని EPFO చెబుతోంది. దీంతోపాటు ఫోటో మరియు అడ్రస్‌ ను కూడా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలను అప్‌డేట్‌ చేసుకున్న యూజర్లు సులభంగా అన్ని సేవలను పొందవచ్చని చెప్పింది.

More from GizBot

Best Mobiles in India

English summary
EPFO mandates UMANG app for UAN generation and activation, here are the steps
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X