Home
News

ATM ద్వారా PF డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.. ఎప్పటి నుంచి సౌకర్యం అందుబాటులోకి రానుంది?

EPFO (ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్ ఆర్గనైజేషన్‌) మెంబర్లకు ఇటీవల ఓ గుడ్‌న్యూస్‌ అందింది. PF అకౌంట్‌లు కలిగిన ఉద్యోగులు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నగదు విత్‌డ్రా చేసుకొనేందుకు ప్రస్తుతం ఎక్కువ సమయం పడుతోంది. అయితే ఈ సమస్యకు త్వరలో చెక్‌ పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఈపీఎఫ్‌ నుంచి ATM ల ద్వారా నగదు విత్‌డ్రా చేసుకొనే అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం అయింది.

ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ అకౌంట్‌లు కలిగిన ఉద్యోగులకు ఈ కొత్త విధానం ఎంతో మేలు చేయనుంది. అయితే ఈ విధానంపై కొంత మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఏటీఎంల ద్వారా పీఎఫ్‌ నగదును విత్‌డ్రా చేసుకొనేందుకు వీలుగా సంబంధింత ఐటీ వ్యవస్థలను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు ఇటీవలే అధికారులు వెల్లడించారు.

EPFO Members can withdraw money from ATMs

అయితే గతంలో పోలిస్తే ప్రస్తుతం PF నగదును వేగంగా విత్‌డ్రా చేయగలుగుతున్నారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు వీలుగా నేరుగా ATM ల ద్వారా నగదు విత్‌డ్రా చేసే వీలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం EPFO మరింత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ పైన పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు. బ్యాంకింగ్‌ వ్యవస్థతో సమానంగా పనిచేసే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

PF అకౌంట్‌లలోని నగదును ఏటీఎంల నుంచి నేరుగా విత్‌డ్రా చేసుకొనేందుకు వీలుగా కొత్త కార్డులను అందించనున్నట్లు తెలుస్తోంది. లేదంటే EPF ఖాతాను బ్యాంకు అకౌంట్‌కు లింక్‌ చేసి, ఆయా కార్డులను వినియోగించుకొనేలా ఏర్పాట్లు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ విధానాల్లో PF నగదును విత్‌డ్రా చేస్తున్నారు. గృహ నిర్మాణం, ఆరోగ్య సమస్యలు, ప్రకృతి వైపరిత్యాలు సహా ఇతర సందర్భాల్లో ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్‌ల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన కొన్ని రోజుల్లో లింక్‌ చేసిన బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 90 శాతం వరకు ఉన్న నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు.

ATM ల ద్వారా పీఎఫ్‌ నగదు విత్‌డ్రా విధానం 2025 నుంచి అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. అయితే మొత్తం నగదులో 50 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకొనేందుకు వీలుందని తెలుస్తోంది. EPFO నిబంధనల ప్రకారం ఒక నెలపాటు నిరుద్యోగిగా ఉంటే.. మొత్తం నగదులో 75 శాతం తీసుకొనేందుకు వీలుంది.

అదే రెండు నెలల పాటు ఎటువంటి ఉద్యోగం లేకుండా ఉంటే మాత్రం సదరు ఉద్యోగి ఖాతాలో ఉన్న మొత్తం నగదును విత్‌డ్రా చేసుకొనేందుకు అవకాశం ఉంది. ATM ద్వారా పీఎఫ్‌ నగదు తీసుకొనే విధానంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సులభంగా విత్‌డ్రా చేసుకొనే అవకాశం ఉండడంతో.. పీఎఫ్ ఖాతా వేగంగా ఖాళీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

అయితే కొత్త విధానంతో మేలు కూడా జరిగే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ PF నగదు విత్‌డ్రా వ్యవస్థలపై అవగాహన లేని EPF సభ్యులు అత్యవసర సమయాల్లో సులభంగా నగదు తీసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఇతరులపై ఆధారపడే అవసరం లేకుండా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
EPFO Members can withdraw money from ATMs and starting from 2025 onwards
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X