Home
News

ఈపీఎఫ్‌‌లోకి e-inspection system, ఇకపై ప్రాసెస్ చాలా ఈజీ

By Gizbot Bureau

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లోకి త్వరలో కొత్త సిస్టం అందుబాటులోకి రానుంది. తనిఖీ ప్రక్రియ సులభతరం చేసేందుకు ఈపీఎఫ్ఓ ఈ-తనిఖీ వ్యవస్థను త్వరలో ప్రవేశపెట్టనుంది.వేతనదారుల ఫిర్యాదులను తగ్గించడానికి విచారణ కాలాన్ని గరిష్టంగా రెండేళ్లకు పరిమితం చేసే చట్టాన్ని సవరించాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించినట్లు సెంట్రల్ ప్రొవిడియంట్ ఫండ్ కమిషనర్ సునీల్ భరత్వాల్ తెలిపారు.

EPFO to launch e-inspection system to simplify the process

కాగా డేటాలో వేతనదారుల డేటా మిస్ మ్యాచ్ కారణంగా కొద్దిశాతం మంది ఉద్యోగులు 12 సంఖ్యల UAN నెంబర్ జనరేట్ చేసుకోలేకపోతున్నారు. దీంతో పాటుగా KYC (Know your Customer) విషయంలో వచ్చిన ఫిర్యాదులను మూడు రోజుల కాలపరిమితిలోగా పరిష్కరించే దిశగా ఈపీఎఫ్ఓ పనిచేస్తోంది.

అడ్వాన్స్ డ్ టెక్నాలజీని

అడ్వాన్స్ డ్ టెక్నాలజీని

ఈ ప్రాసెస్ లో ఆధార్‌తో UAN, బ్యాంకు అకౌంట్ నెంబర్, రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే KYC ప్రాసెస్ పూర్తి అవుతుంది. ఈపీఎఫ్ఓలో ఆఫ్ లైన్ క్లెయిమ్ చేసే విధానాన్ని డిజిటల్ , యాప్ బేసిడ్ ప్లాట్ ఫాంలో మార్చేసినట్టు ఈపీఎఫ్ఓ అధికారులు చెప్పినట్టు ఒక ప్రకటన తెలిపింది. వచ్చే దశలో బిగ్ డేటా ఎనాలిటకల్ ప్లాట్ ఫాం ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీని ఈపీఎఫ్ఓ అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది.

చట్ట సవరణ బిల్లు-2019

చట్ట సవరణ బిల్లు-2019

ఇదిలా ఉంటే 2015-16 బడ్జెట్ లో ఇచ్చిన హామీల మేరకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ చట్ట సవరణ బిల్లు-2019 ముసాయిదాను కేంద్ర కార్మిక శాఖ రూపొందించింది. ఈ బిల్లుపై కార్మిక సంఘాలు, పీఎఫ్‌ చందాదారులు, యాజమాన్యాలు, ప్రజలు... సెప్టెంబరు 22వ తేదీలోగా అభ్యంతరాలను [email protected], [email protected] మెయిళ్లకు ఈ-మెయిల్‌ ద్వారా.. లేదా రాహుల్‌ భగత్‌, డైరెక్టర్‌, కేంద్ర కార్మికశాఖ, రూము నం.302, శ్రమశక్తి భవన్‌, ఢిల్లీ చిరునామా పేరుతో పంపాలని కార్మికశాఖ కోరింది.

ఈపీఎస్‌కు బదులు ఎన్పీఎస్ ప్రతిపాదన

ఈపీఎస్‌కు బదులు ఎన్పీఎస్ ప్రతిపాదన

EPSతో పాటు NPSను చేర్చాలని చాలా రోజులుగా యోచిస్తున్నారు. గతంలో ఈపీఎస్‌కు బదులు ఎన్పీఎస్ ప్రతిపాదన వచ్చినప్పుడు కార్మిక సంఘాలు మండిపడ్డాయి. అయితే ఇప్పుడు ఎన్పీఎస్‌ను ఐచ్ఛికంగా మాత్రమే చేర్చింది. ఈపీఎస్ కింద వేతనజీవులకు రిటైర్మెంట్ తర్వాత కచ్చిత పింఛన్ వస్తుంది. భవిష్యనిధి చందా మొత్తాన్ని ఒకేసారి పన్ను లేకుండా తీసుకోవచ్చు. ప్రత్యేక సందర్భాల్లో మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు కూడా ఈపీఎస్‌లో ఉంది. ఉద్యోగులు రెండు ఆప్షన్లలో దేనినైనా ఎంచుకోవచ్చు. నిబంధనల మేరకు ఎన్పీఎస్ నుంచి ఈపీఎస్‌కు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

శాలరీని పెంచుకునే వెసులుబాటు

శాలరీని పెంచుకునే వెసులుబాటు

EPF చట్టం ప్రకారం బేసిక్ శాలరీ, డీఏ, ఇతర భత్యం కలిపి శాలరీగా నిర్ణయించి ఉద్యోగి వాటా కింద పన్నెండు శాతం, కంపెనీ వాటా కింద 12 శాతాన్ని ఈపీఎస్ ఖాతాలో జమ చేస్తారు. తాజా బిల్లు ప్రకారం తక్కువ వేతనం కలిగిన ఉద్యోగుల వయస్సు ఆధారంగా చందాను తగ్గించుకునే అవకాశాన్ని కల్పించనుందట. యజమాని వాటా మాత్రం తగ్గదు. దీని ద్వారా వేతన జీవులు వారి వారి అవసరాల ఆధారంగా టేక్ హోమ్ శాలరీని పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఈపీఎస్‌లో ఉద్యోగి, యజమాని నుంచి పెన్షన్ నిబంధన ఆధారంగా ప్రతి నెల బ్యాంకులో జమ అవుతుంది. ఈ పెన్షన్ కోసం యజమాని వాటాలోని 12 శాతంలో 8.3 శాతం వాటాను గరిష్టంగా రూ.1250ని ఈపీఎస్‌లో జమ చేస్తారు.

ఉద్యోగి ఎన్పీఎస్ పథకం

ఉద్యోగి ఎన్పీఎస్ పథకం

ఉద్యోగి ఎన్పీఎస్ పథకం ఎంచుకుంటే ఇది పీఎఫ్ఆర్డీఏ పరిధిలోకి వెళ్తుంది. ఉద్యోగం మానేసి మొత్తాన్ని తీసుకునేందుకు ఎన్పీఎస్ నిబంధనలకు లోబడి ఉంటుంది. ఉద్యోగికి 60 ఏళ్లు వచ్చాక అరవై శాతం మాత్రమే తీసుకోవచ్చు. ఇందులో 20 శాతంపై పన్ను ఉంటుంది. మిగతా 40 శాతం యాన్యుటీ స్కీంలో ఇన్వెస్ట్ చేసి, సంబంధిత బీమా సంస్థ నిర్ణయించిన వడ్డీ ఆధారంగా నెలవారీ పెన్షన్ పొందవచ్చు.

Best Mobiles in India

English summary
EPFO to launch e-inspection system to simplify the process: CPFC
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X