మే లేదా జూన్ నుంచి ATM, UPI ద్వారా PF నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు..! పూర్తి వివరాలు
ఉద్యోగులకు కేంద్ర కార్మిక శాఖ గుడ్‌న్యూ్స్ చెప్పింది. PF నగదును విత్‌డ్రా చేసుకొనే విధానంలో భారీ మార్పులు రానున్నాయి. ఉద్యోగులు ప్రస్తుతం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాలు కలిగి ఉన్నాయి. ప్రతి నెల వారి వేతనం నుంచి కొంత నగదు PF ఖాతాలో జమ అవుతుంది. అంతే మొత్తంలో సంస్థలు కూడా ఉద్యోగి పేరుతో జమ చేస్తుంటాయి.
పెళ్లి, ఇంటి నిర్మాణం, అనారోగ్యం :
ఈ నగదును ఉద్యోగి పదవీ విరమణ చేసిన అనంతరం వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ నగదును ఉద్యోగం చేస్తున్న సమయంలోనూ విత్‌డ్రా చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. పెళ్లి, ఇంటి నిర్మాణం, అనారోగ్యం, ఎడ్యుకేషన్ సహా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉంది.

పీఎఫ్ విత్‌డ్రా :
PF నగదును ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో EPFO కార్యాలయాల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. EPFO వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. గతంలో ఈ క్లెయిమ్ క్లియర్ అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టేది. అయితే కరోనా సమయంలో ఇందులో కొన్ని మార్పులు చేశారు.
క్లెయిమ్ టైం :
వారం రోజుల వ్యవధిలోనే క్లెయిమ్‌ను క్లియర్ చేశారు. అనంతరం ఈ విధానంలో మరిన్ని మార్పులు చేశారు. 3 రోజుల్లో చాలా క్లెయిమ్‌ను క్లియర్ చేసి నగదు డిపాజిట్ చేస్తున్నారు. అయితే తాజాగా PF విత్‌డ్రా విధానంలో కీలక మార్పులు రానున్నాయి. EPFO డిజిటలైజేషన్ భాగంగా ATM, UPI ద్వారా PF విత్‌డ్రా చేసుకోవచ్చు.
కార్మిక శాఖ సెక్రటరీ సుమితా దావ్రా కీలక ప్రకటన :
ఎప్పటి నుంచి వీటిపై చర్చ జరుగుతోంది. తాజాగా కేంద్ర కార్మిక శాఖ సెక్రటరీ సుమితా దావ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. PF నగదును ATM, UPI ద్వారా విత్‌డ్రా చేసుకొనే వెసులుబాటు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) ప్రతిపాదనలకు కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
మే లేదా జూన్ నుంచి :
ఈ సంవత్సరం మే లేదా జూన్ నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. PF ఖాతాల్లో ఎంత నగదు ఉందో కూడా UPI ద్వారా తనిఖీ చేసుకోవచ్చని చెప్పారు. ఈ విధానంలో గరిష్ఠంగా ఒక లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకొనేందుకు అవకాశం ఉందన్నారు.
ఈ సంవత్సరం మే చివరి నాటికి లేదా జూన్‌లో PF విత్‌డ్రాలో గణనీయమైన మార్పులు చూస్తారు. UPI ద్వారా నేరుగా PF అకౌంట్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు. మరియు ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా గరిష్ఠంగా లక్ష రూపాయలు విత్‌డ్రా చేసుకోవచ్చు. మరియు మీరు నచ్చిన బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు.
- సుమితా దావ్రా, కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి
EPFO డిజిటలైజేషన్‌లో భాగంగా 120 పైగా డేటాబేస్‌లను ఇంటిగ్రేట్ చేసినట్లు సుమిత్రా దావ్రా చెప్పారు. ఫలితంగా కేవలం 3 రోజుల్లోనే విత్‌డ్రా క్లెయిమ్ ప్రాసెస్ అవుతుందన్నారు. మరియు 95 శాతం క్లెయిమ్ ఆటోమేటెడ్ విధానంలో జరుగుతున్నాయని తెలిపారు.
పీఎఫ్ విత్‌డ్రా కోసం ప్రత్యేకంగా ATM కార్డులు జారీ చేసే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. NPCI ప్రతిపాదనకు కార్మిక శాఖ పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో త్వరలో ఈ కార్డులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మధ్య తరగతి ఉద్యోగులు అత్యవసర సమయంలో PF నగదుపైన ఆధారపడుతున్నారు. EPFO డిజిటలైజేషన్ విధానం వారికి మరింత ఉపయోగపడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








