Epson M1120 ప్రింటర్ రివ్యూ: తక్కువ ధర ఎక్కువ క్వాలిటీ
ఇప్సోన్ డిజిటల్ ఇమేజింగ్ ప్రింటింగ్ కంపెనీ ఈ మధ్య కొత్తగా 3 మోనోక్రామ్ లతో కూడిన ఇకో ట్యాంక్ ప్రింటర్ ను ఇండియాలో విడుదల చేసింది. ఈ ప్రింటర్ గతంలో వచ్చిన ప్రింటర్లకన్నా బెటర్ ఫీచర్లతో మార్కెట్లోకి విడుదలయింది. మొత్తం మూడు మోడళ్లు M1100, M1120, M2140ను లాంచ్ చేసింది. ఈ ప్రింటర్లు అన్నీ ఆఫీస్ ప్రింటింగ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ అందుబాటులోకి వచ్చాయి. ఈ శీర్షికలో భాగంగా మనం M1120 రివ్యూని చూద్దాం. ఈ ప్రింటర్ ని గిజ్‌బాట్ టీమ్ అన్ని విధాలుగా టెస్ట్ చేయడం జరిగింది. మరి దీని పనితీరు ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

డిజైన్
ఈ ప్రింటర్ కాంపాక్ట్ డిజైన్ తో అత్యంత ఆకర్షణీయంగా తయారుచేయబడింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ లో వినియోగదారులకు లభ్యమవుతోంది. ఈ ప్రింటర్ చూసేందుకు ప్రీమియం లుక్ లో దాదాపు 3.5 కేజీల బరువును కలిగి ఉంటుంది. తక్కువ బరువుంది కాబట్టి దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. అలాగే దీనికి వైఫై కమాండ్ ప్రింట్ ఆప్సన్ కూడా ఉంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న అన్ని ప్రింటర్లలో కల్లా బయటకు మోసుకెళ్లగలిగే వాటిల్లో ఇదే బెటర్ గా ఉంది. దీనికి యుఎస్ బి కేబుల్ కనెక్ట్ చేసి నేరుగా ల్యాపీ ద్వారా ఫోటోలు ప్రింట్ తీసుకోవచ్చు.

సెటప్
దీన్ని నేరుగా వైఫై ద్వారా కాని లేకుంటే యుఎస్ బి ద్వారా కాని సెటప్ చేసుకోవచ్చు. వైఫై కనెక్టివిటీ ద్వారా మీరు అన్ని రకాల డివైస్ ల నుండి ఈ ప్రింటర్ సహాయంతో ప్రింట్లు తీసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ , ఐఓఎస్ రెండు ప్లాట్ ఫాంల మీద పనిచేస్తుంది. వైర్ లెస్ కనెక్టివిటీ కూడా చాలా స్మూత్ ఉండి ఎటువంటి సమస్యలు రాకుండా పనిచేస్తుంది. కంప్యూటర్ల ద్వారా కాని స్మార్ట్ ఫోన్ల ద్వారా కాని ప్రింటింగ్ తీసుకునే సమయంలో ఎటువంటి అంతరాయం ఉండదు.Epson iPrint' app ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుంటే చాలు మీ ప్రింటర్ ఆటోమేటిగ్గా ప్రింటర్ కి కనెక్ట్ అవుతుంది.

ప్రింటింగ్ కాస్ట్, ఫెర్పార్మెన్స్
దీని ధర కూడా చాలా తక్కువగా ఉంది. ఒక పేజీ ప్రింట్ తీసుకోవడానికి కేవలం 12 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. మోనోలేజర్ ప్రింటర్ కన్నా 23 సార్లు కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఒక బాటిల్ లో 6000 పేజీల వరకు ఉంటాయి. పవర్ విషయానికి వస్తే M1120 consumes 14w of powerగా ఉంటుంది.

Verdict
మేము గత రెండు వారాలుగా ఈ ప్రింటర్ వాడుతున్నాన్నాం. చాలా మంచి ఫలితాలను అందిస్తోంది. ఎక్కడా మాకు దీని మీద సమస్య రాలేదు. ప్రింటింగ్ సమయంలో ఎటువంటి అంతరాయం లేకుండా ఇది పనిచేయడం , మొబైల్ కనెక్టవిటీ ద్వారా ప్రింటింగ్ తీసుకునే సమయంలో ఎటువంటి సమస్యలు రాకపోవడం వంటివి దీని ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. అలాగే బ్లాక్ అండ్ వైట్ క్వాలిటీ ప్రింటర్లు అమిత వేగంతో ప్రింట్ ను బయటకు పంపిస్తున్నాయి. పేపర్ బండిల్ కరెక్ట్ గా పెట్టనట్లయితే మళ్లీ ప్రింటింగ్ రిపీట్ అవుతుంది. అలాగే హై రిజల్యూషన్ తో ప్రింట్లు వస్తున్నాయి. మార్కెట్లో దీని ధర రూ.12,999గా ఉంది. అవకాశం ఉంటే వెంటనే కొనేయండి.


Click it and Unblock the Notifications