లాభాలు లేవు.. అందుకే అలా చేశాం..?

Posted By: Staff

లాభాలు లేవు.. అందుకే అలా చేశాం..?

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ మార్కెట్ ప్లాట్‌ఫామ్ 'ఆండ్రాయిడ్ అప్లికేషన్ స్టోర్' ఎక్కువ డబ్బుని ఆర్జించడంలో అంతగా సక్సెస్ కాలేక పోయింది. ఆదే ఆపిల్ 'ఐవోఎస్ అప్లికేషన్ స్టోర్' మాత్రం ఆపిల్ కంపెనీకి ఆరు సార్లు అనుకున్నదానికంటే ఎక్కువ లాభాలను గడించేలా చేసింది. ఏది ఏమైనప్పటికీ ఆపిల్ అప్లికేషన్ స్టోర్ మాత్రం గూగుల్ ఆండ్రాయిడ్ స్టోర్ కంటే లాభాలను ఆర్జించడంలో ముందుంది.

దీని పర్యావసానం ఏమోగానీ ఇప్పటి వరకు గూగుల్ ఆండ్రాయిడ్ మార్కెట్‌కి మేనేజర్‌గా ఉన్న 'ఎరిక్ చు' ఆ పదవి నుండి తప్పుకున్నారు. అంతేకాదండోయ్ ఇటీవలే గూగుల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ స్టోర్‌ని 'గూగుల్ ప్లే'గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఎరిక్ చు తప్పుకోవడంతో అతని స్దానంలో ఇప్పుడు ఆండ్రాయిడ్ డిజిటల్ కంటెంట్ లీడ్ అయిన జామీ రోసెన్‌బర్గ్ ని నియమించనున్నట్లు సమాచారం. గూగుల్‌లో జామీ రోసెన్‌బర్గ్ చేరి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అంతక ముందు ఆయన  మైక్రోసాప్ట్‌లో పని చేశారు.

గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆండ్రాయిడ్ మార్కెట్లో టీమ్‌లో కీలక బాధ్యతలను చేపట్టిన ఎరిక్ చుక్ కి గూగుల్ కంపెనీలో మరో మంచి పదవిని కట్టబెట్టనున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot