నిరుద్యోగులకు 'ఎరిక్సన్' బంపర్ ఆఫర్

Posted By: Staff

నిరుద్యోగులకు 'ఎరిక్సన్' బంపర్ ఆఫర్

 

కోలకత్తా: ప్రపంచంలో అతి పెద్ద మొబైల్ నెట్‌వర్క్ పరికరాల తయారీదారు ఎరిక్సన్, ఇండియాలో పదునైన వ్యాపార సేవలను నిర్వహించేందుకు గాను ఇండియాలో ఉన్న గ్లోబల్ సర్వీసెస్ యూనిట్‌లో ఉన్న సిబ్బంది సంఖ్యను పెంచనుంది. స్వీడిష్ అమ్మకం దారైన ఎరిక్సన్ 2011 క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశ శ్రామిక విస్తరణను 90% పరిగణనలోకి తీసుకునే భాగంలో ఎరిక్సన్ ఇండియా గ్లోబల్ సర్వీసెస్‌లో సుమారు 4,000 మంది టెక్నాలజీ నిపుణులను నియమించుకోనుంది.

గత డిసెంబర్‌లో ఇండియాలో ఉన్న ఎరిక్సన్ ఉద్యోగులు సుమారుగా 6,710 మంది ఉండగా.. ఈ సంఖ్య 2011కు గాను 11,535కు పెరిగింది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే 72శాతానికి పెరిగిందన్నమాట. ఎరిక్సన్ భారతదేశపు ప్రతినిధి మాత్రం ఇండియా హైరింగ్స్ గురించి మాత్రం పెదవి విప్పలేదు.  కానీ జైపూర్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రాలలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ అధికారులు మాత్రం  ఎరిక్సన్ యొక్క ప్రపంచ ఆపరేషన్ సేవలు  అఖండమైనవిగా నమ్ముతారు.

ప్రపంచ వ్యాప్తంగా ఎరిక్సన్‌కు 200 మిలియన్ మొబైల్ ఫోన్ నెట్‌వర్క్స్ వినియోగదారులు ఉన్నారు. దీనిని బట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు గాను ఎక్కువ మొత్తంలో టెక్నాలజీ నిపుణులు అవసరం కాబట్టి ఈ సెగ్మెంట్లో రిక్యూర్‌మెంట్ జరగవచ్చునని అంచనా. గత ఎనిమిది నెలల కాలంలో గనుక చూసినట్లైతే భారతదేశంలో..  సేవలు, కన్సల్టింగ్, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డెలివరీ బాధ్యతలో ఎరిక్సన్ బాగా బలపడినట్లు ఈ విషయం బాగా తెలిసిన ఇద్దరు నిపుణులు వెల్లడించారు. స్వీడీష్ తయారీదారైన ఎరిక్సన్‌కు ఇండియా, బ్రెజిల్ రెండూ కూడా టెక్నాలజీ పరంగా అత్యుత్తమ సెంటర్లు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot