5జీ కోసం ఇండియాకి వల వేస్తున్న కంపెనీలు ఇవే..

Written By:

4జీ రాకతో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే..అయితే ఇప్పుడు 4జీకి కాలం చెల్లిపోయి 5జీ వైపు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. 4జీ కన్నా అత్యంత వేగవంతమైన సర్వీసులను ప్రవేశపెట్టేందుకు దేశవిదేశాల్లోని టెక్నాలజీ సంస్థలు, టెల్కోలు వేంగా ముందుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు కంపెనీలు ఏకమై 5జీని తీసుకురావాలని కసరత్తులు చేస్తున్నాయి.

ఎయిర్‌సెల్ నుంచి ఏడాది ఆఫర్, ధర రూ. 104కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5జీ టెక్నాలజీపై ఒప్పందం

తాజాగా దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌తో స్వీడన్‌ టెలికం పరికరాల దిగ్గజం ఎరిక్సన్‌ 5జీ టెక్నాలజీపై ఒప్పందం చేసుకుంది. కాగా ఇప్పటికే నోకియా సంస్థ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌తోను, భారతి ఎయిర్‌టెల్‌తోను జట్టుకట్టిని విషయం తెలిసిందే.

దిగ్గజ టెల్కోలు ..

కాగా వెరిజోన్, కొరియా టెలికం, చైనా టెలికం, ఎన్‌టీటీ డొకొమో, వొడాఫోన్, ఎరిక్సన్, శాంసంగ్, స్ప్రింట్‌ మొదలైన దిగ్గజ టెల్కోలు ఈ నెట్‌వర్క్‌కు మళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.

వచ్చే ఏడాది జరగబోయే వింటర్‌ ఒలింపిక్స్‌లో..

ఇదిలా ఉంటే దక్షిణ కొరియాలోని ప్యోంగ్‌చాంగ్‌లో వచ్చే ఏడాది జరగబోయే వింటర్‌ ఒలింపిక్స్‌లో 5జీ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు అక్కడి మొబైల్‌ ఆపరేటర్‌ కేటీ సన్నాహాలు చేస్తోంది.

చైనాలోని టెల్కోలు

చైనాలోని టెల్కోలు 2020 నాటికల్లా 5జీ సాంకేతికతకు సంబంధించి పనులు ప్రారంభించి 2025 నాటికల్లా ప్రపంచంలోనే అతి పెద్ద 5జీ మార్కెట్‌గా నిలిపేందుకు కసరత్తు చేస్తున్నాయి.

2020 కల్లా 5జీని..

అటు దక్షిణ కొరియా, చైనా, జపాన్, బ్రిటన్, అమెరికా కూడా 2020 కల్లా 5జీని ప్రవేశపెట్టే అవకాశముంది. పొరుగున ఉన్న పాకిస్తాన్‌ కూడా త్వరలోనే 5జీ నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టబోతున్నామంటూ కొనాళ్ల క్రితమే ప్రకటించింది.

5జీ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌

ఇప్పటికే బెంగళూరులో 5జీ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) ల్యాబ్‌ ఏర్పాటు చేసిన నోకియా.. కొత్త తరం సాంకేతికతను మరింతగా వినియోగంలోకి తెచ్చే అంశాలపై దృష్టి పెడుతోంది. 5జీకి సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలను 2019లో ప్రకటించే అవకాశం ఉంది.

5జీ అభివృద్ధి కోసం రూ.500 కోట్ల నిధిని..

ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 5జీ అభివృద్ధి కోసం రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేయనుంది.

ట్రాయ్‌ కూడా 5జీ స్పెక్ట్రం వేలం ప్రక్రియపై ..

2020కల్లా 5జీ నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టే దిశగా తగిన మార్గదర్శక ప్రణాళికను రూపకల్పన చేసేందుకు టెలికం విభాగం కార్యదర్శి సారథ్యంలో అత్యున్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నియంత్రణ సంస్థ ట్రాయ్‌ కూడా 5జీ స్పెక్ట్రం వేలం ప్రక్రియపై దృష్టి పెడుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ericsson partners Airtel for deploying 5G Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot