Home
News

Eros Now మార్కెట్ అభివృద్ధిలో కొత్త ఎత్తుగడ!! గ్లోబల్ నెట్‌వర్క్స్ తో భాగస్వామ్యం

ఇండియాలో రోజు రోజుకి ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లలో ఓవర్-ది-టాప్ (OTT) వినియోగం అధికమవుతున్నది. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో గల ప్రధానమైన వాటిలో ఎరోస్ నౌ కూడా ఒకటి. భారతదేశంలో ఎరోస్ నౌ తన పరిధిని విస్తరించడం కోసం ఇప్పుడు కొత్తగా గ్లోబల్ నెట్‌వర్క్స్ ఇన్ఫోకామ్‌తో తన యొక్క భాగస్వామ్యాన్ని ప్రకటించింది. Eros Now 12,000 కంటే ఎక్కువ విస్తారమైన కంటెంట్ లైబ్రరీని డిజిటల్ శీర్షికలతో కలిగి ఉంది. ఇందులో టీవీ కార్యక్రమాలు, సినిమాలు, మ్యూజిక్ వీడియోలు మరియు మరిన్ని ఉన్నాయి. ఈ కొత్త భాగస్వామ్యంతో ఎరోస్ నౌ భారతీయ మార్కెట్లో తన పరిధిని విస్తరించడంలో మరియు దాని వద్ద ఉన్న కంటెంట్ లైబ్రరీని మరింత విస్తరించడంలో సహాయపడుతుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎరోస్ నౌ కొత్త భాగస్వామి గ్లోబల్ నెట్‌వర్క్స్ వివరాలు

ఎరోస్ నౌ కొత్త భాగస్వామి గ్లోబల్ నెట్‌వర్క్స్ వివరాలు

గ్లోబల్ నెట్‌వర్క్స్ ఇన్ఫోకామ్ భారతదేశంలోని టెల్కోలు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPలు) మరియు సిస్టమ్ ఇంటిగ్రేటర్‌లకు IT మౌలిక సదుపాయాలు, నెట్‌వర్క్ పరికరాలతో పాటు విలువ ఆధారిత సేవలను (VAS) అందిస్తుంది. కంపెనీ తన బ్రాండ్ - గ్లోబెనెట్ ద్వారా దీన్ని చేస్తుంది. గ్లోబెనెట్‌కి భారతదేశం అంతటా వినియోగదారులకు యాక్సెస్ ఉంది. ఇది OTT ప్లాట్‌ఫారమ్ యొక్క ఇతర సేవలు మరియు ఉత్పత్తులతో పాటుగా Eros Now యొక్క వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్యాక్‌ను బండిల్ చేస్తుంది మరియు తర్వాత భారతదేశంలో నివసిస్తున్న దాని కస్టమర్ బేస్ అంతటా వాటిని పంపిణీ చేస్తుంది.

Eros Now

Eros Now ప్రస్తుతం వినియోగదారులకు రూ.49, రూ.79 మరియు రూ.399 ధరల వద్ద వరుసగా నెలవారీ, త్రైమాసికం మరియు సంవత్సరం వంటి మూడు వేర్వేరు సబ్‌స్క్రిప్షన్‌లతో అందిస్తోంది. Eros Now ఖచ్చితంగా ఇప్పుడు ఈ భాగస్వామ్యం నుండి ప్రయోజనం పొందుతుంది. ఎందుకంటే ఇది పెద్ద సంఖ్యలో వినియోగదారులకు యాక్సిస్ ను పొందుతుంది. కంపెనీ అగ్రశ్రేణి మరియు అత్యంత ప్రజాదరణ పొందిన OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా మారడానికి కష్టపడుతోంది. అయితే మార్కెట్ లో Netflix, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు Disney+ హాట్‌స్టార్‌ల నుండి గట్టి పోటీని ఎదురుకొంటోంది.

OTT ప్లాట్‌ఫారమ్‌లు

సరికొత్త భాగస్వామ్యాలతో Eros Now వినియోగదారుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తుంది. OTT ప్లాట్‌ఫారమ్‌లు అద్భుతమైన విజయాన్ని అందుకోవడానికి ఇండియా మార్కెట్ ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. ఎందుకంటే మిలియన్ల మంది ప్రజలు ఇప్పుడు వినోదం కోసం అధికంగా టీవీని కాకుండా OTTలను ఆశ్రయిస్తున్నారు. అలాగే వినియోగదారులు అధిక మంది డేటాను కూడా వాడుతున్నారు. చౌకైన ధరలో లభించే డేటాతో దాదాపు ప్రతి ఒక్కరూ ప్రయాణం సమయాలలో కూడా ఇంటర్నెట్ డేటా వినియోగంతో స్ట్రీమింగ్ కంటెంట్‌లో వినోదాన్ని పొందుతున్నారు. ఇటువంటి వారిని టార్గెట్ చేసుకొని Eros Now ఖచ్చితంగా దాని నుండి ప్రయోజనం పొందాలని చూస్తోంది. Eros Nowకి సబ్‌స్క్రిప్షన్ పొందడానికి మీరు కంపెనీ మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా దాని వెబ్‌సైట్‌కి వెళ్లవచ్చు.

Best Mobiles in India

English summary
Eros Now Has Partnered With Globenet For India Market Development
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X