ముంచుకొస్తున్న మరో Ransomware

వన్నాక్రై ర్యాన్సమ్‌వేర్ దెబ్బ నుంచి ప్రపంచదేశాలను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విషయం తెలిసిందే. వన్నాక్రై ర్యాన్సమ్‌వేర్ కు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన టూల్స్‌ను సెక్యూరిటీ అభివృద్ధి చేసుకుంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సరికొత్త సెక్యూరిటీ టూల్‌

తాజాగా Benjamin Delpy అనే సెక్యూరిటీ రిసెర్చర్ ఓ సరికొత్త సెక్యూరిటీ టూల్‌ను అభివృద్ది చేసినట్లు సమాచారం. ఈ టూల్ సహాయంతో లాక్ చేసి ఉన్న కంప్యూటర్ ను సులువుగా అన్ లాక్ చేయవచ్చట.

కొత్త రకం మాల్వేర్‌ EternalRocks..

తాజాగా మరో కొత్త రకం మాల్వేర్‌ను సెక్యూరిటీ రిసెర్చర్లు కనుగొన్నట్లు సమాచారం. ఈ మాల్వేర్‌కు EternalRocks అని కూడా పేరు పెట్టేసారు.

అదే లోపాన్ని టార్గెట్ చేస్తూ...

వన్నాక్రై ర్యాన్సమ్‌వేర్ వ్యాపించేందుకు కారణమైన విండోస్ లోపాన్నే ఈ EternalRocks కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

వన్నాక్రై కంటే ప్రమాదకరం..

EternalRocks ర్యాన్సమ్‌వేర్‌ను వన్నాక్రై కంటే ప్రమాదకరమైన ర్యాన్సమ్‌వేర్‌గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. Fortune రిపోర్ట్స్ ప్రకారం EternalRocks ర్యాన్సమ్‌వేర్ 6 రకాల NSA టూల్స్ ను ఉపయోగించుకుంటోంది.

ఏ క్షణంలోనైనా విజృంభించే అవకాశం..

EternalChampion, EternalRomance, DoublePulsar ఇలా వీటి పేర్లు ఉండొచ్చని రిసెర్చర్లు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే EternalRocks ర్యాన్సమ్‌వేర్‌లో ఏ విధమైన అనుమానస్పద కాంపోనెంట్స్ లేవని, యూజర్ ఫైల్‌ను ఇది ఎన్‌క్రిప్ట్ చేయలేదని రిసెర్చర్లు చెబుతున్నారు. అయితే ఇది ఏ క్షణంలోనైనా కంప్యూటర్లను ప్రమాదంలోకి నెట్టేయగలదని వీరు అభిప్రాయపడుతున్నారు.

Ransomware అనేది.

Ransomware అనేది సైబర్ క్రిమినల్స్ సృష్టించే ఒక మాల్వేర్. దీన్నీ మీ పీసీలో హోస్ట్ చేసినట్లయితే, మీ అనుమతి లేకుండానే డివైస్ మొత్తం లాక్ అయిపోతుంది. అంతేకాదు, ఫోన్ ఆపరేషన్ మొత్తం అటాకర్స్ చెప్పుచేతుల్లోకి వెళ్లిపోతుంది.ఇక్కడి నుంచి సైబర్ క్రిమినల్స్ మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభిస్తారు. కొంత నగదు చెల్లిస్తేనే ఫోన్‌ను అన్‌లాక్ చేస్తామని హెచ్చరికలు పంపుతుంటారు. ఈ నగదు చెల్లింపు అనేది బిట్ కాయిన్స్ ఇంకా ఇతర డిజిటల్ కరెన్సీల రూపంలో చేయాల్సి ఉంటుంది.

అనేక పేర్లతో రాన్సమ్‌వేర్లు..

క్రిప్టోలాకర్, క్రిప్టోవాల్, లాకీ, సమాస్, సమ్‌సమ్, సమ్‌సా ఇలా అనేక పేర్లతో రాన్సమ్‌వేర్లు మార్కెట్లో చలామణి అవుతున్నాయి. వీటిలో ప్రధానమైన క్రిప్టోలాకర్ అనే రాన్సమ్‌వేర్‌ను సెప్టంబర్ 5, 2013లో గుర్తించారు. ఈ రాన్సమ్‌వేర్‌‌ను ప్రధానంగా మైక్రోసాఫ్ట్ విండోస్ డివైస్‌లను టార్గెట్ చేస్తూ సైబర్ క్రిమినల్స్ తయారు చేసుకున్నారు.

Locky

మరో రాన్సమ్‌వేర్‌ అయిన Lockyని ఫిబ్రవరి 2016లో గుర్తించారు. మైక్రోసాప్ట్ వర్డ్ డాక్యుమెంట్స్ రూపంలో ఉండే ఈ రాన్సమ్‌వేర్‌ ఫైల్ క్రిప్టోలాకర్ కంటే ప్రమాదకరమైనది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
EternalRocks: This New Ransomware Is Stronger Than WannaCry!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot