ట్రంప్ దెబ్బకు సిలికాన్ వ్యాలీ విలవిల, గూగుల్ బేజారు !

|

వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ దేశ కంపెనీలకు శరాఘాతంలా మారింది. ముఖ్యంగా ఈ నిర్ణయంతో అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్‌ తగిలింది. తన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసినందుకుగాను గూగుల్‌కు 4.34 బిలియన్‌ యూరోల (500 కోట్ల డాలర్లు-సుమారు రూ.33,500 కోట్లు) జరిమానాను యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) విధించింది. కాగా ఈయూ చరిత్రలో ఇంత భారీ జరిమానాను ఇంతకు ముందెన్నడూ విధించలేదు. పూర్తి వివరాల్లోకెళితే..

 

నోకియా నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్, రూ.10 వేలకేనోకియా నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్, రూ.10 వేలకే

ఆండ్రాయిడ్‌ ఆధిపత్యాన్ని..

ఆండ్రాయిడ్‌ ఆధిపత్యాన్ని..

గూగుల్‌ తన ఆండ్రాయిడ్‌ ఆధిపత్యాన్ని చట్టవిరుద్ధంగా వినియోగించుకుందని, తన సొంత సెర్చ్‌ ఇంజన్‌, బ్రౌజర్‌ వినియోగాన్ని పెంచుకునేందుకు వాడుకుందని యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) కాంపిటీషన్‌ కమిషన్‌ ఆరోపిస్తోంది.

ఆధిపత్య నిరోధక నిబంధనలను..

ఆధిపత్య నిరోధక నిబంధనలను..

మూడేళ్ల దర్యాప్తు అనంతరం ఈయూ ఆధిపత్య నిరోధక నిబంధనలను గూగుల్‌ ఉల్లంఘించిందని సంస్థకు 434 కోట్ల యూరోల (500 కోట్ల డాలర్లు) జరిమానా విధించాలని కమిషన్‌ నిర్ణయించింది.

90 రోజుల్లోగా స్వస్తి పలకాలని ..

90 రోజుల్లోగా స్వస్తి పలకాలని ..

ఇంటర్నెట్‌ సెర్చ్‌లో తన ఆధిపత్య మార్కెట్‌ స్థాయిని మరింత బలోపేతం చేసుకునేందుకు గూగుల్‌ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిందని, ఇలాంటి చర్యలకు 90 రోజుల్లోగా స్వస్తి పలకాలని లేని పక్షంలో రోజువారీ సగటు టర్నోవర్‌లో ఐదు శాతం వరకు పెనాల్టీగా చెల్లించాల్సి వస్తుందని గూగుల్‌ను ఈ కమిషన్ హెచ్చరించింది.

గత ఏడాదిలో గూగుల్‌కు..
 

గత ఏడాదిలో గూగుల్‌కు..

తన షాపింగ్‌ సర్వీసులకు అనుకూలంగా వ్యవహరించినందుకుగాను గత ఏడాదిలో గూగుల్‌కు ఈయూ 240 కోట్ల యూరోల జరిమానాను విధించింది. ఇప్పుడు విధించిన జరిమానా దాదాపు రెండింతలు పెరిగింది.

ఈయూ, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం..

ఈయూ, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం..

ఇప్పటికే ఈయూ, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం సాగుతున్న నేపథ్యంలో తాజాగా గూగుల్‌కు ఈయూ భారీ జరిమానా విధించడంపై అమెరికా ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏ స్థాయిలో విరుచుకుపడతారోనన్న భయాలు వ్యక్తం అవుతున్నాయి.

క్రోమ్‌ బ్రౌజర్‌ను ఫోన్లలో ముందుగానే ఇన్‌స్టాల్‌ చేయాలంటూ..

క్రోమ్‌ బ్రౌజర్‌ను ఫోన్లలో ముందుగానే ఇన్‌స్టాల్‌ చేయాలంటూ..

తన సెర్చ్‌ ఇంజన్‌, గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను ఫోన్లలో ముందుగానే ఇన్‌స్టాల్‌ చేయాలంటూ దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌, చైనాకు చెందిన హువాయి తదితర మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీలపై గూగుల్‌ ఒత్తిడి చేసినట్టు ఈయూ కాంపిటీషన్ కమీషనర్ వెస్టాగర్‌ తెలిపారు.

కంపెనీలు మూతపడే పరిస్థితి..

కంపెనీలు మూతపడే పరిస్థితి..

దీని వల్ల పోటీ కంపెనీలు మూతపడే పరిస్థితి తెచ్చినట్టు ఆమె చెప్పారు. కొన్ని గూగుల్‌ యాప్స్‌కు లైసెన్స్‌ ఇస్తామన్న షరతుపై చాలా కంపెనీలు గూగుల్‌ సెర్చ్‌ను డీఫాల్ట్‌గా సెట్‌ చేశాయి. ఇలాంటి మొబైల్స్‌ను ఈయూలోనూ విక్రయించినట్టు యూరోపియన్‌ కమిషన్‌ పేర్కొంది.

స్మార్ట్‌ఫోన్లను కంపెనీలు అమ్మకుండా..

స్మార్ట్‌ఫోన్లను కంపెనీలు అమ్మకుండా..

ఆండ్రాయిడ్‌ ఓపెన్‌ సోర్స్‌ కోడ్‌ ఆధారంగా పోటీ కంపెనీలు తయారు చేసిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఉన్న స్మార్ట్‌ఫోన్లను కంపెనీలు అమ్మకుండా గూగుల్‌ నిరోధించినట్టు తెలిపింది. 

ప్రత్యామ్నాయాలను వాడకుండా..

ప్రత్యామ్నాయాలను వాడకుండా..

తన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో ప్రత్యామ్నాయాలను వాడకుండా నిరోధించేలా తయారీదారులతో ముందస్తుగానే గూగుల్‌ సంప్రదింపులు జరిపిందని రెగ్యులేటర్లు ఆరోపిస్తున్నాయి.

గూగుల్‌ సవాల్‌

గూగుల్‌ సవాల్‌

కాగా ఈయూ కమిషన్‌ విధించిన జరిమానాను సవాల్‌ చేయనున్నట్టు గూగుల్‌ పేర్కొంది. తమ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఔస్‌) ప్రతి ఒక్కరికీ ఎక్కువ అవకాశాన్ని కల్పించడమే తప్ప తక్కువ కాదని తెలిపింది.

గూగుల్‌ సిఇఒ

గూగుల్‌ సిఇఒ

తమ మొబైల్‌ ఓఎస్‌ వల్ల కలిగిన ప్రయోజనాన్ని గూగుల్‌ సిఇఒ సుందర్‌ పిచాయ్‌ బ్లాగ్‌ ద్వారా తెలియజేశారు. ఆండ్రాయిడ్‌ కారణంగా విభిన్న ధరల్లో 1,300 బ్రాండ్‌ ్సకు చెందిన 24,000కు పైగా డివైజ్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు.

ఆండ్రాయిడ్‌..

ఆండ్రాయిడ్‌..

వీటిలో యూరోపియన్‌ కంపెనీలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆండ్రాయిడ్‌ వేలాది మంది ఫోన్ల తయారీదారులకు, మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆపరేటర్లకు అనేక డివైజ్‌లను తయారు చేసే అవకాశం కల్పించిందన్నారు. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌పై ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యాప్‌ డెవలపర్లు పని చేస్తున్నారన్నారు.

గూగుల్‌తో పాటు, ఆపిల్‌, అమెజాన్‌..

గూగుల్‌తో పాటు, ఆపిల్‌, అమెజాన్‌..

ఈ సెర్చింజిన్‌ దిగ్గజం గూగుల్‌తో పాటు, ఆపిల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ లకు కూడా యూరోపియన్‌ రెగ్యులేటర్లు జరిమానాలు విధించాయి.

 ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన తరుణంలో..

ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన తరుణంలో..

ఈయూ దేశాల నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను పెంచడం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన తరుణంలో గూగుల్‌పై ఈయూ కమిషన్‌ రికార్డు స్థాయిలో జరిమానా విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

దిగుమతి సుంకాల వివాదంపై./

దిగుమతి సుంకాల వివాదంపై./

దిగుమతి సుంకాల వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో చర్చించేందుకు యూరోపియన్‌ కమిషన్‌ చీఫ్‌ జాన్‌ క్లాడ్‌ జంకర్‌ మరో వారంలో అమెరికా వెళ్లనున్న తరుణంలో ఈ ఉత్తర్వులు రావడం గమనార్హం.

మొత్తం 28 దేశాలు..

మొత్తం 28 దేశాలు..

యూరోపియన్‌ యూనియన్‌లో మొత్తం 28 దేశాలు ఉన్నాయి.ఈ దేశాలన్నీ అమెరికాకు వాణిజ్యానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించేందుకు రెడి అవుతున్నట్లు సమాచారం.

Best Mobiles in India

English summary
Europe fines Google $5 billion for abusing Android dominance more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X