2023 నాటికి ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్

|

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో చాలా వరకు పనులు ఇంటర్నెట్‌తో ముడిపడి ఉండటంతో
స్మార్ట్‌ఫోన్ అనేది ముఖ్యమైన సాధనంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో చాలా మంది భారతీయులు ఇప్పటికే తమ ఫీచర్ ఫోన్‌లను స్మార్ట్‌ఫోన్‌లతో అప్‌గ్రేడ్ చేసుకోవటం జరిగింది. ఫీచర్ ఫోన్ యూసేజ్ నుంచి స్మార్ట్‌ఫోన్ యూసేజ్‌కు స్విచ్ అవుతోన్న యూజర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో నితి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ కంట్ స్పందించారు.

Every Indian will own a smartphone in the next 5 years: Amitabh Kant

రానున్న 5 సంవత్సరాల్లో ప్రతి భారతీయుడు స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉంటాడని ఆయన తెలిపారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎమ్ఏఐ) నిర్వహించిన ఇండియా డిజిటల్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన స్మార్ట్‌ఫోన్ వినియోగానికి సంబంధించి కీలక ప్రసంగం చేసారు. ప్రస్తుతానికి భారత్‌లో దాదాపు 40 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉన్నారని, మీరు మొబైల్ ఫోన్‌ల ద్వారానే ఇంటర్నెట్‌ను వినియోగించుకోగలుగుతున్నారని ఆయన తెలిపారు.

ఫేస్‌బుక్, వాట్సాప్ ఇంకా ట్విట్టర్ యాప్‌ల వినియోగంలో నెలవారీ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య భారత్‌లో మొదటి స్థానంలో ఉందని ఆయన తెలిపారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలో 17 కోట్లు కొత్త కస్టమర్‌లు జియో నెట్‌వర్క్‌లో జాయిన్ అవటమనేది సాధారణమైన విషయం కాదని ఆయన స్పష్టం చేసారు.

దేశంలో భారీ టెక్నాలజీ డిస్రప్షన్‌కు ఇది సరైన సమయమని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి విప్లవాత్మక టెక్నాలజీలు మార్కెట్లోకి రంగ ప్రవేశం చేసేందుకు ఇది సరైన సమయమని ఆయన తెలిపారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మార్కెట్ 2025 నాటికి 70 బిలియన్ డాలర్లకు విస్తరించే అవకాశముందని ఆయన తెలిపారు.

రూ.500లో ఫీచర్ ఫోన్ వస్తే...పెద్దలకు గిఫ్ట్‌గా ఇచ్చేయవచ్చు కదా,అయితే మీకోసమే !రూ.500లో ఫీచర్ ఫోన్ వస్తే...పెద్దలకు గిఫ్ట్‌గా ఇచ్చేయవచ్చు కదా,అయితే మీకోసమే !

ఇక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విభాగానికి వచ్చేసరికి, భారత్‌లో ఈ సెక్టార్ 32 బిలియన్ డాలర్ల రివెన్యూను జనరేట్ చేసే అవకావముందని ఆయన అన్నారు. భారత్‌లో 25 శాతం ఉద్యోగాలను అడ్వాన్సుడ్ రోబోటిక్స్ హ్యాండిల్ చేస్తున్నాయని, రానున్న సంవత్సరాల్లో ఈ శాతం 45కు విస్తరించే అవకావం ఉందని అమితాబ్ కంట్ తెలిపారు.

అత్యధిక మంది యక్టివ్ ఇంటర్జెట్ యూజర్లను కలిగి ఉన్న దేశంగా భారత్ అభివృద్ధి చెందిందని, రానున్న 10 సంవత్సరాల్లో ఇక్కడి డిజిటల్ లావాదేవీల సంఖ్య 100 ట్రిలియన్ డాలర్లకు రీచ్ అయ్యే అవకాశముందని ఆయన అన్నారు. ప్రస్తుతానికి 4,000గా ఉన్న యువ స్టార్టప్‌ల సంఖ్య 12000కు చేరుకునే అవకాశముందని ఆయన తెలిపారు.

Best Mobiles in India

Read more about:
English summary
With the cost of smartphone acquisition coming down to as low as $1 (Rs 65) per consumer, all Indians would have an access to smartphones in next four to five years.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X