జియో యూజర్లు నెలకి వాడే డేటా ఇంత తక్కువా ?

|

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులను నాంది పలికిన రిలయన్స్ జియో మార్కెట్లో రోజురోజుకు సరికొత్తగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కొత్త కొత్త ఆఫర్లతో జియో కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇతర టెలికాం దిగ్గజాలకు షాకులిస్తూ పోతోంది. జియో మీద ఇప్పుడు మరో కొత్త న్యూస్ బయటకొచ్చింది. యూజర్‌ బేస్‌ను కూడా అదే స్థాయిలో పెంచుకుంటూ వెళ్తున్న జియో 2018 క్యూ1లో జియో తన యూజర్‌ బేస్‌ను 186.6 మిలియన్లకు పెంచుకున్నట్టు ఫలితాల్లో పేర్కొంది. ఈ కాలంలో కొత్తగా 26.5 మిలియన్ల యూజర్లను జియో తన సొంతం చేసుకున్నట్టు తెలిపింది.

 

H-1B visa మీద అమెరికా వెళ్లాలంటే ఈ కంపెనీలతోనే, జీతాలెంతో తెలుసా ?H-1B visa మీద అమెరికా వెళ్లాలంటే ఈ కంపెనీలతోనే, జీతాలెంతో తెలుసా ?

క్వార్టర్‌ ఫలితాల సందర్భంగా..

క్వార్టర్‌ ఫలితాల సందర్భంగా..

క్వార్టర్‌ ఫలితాల సందర్భంగా జియో తన ఆర్పూను(యావరేజ్‌ రెవెన్యూ ఫర్‌ యూజర్‌), డేటా వాడకాన్ని కూడా వెల్లడించింది. నెలలో ఒక్కో కస్టమర్‌ సగటున 9.7జీబీ డేటాను వాడుతున్నట్టు జియో తెలిపింది. అంటే మొత్తంగా 2018 క్యూ1లో 506 కోట్ల జీబీ డేటాను సబ్‌స్క్రైబర్లు వాడినట్టు తెలిపింది.

వాయిస్‌ కాల్స్‌ పరంగా..

వాయిస్‌ కాల్స్‌ పరంగా..

అదేవిధంగా వాయిస్‌ కాల్స్‌ పరంగా కూడా ఈ కాలంలో 37,218 కోట్ల నిమిషాల కాలింగ్‌ ట్రాఫిక్‌ నమోదైనట్టు తెలిపింది. అంటే ప్రతి జియో 4జీ సబ్‌స్క్రైబర్‌ నెలకు 716 నిమిషాల వాయిస్‌ కాలింగ్‌ను, సగటున 13.8 గంటల వీడియోలను వీక్షించినట్టు వెల్లడించింది. ముఖ్యంగా జియో యూజర్‌బేస్‌ భారీగా పెరగడం కంపెనీకి ఎంతో సహకరిస్తున్నట్టు తెలిపింది.

జనవరి-మార్చి కాలంలో
 

జనవరి-మార్చి కాలంలో

ఆర్పూ కూడా జనవరి-మార్చి కాలంలో రూ.137.1గా నమోదైందని, అయితే ఇది గత మూడు నెలల కాలంతో పోలిస్తే తక్కువేనని రిలయన్స్‌ వెల్లడించింది. జియో ప్రధాన ప్రత్యర్థి ఎయిర్‌టెల్‌ ఆర్పూ కూడా ఈ సారి పడిపోయిన సంగతి తెలిసిందే.

2018 మార్చి కాలంలో..

2018 మార్చి కాలంలో..

2018 మార్చి కాలంలో ట్రాయ్‌కి చెందిన మైస్పీడ్‌ అనాలటిక్స్‌ యాప్‌ ద్వారా నిర్వహించిన టెస్ట్‌లో తమది గత 15 నెలల కాలంలో ఫాస్టెస్ట్‌ నెట్‌వర్క్‌గా పేరు గడించినట్టు జియో పేర్కొంది. అంతేకాక కాల్‌ డ్రాప్‌ రేటు కూడా అత్యంత తక్కువగానే నమోదైంది.

Best Mobiles in India

English summary
Every Reliance Jio subscriber uses 9.7GB data per month, says company More news at gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X