జియో సాధించిన విజయాలు, భవిష్యత్ ప్లాన్స్

టెలికం రంగాన్ని ఓ కుదుపు కుదిపిన రిలయన్స్ జియో తన 10 నెలల ప్రస్థానంలో అనేక సంచలనాలు నమోదు చేసింది. అక్కడితో ఆగకుండా మరిన్ని సంచలనాలు నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు జియో సాధించిన విజయాలు అలానే త్వరలో ప్రారంభించబోయే సర్వీసులకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

170 రోజుల్లో 100 మిలియన్ల కస్టమర్‌లు..

జియో తన ఉచిత ఆఫర్లతో కేవలం 170 రోజుల్లో 100 మిలియన్ల కస్టమర్‌లను జియో సొంతం చేసుకోగలిగింది. అంటే ఆ 170 రోజుల్లో ప్రతి సెకనుకు 7గురు కొత్త యూజర్లు జియో 4జీ నెట్‌వర్క్‌లో జాయిన్ అయ్యారన్నమాట. ప్రస్తుతం జియో యూజర్ల సంఖ్య 125 మిలియన్లుగా ఉంది.

రోజుకు 250 కోట్ల నిమిషాల కాల్స్..

జియో నెట్‌వర్క్ ద్వారా రోజుకు 250 కోట్ల నిమిషాల వాయిస్ ఇంకా వీడియో కాల్స్‌ను జియో యూజర్లు నిర్వహించుకుంటున్నారు. జియో ఉచిత ఆఫర్ల నుంచి జియో ప్రైమ్ ఆఫర్స్‌కు కన్వర్ట్ అయిన యూజర్ల సంఖ్య 100 మిలియన్లు.

నెలకు 120 కోట్ల జీబి డేటాను వినియోగించుకుంటున్నారు..

జియో రాకతో డేటా వినియోగం బాగా పెరిగిపోయింది. 6 నెలల క్రితం వరకు నెలవారీ డేటా వినియోగం 20 కోట్ల జీబీగా ఉండేది. ప్రస్తుతం 120 కోట్ల జీబికి చేరుకుంది. రిలయన్స్ జియ అతిపెద్ద మొబైల్ వీడియో నెట్‌వర్క్‌గా అవతరించింది.

పాన్-ఇండియా మొత్తం LTE నెట్‌వర్క్‌

పాన్-ఇండియా మొత్తం LTE నెట్‌వర్క్‌ను ఆఫర్ చేస్తున్న ఏకైక మొబైల్ ఆపరేటర్ రిలయన్స్ జయో. 800MHz, 1800MHz, 2300MHz బ్యాండ్స్ క్రింద జియో తన నెట్‌వర్క్‌ను అందిస్తోంది.

జియోఫోన్ పేరుతో ఈ ఫోన్ అందరికి ఉచితం..

ఇండియా కా స్మార్ట్‌ఫోన్ నినాదంతో సరికొత్త స్మార్ట్ ఫీచర్ ఫోన్‌ను జియో లాంచ్ చేసింది. జియోఫోన్ పేరుతో ఈ ఫోన్ అందరికి ఉచితంగా లభిస్తుంది. అయితే ముందుగా రూ.1500 డిపాజిట్ చేయావల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన మొత్తాన్ని మూడు సంవత్సరాల తరువాత తిరిగి ఇచ్చేస్తారు. జియో ఫోన్ ప్రీ-బుకింగ్స్ ఆగష్టు 24 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీ ప్రాసెసర్ సెప్టంబర్ నుంచి ప్రారంభమవుతుంది.

జియో డైరెక్ట్ టూ హోమ్

50 ప్లస్ ఛానల్స్, వాటిలో 50కి పైగా హెచ్‌డీ ఛానల్స్‌తో జియో డైరెక్ట్ టూ హోమ్(డీటీహెచ్) టీవీ సర్వీసుల్లోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరోలనే వీటిని ప్రారంభించబోతున్నట్టు కంపెనీ ప్రతినిధులు కూడా చెప్పారు. ఈ సర్వీసులను వాడుకునేందుకు జియో టీవీ యాప్‌తో పాటు యూజర్ల ఫోన్లలో జియో సిమ్‌ను కలిగి ఉండాలి. అచ్చం ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ సెట్ ఆఫ్ బాక్స్ లాగానే ఈ సర్వీసులు కూడా ఉండనున్నాయి.

జియో 'ఫైబర్ టూ ది హోమ్'

1జీబీపీఎస్ స్పీడుతో జియో తన 'ఫైబర్ టూ ది హోమ్' బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను ఈ ఏడాదిలోనే లాంచ్ చేసేందుకు ప్లాన్ వేస్తోందని తెలుస్తోంది. ఈ పైలట్ ప్రొగ్రామ్ ఇప్పటికే ప్రారంభించామని రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ1 ఫలితాల సందర్భంగా కంపెనీ ప్రకటించింది. వీటిని మరిన్ని నగరాలకు విస్తరించనున్నామని వెల్లడించింది. అయితే రిలయన్స్ జియో హోమ్ బ్రాడు బ్యాండు లాంచ్ తేదీలను, ధరలను కంపెనీ ప్రకటించలేదు. ఫైబర్ టు ద హోమ్ (FTTH) టెక్నాలజీ పై రూపొందించబడిన జియో బ్రాడ్‌బ్యాండ్ మినిమమ్ 100Mbps స్పీడ్‌ను ఆఫర్ చేయగలదట.

హోమ్ ఆటోమేషన్

జియో బ్రాడ్ బ్యాండుకు అనుసంధానంగా ఉండే మరిన్ని హోమ్ ఆటోమేషన్ ఉత్పత్తులను కూడా అందించనున్నట్టు తెలుస్తోంది. జియో ఫైబర్ టెక్నాలజీ పై స్పందించగలిగే ఈ ఆటోమేషన్ ప్రొడక్ట్స్ ద్వారా స్మార్ట్ హోమ్ అనుభూతులను ఆస్వాదించే వీలుంటుందని కంపెనీ చెబుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Everything about Reliance Jio's achievements and future plans so far. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot