రూ. 251తో మేక్ ఇన్ ఇండియా కల చెదిరిందా..?

Written By:

రూ. 251కే స్మార్ట్‌ఫోన్, 2276కే ఆకాష్ టాబ్లెట్.. ఇవి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాలు. అయితే అవి సామాన్యులకు నిజంగానే సరికొత్త ప్రపంచాన్ని చూపించాయి. ఎంతలా అంటే వాటి మీద అసహ్యం వేసేంతలా... మేక్ ఇన్ ఇండియా పథకం నీరుగారిపోయేంతలా...అవును మేక్ ఇన్ ఇండియా నినాదానికి అవి మాయని మచ్చలా మిగిలాయి. ఊరించి ఉసిగొల్పి నిరాశను మిగిల్చాయి.

Read more : ఫేస్‌బుక్ వీడియోలు డౌన్‌లోడ్ చేయండిలా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మేక్ ఇన్ ఇండియాకు తూట్లు

ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా 'ఫ్రీడం 251' దుమారం రేపుతోంది. మేక్ ఇన్ ఇండియాకు తూట్లు పొడుస్తోంది. నొయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ కంపెనీ ఈ ఫోన్‌ ను రూ. 251కి అందిస్తామని ప్రకటించి ఆన్‌లైన్‌లో అమ్మకాలను ప్రారంభించింది.

అక్కడి నుంచి అడుగుకూడా ముందుకు పడటం లేదు

కాని వెబ్‌సైట్‌‌లో ఫోన్‌కు సంబంధించిన సమాచారం ఎంటర్ చేసిన తరువాత అది బై పే దగ్గరనే ఆగిపోతోంది. అక్కడి నుంచి అడుగుకూడా ముందుకు పడటం లేదు. వినియోగదారులు ఎంత ప్రయత్నించినా అది కాని అది తీసుకోవడం లేదు.

మరి కాసేపటికే సర్వర్ డౌన్ అంటూ మెసేజ్

మరి కాసేపటికే సర్వర్ డౌన్ అంటూ మెసేజ్. ఊహించిన దాని కంటే భారీ స్పందన రావడంతో బుకింగ్ ప్రక్రియ కష్టంగా మారిందని, 2 సెకన్లకు 6 లక్షల లైక్స్ వచ్చాయని... దీంతో సర్వర్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కంపెనీ ప్రకటించింది. మరో 24 గంటల తర్వాత మెరుగైన సేవలతో సైట్‌ను అందుబాటులోకి తెస్తామని కంపెనీ నోట్‌లో తెలిపింది.

ఎన్నో ట్విస్టులు మరెన్నో షాకింగ్ న్యూస్‌లు

ఇలా ఎన్నో ట్విస్టులు మరెన్నో షాకింగ్ న్యూస్‌లు వెరసి మేక్ ఇన్ ఇండియా పథకం నీరుగారిపోయేలా చేస్తున్నాయి. ఈ ఫోన్ ప్రారంభం నుంచే అనేక అనుమానాలకు తావిచ్చింది. చివరకు అదే అనుమానాలను మరింతగా బలపర్చింది.

యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్‌ డిజైన్‌ను

కంపెనీ మీడియా కోసం విడుదల చేసిన శాంపిల్‌ యూనిట్‌ రివ్యూలోనే అనేక కొత్త అంశాలు వెలుగుచూశాయి. ప్రఖ్యాత యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్‌ డిజైన్‌ను 'ఫ్రీడం 251'లో పూర్తిగా కాపీచేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

యాపిల్‌ నుంచి దీనికి కాపీరైట్‌ సమస్యలు ఎదురయ్యే అవకాశం

దీంతో యాపిల్‌ నుంచి దీనికి కాపీరైట్‌ సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఐఫోన్‌, ఐప్యాడ్, మ్యాక్‌ లలో కనిపించే సఫారీ వెబ్‌ బ్రౌజరే ఇందులోనూ కనిపిస్తున్నది.

ఐఫోన్ హోమ్‌ బటన్ తరహాలోనే దీనికి కూడా హోమ్‌ బటన్ రౌండ్‌గా

ఫ్రీడం 251' పూర్తిగా ఐఫోన్‌ను పోలినట్టు కనిపించడమే కాకుండా.. ఐఫోన్ హోమ్‌ బటన్ తరహాలోనే దీనికి కూడా హోమ్‌ బటన్ రౌండ్‌గా కనిపిస్తున్నది. ఫ్రీడం 215 యూనిట్‌లో పలు సమస్యలు కూడా సమీక్షల్లో నిపుణులు గుర్తించారు.

దీని అసలు బ్రాండ్ నేమ్‌ 'యాడ్‌కామ్‌' అని

ఇంకా పెద్ద తప్పు ఏంటంటే ఈ స్మార్ట్‌ఫోన్‌పైన 'ఫ్రీడం 251' అని పెద్దగా రాసి ఉన్నప్పటికీ.. దీని అసలు బ్రాండ్ నేమ్‌ 'యాడ్‌కామ్‌' అని తెలుస్తున్నది. ఒరిజినల్ బ్రాండ్ పేరును చెరిపేసి.. 'ఫ్రీడం 251' అని రాసినట్టు కనిపిస్తున్నది. అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇలా తమ ఫోన్ వాడుకున్నట్లు ఆ కంపెనీకి కూడా తెలియదట.

ఈ కామర్స్ వెబ్‌సైట్లలో సుమారు రూ. 4వేలకు

యాడ్‌కామ్‌' అనే సంస్థ చైనాకు చెందినది. ఈ కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్లు అమెజాన్, స్నాప్‌డీల్, గాడ్జెట్స్ 360 వంటి ఈ కామర్స్ వెబ్‌సైట్లలో సుమారు రూ. 4వేలకు లభిస్తున్నాయి. అదే ఫోన్ తరహాలో విడుదల చేసిన ఫ్రీడమ్ ఫోన్ 251 రూపాయలకు ఎలా వస్తుందనే సందేహాలు వెలువెత్తుతున్నాయి.

స్వచ్ఛ భారత్, మహిళల భద్రత, యూట్యూబ్

ఇక 'ఫ్రీడం 251'లో స్వచ్ఛ భారత్, మహిళల భద్రత, యూట్యూబ్, వాట్సప్, ఫేస్‌బుక్ వంటి యాప్స్ ఉంటాయని అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నప్పటికీ.. ఈ మోడల్‌లో అలాంటి యాప్స్ ఏమీ లేవు. 

దీనిపై వారు ఈ మోడల్ శాంపిల్ మాత్రమేనని

దీనిపై వారు ఈ మోడల్ శాంపిల్ మాత్రమేనని, వినియోగదారులకు అమ్మబోయే 'ఫ్రీడం 251' మొబైల్ ఫోన్లలో తాము పేర్కొన్న అన్ని ఫీచర్స్, యాప్స్ ఉంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఉదయం చూపించిన ఫోన్ సాయంత్రానికి మాయం

ఇక ఉదయం చూపించిన ఫోన్ సాయంత్రానికి మాయమయ్యింది. ఆ స్థానంలో మరొక ఫోన్ వచ్చి చేరింది. రెండు మోడల్స్ రిలీజ్ చేస్తున్నారా అంటే అదేమి లేదు. ఇక లాంచింగ్ సమయంలో మీడియాకు చూపించిన పోన్ మరొకటి.. ఇంకా అసలైన విచిత్రం ఏంటంటే ఈ తతంగమంతా రక్షణ మంత్రి చేతులు మీదుగానే జరగడం.

దిగ్గజ కంపెనీలే తమ బ్రాండ్లకు

దిగ్గజ కంపెనీలే తమ బ్రాండ్లకు ఆన్‌లైన్ అమ్మకాల్లో బుకింగ్ కోసం కేవలం ఒక రోజు మాత్రమే ఇస్తాయి. కాని ఈ కంపెనీ మూడు రోజులు ఇచ్చింది. అంటే కోట్లలో జనాలు బుక్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

కంపెనీ తన దగ్గర స్టాక్ ఎంత ఉన్నదీ

కంపెనీ తన దగ్గర స్టాక్ ఎంత ఉన్నదీ చెప్పడం లేదు. మానఫ్యాక్చరింగ్ ఎక్కడ ఉందో ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదు. ఒక స్మార్ట్ పోన్ బయటకు రావాలంటే కనీసం 3000 అయినా అవసరమవుతుందని ఇండియన్ సెల్యూలార్ అసోషియేషన్ వాళ్లు చెబుతున్నారు.

మేక్ ఇన్ ఇండియాకు రూ. 251 ఫోన్ తూట్లు పొడించిందనే దానిలో

మొత్తానికి మేక్ ఇన్ ఇండియాకు రూ. 251 ఫోన్ తూట్లు పొడించిందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. డిజిటల్ ఇండియా అంటూ పరుగులు పెడుతున్న ప్రధాని మోడీ ఇటువంటి అనేక విషయాలపై దృష్టి సారించవలిసి ఉంటుంది. అప్పుడే అనుకున్న డిజిటల్ ఇండియా కళ్లముందు సాక్షాత్కరించగలదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Everything that is wrong with the world s cheapest smartphone
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot