TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
వాట్సాప్ ప్లస్.. ఇదేంటి?
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించబడుతోన్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌లలో వాట్స్‌యాప్ ఒకటి. అతితక్కువ కాలంలోనే అమితమైన జనాదరణను సొంతం చేసుకున్న ఈ యాప్‌కు స్మార్ట్‌ఫోన్ యూజర్లు బ్రహ్మరథం పడుతున్నారు. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో ఈ యాప్‌ను మరింత ఆధునికంగా తీర్చిదిద్దే క్రమంలో తయారీదారులు మరింతగా శ్రమిస్తున్నారు. వీరి శ్రమకు ఫలితంగా త్వరలో అందుబాటులోకి రాబోతున్నదే ‘వాట్స్‌యాప్ ప్లస్'. వాట్స్‌యాప్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా రాబోతున్న ‘వాట్స్‌యాప్ ప్లస్' సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకోనుంది. ఈ లేటెస్ట్ వర్షన్ యాప్ అధికారికంగా విడుదల కానప్పటికి వాట్స్‌యాప్ అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యమవుతోంది. వాట్స్‌యాప్ ప్లస్‌లోని ప్రత్యేకతలను చూద్దాం....
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
వాట్సాప్ ప్లస్.. ఇదేంటి?
ప్రస్తుతం అందుబాటలో ఉన్న కరెంట్ వర్షన్ వాట్స్‌యాప్ కేవలం వాల్‌పేపర్‌లను మాత్రమే కలిగి ఉంటుంది.
వాట్సాప్ ప్లస్.. ఇదేంటి?
త్వరలో రాబోతున్న వాట్స్‌యాప్ ప్లస్ మాత్రం 700లకు పైగా థీమ్‌లను కలిగి ఉంటుంది. వీటిలో నచ్చిన థీమ్‌ను యూజర్ ఎంపిక చేసుకోవచ్చు.
వాట్సాప్ ప్లస్.. ఇదేంటి?
సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో తమ వ్యక్తీకరణలను పదాలతో కాకుండా ఎమోటికాన్‌లతో వ్యక్తీకరించుకుంటున్న తీరును ఇటీవల కాలంలో మనం తరచుగా చూస్తున్నాం.
ఎమోటికాన్‌లకు పెద్దపీట
ఈ ట్రెండ్‌ను పరిగణంలోకి తీసుకున్న వాట్స్‌యాప్, తమ అప్‌డేటెడ్ వర్షన్ యాప్‌లో పలు కొత్త ఎమోటికాన్‌లను పొందుపరిచింది.
వాట్సాప్ ప్లస్.. ఇదేంటి?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాట్స్‌యాప్ ద్వారా యూజర్లు తాము ఆఖరి సారిగా చూసిన మెసేజ్‌కు సంబంధించిన స్టేటస్‌ను మాత్రమే హైడ్ చేసుకోవచ్చు. ‘ఆన్‌లైన్' స్టేటస్‌ను హైడ్ చేసే అవకాశం ఉండదు. అయితే రాబోతున్న వాట్స్‌యాప్ ప్లస్‌లో యూజర్లు తమ ‘ఆన్‌లైన్' స్టేటస్‌ను సైతం హైడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ప్లస్.. ఇదేంటి?
మీ అకౌంట్‌కు ప్రత్యేకమైన లుక్‌ను ఇవ్వొచ్చు వాట్స్‌యాప్ ప్లస్‌లోని సెట్టింగ్స్‌ను ఉపయోగించుకుని యూజర్లు తమ అకౌంట్‌కు ప్రత్యేకమైన లుక్‌ను తీసుకురావచ్చు.
వాట్సాప్ ప్లస్.. ఇదేంటి?
హెడర్, కలర్, సైజ్ ఆఫ్ ఐకాన్స్, చాట్‌లోని టెక్స్ట్, ఇమేజ్ ఇంకా కాంటాక్ట్‌లకు సంబంధించి ఫాంట్ సైజ్ ఇంకా రూపాన్ని మార్చేయవచ్చు.
వాట్సాప్ ప్లస్.. ఇదేంటి?
పెద్ద ఫైళ్లను సైతం షేర్ చేసుకోవచ్చు వాట్స్‌యాప్ ప్లస్‌లో యూజర్లు నిడివితో పనిలేకుండా ఫుల్‌లెంగ్త్ వీడియోలతో పాటు మ్యూజిక్‌ను షేర్ చేసుకోవచ్చు. కరెంట్ వర్షన్ వాట్స్‌యాప్‌లో కొంత పరిధి మేర ఫైళ్లను మాత్రమే షేర్ చేసుకునే అవకాశముంది.