Home
News

ర్యామ్ గురించి మీకు తెలియని నిజాలు

ఎవరైనా స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఇలా ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా ముందుగా అందులో స్పేస్ ఎంత వరకు వాడుకోవచ్చనే చూస్తారు.

By Hazarath Aiah

ఎవరైనా స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఇలా ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా ముందుగా అందులో స్పేస్ ఎంత వరకు వాడుకోవచ్చనే చూస్తారు. వాడే పనిని బట్టి ర్యామ్ ఆధారిత ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లు కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్లో ఇప్పుడు అనేక రకాలైన గాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. అన్నింటిలో ర్యామ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ ర్యామ్ ఆధారంగానే కొనే గాడ్జెట్ పనితీరు ఆధారపడి ఉంటుంది. అలాంటి సమయంలో ర్యామ్ గురించి చాలా క్షుణ్ణమైన అవగాహన ఉండి తీరాలి కదా..ఈ రోజు ఆర్టికల్ లో భాగంగా ర్యామ్ గురించి కొన్ని విషయాలు ఇస్తున్నాం. ఓ సారి పరిశీలించండి.

 ర్యామ్‌ పూర్తి అర్థం

ర్యామ్‌ పూర్తి అర్థం

ర్యామ్‌ అంటే ర్యాండమ్‌ యాక్సెస్‌ మెమరీ. ఇది ముఖ్యమైన హార్డ్‌వేర్‌ స్పెసిఫికేషన్‌. ఎక్కువ ర్యామ్‌తో వచ్చే గాడ్జెట్‌ ఏదైనా సరే వేగంగా పనిచేస్తుంది. ర్యామ్‌ ముఖ్యమైన పని మెమరీని అస్థిరంగా ఉంచడం. మన ఫోన్‌లో గానీ కంప్యూటర్ లో కాని ఉపయోగించే డేటాను టెంపరరీగా స్టోర్‌ చేయడమే ర్యామ్‌ చేసే పని.

ఎన్ని రకాలు...?

ఎన్ని రకాలు...?

సాధారణంగా ర్యామ్‌లు రెండు రకాలు. ఒకటి డ్యూయల్‌ లైన్‌ మెమరీ మాడ్యూట్‌. దీన్ని క్లుప్తంగా డీఐఎంఎం అంటారు. ఎక్కువగా ర్యామ్‌లను డెస్క్‌టాప్స్‌లో, సర్వర్లలో వాడుతుంటారు.

స్మాల్‌ అవుట్‌ లైన్‌ డ్యూయల్‌ లైన్‌ మెమరీ మాడ్యూల్‌

స్మాల్‌ అవుట్‌ లైన్‌ డ్యూయల్‌ లైన్‌ మెమరీ మాడ్యూల్‌

రెండో రకం స్మాల్‌ అవుట్‌ లైన్‌ డ్యూయల్‌ లైన్‌ మెమరీ మాడ్యూల్‌. వీటిని క్లుప్తంగా స్మాల్‌ డీఐఎంఎం అంటారు. ఈ పోర్టబుల్‌ సైజ్‌ ర్యామ్‌లను ప్రత్యేకించి ల్యాపీలకు, చిన్నసైజు కంప్యూటర్‌లకు వాడుతుంటారు.

 డీడీ ర్యామ్‌ అంటే..

డీడీ ర్యామ్‌ అంటే..

డీడీఆర్‌ 3 ర్యామ్‌ అనే స్పెసిఫికేషన్‌ ఇటీవల చాలా డివైజుల్లో వస్తోంది. డీడీఆర్‌ అంటే డబుల్‌ డేటా రేట్‌ అని అర్థం. అంటే ఒక్కో క్లాక్‌ సైకిల్‌కు రెండు డేటా ట్రాన్స్‌ఫర్‌ జరుగుతాయని అర్థం. టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందడంతో డీడీఆర్‌, డీడీఆర్‌2, డీడీఆర్‌3 ర్యామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో డీడీఆర్‌2 ర్యామ్‌ 240 పిన్‌లతో ఉంటుంది. పాత వాటిని అప్‌డేట్‌ చేసుకోవడానికి ఈ ర్యామ్‌ ఉపయోగపడుతుంది.

డీడీఆర్‌ 3 ర్యామ్‌

డీడీఆర్‌ 3 ర్యామ్‌

డీడీఆర్‌3 ర్యామ్‌ను 2007లో విడుదల చేశారు. డీడీఆర్‌2 తరహాలోనే డీడీఆర్‌3 డీఐఎంఎంలలో కూడా 240 పిన్‌లు ఉంటాయి. తక్కువ వోల్టేజి కెపాసిటీలో ఎక్కువ వేగంగా ఈ ర్యామ్‌ పనిచేస్తుంది.

డీడీఆర్‌ 4 లేటెస్ట్‌ ర్యామ్‌

డీడీఆర్‌ 4 లేటెస్ట్‌ ర్యామ్‌

ర్యామ్‌లలో ఇదే లేటెస్ట్‌ మోడల్‌. 240 పిన్‌లు ఉండే ఈ ర్యామ్‌ కూడా 12 వోల్టేజీ కెపాసిటీతో పనిచేస్తుంది. డీడీఆర్‌3- 1600, పీసీ 3- 12800 సెంటర్‌లలో ర్యామ్‌లను రిఫర్‌ చేస్తారు. డీడీఆర్‌3-1600 ర్యామ్‌ సెకనుకు 1600 మెగా ట్రాన్స్‌ఫర్లు చేస్తుంది. సో.. గాడ్జెట్‌ కొనుగోలు చేసే ముందు వీటి గురించి తెలుసుకొని ముందడుగు వేస్తే మంచిది.

Best Mobiles in India

English summary
Everything You Need to Know About RAM & Memory Management more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X