ఈవిఎంలను ట్యాపంరింగ్ చేయడం అసాధ్యం
Electronic Voting Machines (EVMs)లను హ్యాకింగ్ చేయడం అసాధ్యమని, అవి టాంపర్ ఫ్రూప్ తో వచ్చాయని అందువల్ల వాటిని హ్యాక్ చేయడం అసాధ్యం అని Former Election Commissioner OP Rawat తెలిపారు. ఈవిఎంలు హ్యాకింగ
Electronic Voting Machines (EVMs)లను హ్యాకింగ్ చేయడం అసాధ్యమని, అవి టాంపర్ ఫ్రూప్ తో వచ్చాయని అందువల్ల వాటిని హ్యాక్ చేయడం అసాధ్యం అని Former Election Commissioner OP Rawat తెలిపారు. ఈవిఎంలు హ్యాకింగ్ కు గరయ్యాయయని VVPAT slipsతో EVM data మ్యాచ్ అయితేనే కౌంటింగ్ జరపాలను ప్రతిపక్షాల వాదనను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది.

ప్రతిపక్షాల డిమాండ్ సరైనది కాదని ఈవిఎంలు హ్యాకింగ్ చేయలేరని EVM security protocol చాలా స్ట్రిక్ గా ఉంటుందని స్ట్రాంగ్ రూం తెరవాలంటే అన్ని రాజకీయ పార్టీల మధ్యనే అది తెరవబడుతుందని ఆయన తెలిపారు. మిషన్లను కూడా వారి సమక్షంలోనే బయటకు తీయడం జరుగుతుందని, మాక్ పోల్స్ సైతం నిర్వహించడం జరుగుతుందన్నారు.

రావత్ వివరణ
పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలను పోలింగ్‌కు సిద్ధం చేసేటప్పుడు మాక్ పోల్‌ను తిరిగి నిర్వహిస్తారని, పోలింగ్ ఏజెంట్లందరినీ ఓటు వేయాలని కోరి, ఆ తర్వాత కౌంటింగ్ జరుగుతుందని రావత్ వివరించారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ కాకుండా చూడటానికే ఈ చర్యలన్నీ తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాక్, ట్యాంపరింగ్‌కు అవకాశాలుండవని ఆయన తేల్చిచెప్పారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యే అవకాశాలున్నాయంటూ పలు ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయపడుతున్న నేఫథ్యంలో రావత్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈవీఎంలపై సందేహాలు
ఇదిలా ఉంటే కొందరు రాజకీయ నాయకులు ఈవీఎంల పని తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని వాదిస్తున్నారు. కొంతకాలంగా ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీంతో ఈవీఎంలపై సందేహాలు నెలకొన్నాయి.

ప్రముఖ అమెరికన్ ఎక్స్ పర్ట్ గెల్బ్
అయితే భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం కష్టమని ప్రముఖ అమెరికన్ ఎక్స్ పర్ట్ గెల్బ్ తేల్చారు. దీనికి ఆయన వివరణ ఇచ్చారు. ఈవీఎంలు ఆఫ్‌లైన్‌లో పని చేస్తాయని, అవి స్వతంత్ర యూనిట్లుగా ఉంటాయని తెలిపారు. అందుకే వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదన్నారు.

ఎలాంటి అనుమానాలు అవసరం లేదు
భారత్‌లో వాడుతున్న ఈవీఎంలలో ఉపయోగించిన టెక్నాలజీ నమ్మదగినదని తెలిపారు. తాను చేసిన అధ్యయనంలో ఇది స్పష్టమైందన్నారు. ఏ టెక్నాలజీ నిర్దిష్టమైనది కాదన్న గెల్బ్.. భారత్‌లో వాడుతున్న ఈవీఎంల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.

ప్రతిపక్షాల నేతలు ఆరోపణలు
ఇండియాలో ఉపయోగిస్తున్న ఈవీఎంలను మాస్ ట్యాంపరింగ్ చేయడం కష్టమని తాను చేసిన పరిశోధనల్లో తేలిందని గెల్బ్ చెప్పారు. ఇది కేవలం ఒక స్వతంత్ర ఎలక్ట్రానిక్ పరికరమని, ఇతర దేశాల్లో ఓటు వేసే విధానాలకు ఇది భిన్నంగా ఉంటుందని గెల్బ్ వివరించారు. ఈవీఎంలను పరిశీలించకుండా, ఒక సమన్వయ ప్రాతిపదిక లేకుండా ట్యాంపరింగ్ చేయడం కష్టమన్నారు.
ఇదిలా ఉంటే బీహార్, ఉత్తర్ ప్రదేశ్‌లో స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన ఈవీఎంలను తారు-మారు చేయడం జరిగిందని పలు ప్రతిపక్షాల నేతలు ఆరోపించారు. ఇలాఉండగా ప్రతిపక్షాల ఆరోపణలను, ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) తోసిపుచ్చింది.

సాంకేతికంగా చాలా నాణ్యతతో కూడినవి
అన్ని ఈవీఎంలూ స్ట్రాంగ్ రూమ్‌లలలో భద్రంగా ఉన్నాయని తెలిపింది. ఇలా ఉండగా భారత దేశంలో వినియోగిస్తున్న ఈవీఎంలు సాంకేతికంగా చాలా నాణ్యతతో కూడినవని అమెరికా నిపుణుడు గెల్బ్ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పాకిస్తాన్, దక్షిణ ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications








