Home
News

Apple mobile chip.. నాటి నుంచి నేటి వరకు!

By Bommu Sivanjaneyulu

ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను ఉత్పత్తి చేస్తోన్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో Apple ఒకటి. పది సంవత్సరాల క్రితం ఐఫోన్ పేరుతో తన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన యాపిల్ అదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రతి ఏటా సరికొత్త ఐఫోన్ వర్షన్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తోంది. తాజాగా ఈ అమెరికన్ బ్రాండ్ మూడు సరికొత్త ఐఫోన్‌లను విడుదల చేసింది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ మోడల్స్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్‌లు శక్తివంతమైన స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లతో వస్తున్నాయి.

Evolution of Apple A4 to A11 Bioni Mobile chip

యాపిల్ పరిచయం చేసే ప్రతి ఐఫోన్‌లో డిజైనింగ్ దగ్గర నుంచి స్పెసిఫికేషన్స్ వరకు అన్ని విభాగాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. యాపిల్ ఐఫోన్‌లలో సీపీయూ వ్యవస్థ అంతకంతకు బలపడుతుండటంతో ఆపరేటింగ్ సిస్టం, యాప్స్, కెమెరా విభాగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్, సామ్‌సంగ్ ఎక్సినోస్, మీడియాటెక్, ఇంటెల్ ఆటమ్, స్ప్రెడ్‌ట్రమ్, హైసిలికాన్ కైరిన్ వంటి మొబైల్ చిప్‌సెట్‌లు అందుబాటులో ఉన్నప్పటికి యాపిల్ తన యాపిల్ ఐఫోన్‌లలో సొంతంగా అభివృద్ధి చేసుకున్న Apple A series mobile chipsetలను వినియోగిస్తోంది. A series మొబైల్ చిప్‌సెట్‌లను అందుబాటులోకి తీసుకురాకముందు యాపిల్ తన ఐఫోన్‌లలో ప్యాకేజ్ ఆన్ ప్యాకేజ్ (పీఓపీ) చిప్‌సెట్‌లను ఉపయోగించేది.

Evolution of Apple A4 to A11 Bioni Mobile chip

ARM ఆర్కిటెక్షర్ ఆధారంగా రూపొందించబడే ఈ చిప్‌సెట్‌లకు పవర్ వీఆర్ గ్రాఫిక్స్ చిప్‌లను అనుసంధానం చేసేవారు. తొలిగా లాంచ్ అయిన ఒరిజినల్ ఐఫోన్ APL0098 chipsetను యాపిల్ వినియోగించింది. 412 MHz సింగిల్ కోర్ ARM11 సీపీయూ వ్యవస్థతో పాటు PowerVR MBX Lite జీపీయూ అటాచ్ అయి ఉన్న ఈ చిప్‌సెట్‌ను సామ్‌సంగ్ 90nm ప్రాసెస్ పై తయారు చేయటం విశేషం.

యాపిల్ iPhone 3GS లాంచ్ తరువాత యాపిల్ తన Ax series సిస్టం ఆన్ చిప్ (SoC)ల తయారీ పై దృష్టి సారించింది. ప్రస్తుతం ఈ సాక్‌లను ఐప్యాడ్, ఐపోడ్ టచ్ ఇంకా యాపిల్ టీవీలలో వినియోగించటం జరుగుతోంది. ఈ చిప్‌లను యాపిల్ డిజైన్ చేయగా Samsung, TSMC కంపెనీలు తయారు చేస్తున్నాయి.

Evolution of Apple A4 to A11 Bioni Mobile chip

యాపిల్ ఏ సిరీస్ నంచి విడుదలైన మొట్టమొదటి మొబైల్ చిప్‌సెట్ పేరు Apple A4. ARM Cortex-A8 CPU అలానే PowerVR 535 GPU కాంభినేషన్‌లో ఈ చిప్‌సెట్ రూపుదిద్దుకుంది. తొలత ఐప్యాడ్ ద్వారా ఈ చిప్‌సెట్‌ను యాపిల్ పరిచయం చేసింది. ఆ తరువాత ఐఫోన్ 4, ఐపోడ్ టచ్ (4వ తరం), యాపిల్ టీవీ (2వ తరం) డివైసుల్లో ఈ A4 చిప్‌లను యాపిల్ అమర్చింది. యాపిల్ ఐప్యాడ్ కోసం అభివృద్ది చేసిన A4

చిప్‌ 1GHz క్లాక్ స్పీడ్‌తో 45nm silicon chip fabrication ప్రాసెస్ పై బిల్ట్ చేయబడింది. ఐఫోన్ 4 అలానే ఐపోడ్ టచ్ (4వ తరం) డివైసుల్లో అమర్చిన A4 చిప్‌ 800MHz క్లాక్ స్పీడ్‌తో రన్ అవుతుంది.

Apple A4 చిప్‌సెట్‌కు అప్‌గ్రేడెడ్ మోడల్‌గా యాపిల్ అభివృద్ది చేసిన A5 చిప్‌సెట్ మార్చి 2011లో విడుదలైన యాపిల్ ఐప్యాడ్ 2 ద్వారా వినియోగంలోకి వచ్చింది. ఇదే ఏడాది విడుదలైన iPhone 4Sలో కూడా ఈ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. dual-core ARM Cortex-A9 CPU అలానే dual core PowerVR SGX543MP2 GPU కాంభినేషన్‌తో వచ్చిన చిప్‌సెట్‌కు NEON అని పిలవబడే SIMD ఎక్స్‌టెన్షన్ ప్రధాన హైలైట్‌గా నిలిచింది.

యాపిల్ వెల్లడించిన వివరాల ప్రకారం యాపిల్ ఐప్యాడ్ 2లో అమర్చిన A5 చిప్‌సెట్ 1GHz క్లాక్ స్పీడ్‌తో 45nm ప్రాసెస్ పై బిల్ట్ చేయబడింది. ఐఫోన్ 4ఎస్‌‌లో అమర్చిన A5 చిప్‌ 800MHz క్లాక్ స్పీడ్‌తో రన్ అవుతుంది. అదే ఏడాది కొద్ది రోజుల తరువాత యాపిల్ తన A5 చిప్‌సెట్‌ను 32 nm వేరియంట్‌కు అప్‌గ్రేడ్ చేసి యాపిల్ టీవీ (3వ తరం), ఐపోడ్ టచ్ (5వ తరం), ఐప్యాడ్ మినీ ఇంకా కొత్త వర్షన్ ఐప్యాడ్ 2లలో వినియోగించింది. ఈ చిప్‌సెట్ బ్యాటరీ లైఫ్‌ను మరింతగా పెంచటంతో పాటు 3డీ గేమ్స్‌ను మరింత ఎఫెక్టివ్‌గా తీర్చిదిద్దింది.

మార్చి 2012లో, యాపిల్ మరో A series సిరీస్ చిప్‌సెట్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. A5X పేరుతో లాంచ్ అయిన ఈ హైపెర్ఫామెన్స్ చిప్‌సెట్‌ను ఐప్యాడ్ 3లో వినియోగించటం జరిగింది. యాపిల్ A5 చిప్‌సెట్‌తో పోలిస్తే A5X రెట్టింపు అయిన గ్రాఫిక్ పవర్‌ను అందించింది. అదే ఏడాది సెప్టంబర్‌లో A6 మోడల్ చిప్‌సెట్‌ను యాపిల్ అనౌన్స్ చేసింది.

ఐఫోన్ 5 అలానే ఐఫోన్ 5సీ మోడల్స్‌లో ఈ చిప్‌సెట్‌ను వినియోగించారు. ఈ ప్యాకేజ్ ఆన్ ప్యాకేజ్ సిస్టం ఆన్ చిప్‌లో గ్రాఫిక్ పవర్ రెట్టింపు వేగాన్ని కలిగి ఉంటుంది. high-κ metal gate 32 nm process పై బిల్ట్ కాబడిన ఈ చిప్‌సెట్‌లో యాపిల్ డిజైన్ చేసిన కస్టమ్ custom ARMv7 based dual-core 1.3 GHz CPUతో పాటు 266 MHz triple-core PowerVR SGX 543MP3 GPU వ్యవస్థలు ఉన్నాయి.

అదే ఏడాది A6X చిప్‌సెట్‌ను కూడా యాపిల్ అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఈ చిప్‌సెట్‌ను అక్టోబర్ 2012లో లాంచ్ అయిన ఐప్యాడ్ 4లో యాపిల్ వినియోగించింది. A6 మోడల్ చిప్‌సెట్‌తో పోలిస్తే A6X మోడల్ రెట్టింపు వేగంతో పనితీరును నమోదు చేసింది. డ్యుయల్ కోర్ స్విఫ్ట్ సీపీయూ (1.4GHz క్లాక్ స్పీడ్)లతో పాటు క్వాడ్ కోర్ జీపీయూ (PowerVR SGX 554MP4 GPU) అలానే క్వాడ్ ఛానల్ మెమురీ సబ్ సిస్టంలు ఈ చిప్‌సెట్‌ను మరింత బలోపేతం చేసాయి. high-κ metal gate 32 nm process పై బిల్ట్ కాబడిన ఈ చిప్‌సెట్‌లను సామ్‌సంగ్ తయారు చేసింది.

2013లో యాపిల్ తన Apple A7 64-బిట్ system-on-a-chip (SoC)ను మార్కెట్లో విడుదల చేసింది. సెప్టంబర్, 2013లో విడుదలైన iPhone 5S ద్వారా ఈ చిప్ ప్రపంచానికి పరిచయమైంది. ఐఫోన్ 5ఎస్‌తో పాటు ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ 2, ఐప్యాడ్ మినీ 3 డివైస్‌లలో ఈ చిప్‌సెట్‌ను వినియోగించారు. ఏ6తో పోలిస్తే ఏ7 చిప్‌సెట్ రెట్టింపు వేగంతో యాపిల్ డివైస్‌లను ముందుకు నడిపించింది.

Cyclone పేరుతో ఈ చిప్‌సెట్‌లో పొందుపరిచిన 1.3–1.4GHz 64-bit ARMv8-A dual-core సీపీయూ, దానికి ఇంటిగ్రేట్ చేసిన PowerVR G6430 GPU వ్యవస్థలు ఐఫోన్ పనితీరునే మార్చేసాయి. ARMv8-A ఆర్కిటెక్షర్ A7 చిప్‌సెట్ రిజిస్టర్స్‌ను రెట్టింపు చేసింది. high-κ metal gate 28 nm process పై బిల్ట్ కాబడిన ఈ చిప్‌సెట్‌లను సామ్‌సంగ్ తయారు చేసింది.

యాపిల్ ఏ7 చిప్‌సెట్‌తో పోలిస్తే యాపిల్ ఏ8 చిప్‌సెట్‌‌లో సీపీయూ పెర్ఫామెన్స్ 25శాతం వేగంగానూ, జీపీయూ పెర్ఫామెన్స్ 50శాతం వేగంగానూ ఉంటుందని యాపిల్ తెలిపింది. ఈ చిప్‌సెట్‌లో 1.3–1.4GHz 64-bit ARMv8-A dual-core సీపీయూతో పాటు PowerVR G6450 GPUలు ఉంటాయి. 20 nm process పై బిల్ట్ కాబడిన ఈ చిప్‌సెట్‌లను TSMC తయారు చేసింది.

ఇదే ఏడాది అక్టోబర్‌లో Apple A8X చిప్‌సెట్‌ను యాపిల్ విడుదల చేసింది. iPad Air 2లో ఈ చిప్‌ను వినియోగించిటం జరిగింది. ఈ హైపెర్ఫామెన్స్ చిప్‌సెట్‌ యాపిల్ ఏ7 చిప్‌సెట్‌తో పోలిస్తే 40శాతం వేగంతో స్పందించగలదని యాపిల్ తెలిపింది. ఈ చిప్‌సెట్‌లో ట్రిపుల్ కోర్ సీపీయూతో పాటు ఆక్టా కోర్ జీపీయూ అలానే డ్యుయల్ ఛానల్ మెమురీ వ్యవస్థలను యాపిల్ నిక్షిప్తం చేసింది.

Apple A8Xకు తదుపరి వర్షన్ చిప్‌సెట్ అయిన Apple A9ను 2015లో యాపిల్ విడుదల చేసింది. ఈ 64-bit ARM ఆధారిత చిప్‌ను తొలత ఐఫోన్ 6ఎస్ అలానే 6ఎస్ ప్లస్ ఫోన్‌లలో వినియోగించటం జరిగింది. Apple A8 చిప్‌సెట్‌తో పోలిస్తే Apple A9 చిప్‌సెట్‌‌లో సీపీయూ పెర్ఫామెన్స్ 70శాతం వేగంగానూ, జీపీయూ పెర్ఫామెన్స్ 90శాతం వేగంగానూ ఉంటుందని యాపిల్ తెలిపింది.

ఈ డ్యుయల్ సోర్స్ చిప్‌సెట్‌ను 14 nm FinFET LPE process పై సామ్‌సంగ్ తయారు చేయగా, 16 nm FinFET process పై TSMC అభివృద్ది చేసింది. Apple A9 చిప్‌సెట్‌‌ను ఆ తరువాత విడుదలైన iPhone SEతో పాటు ఐప్యాడ్ 2017 మోడల్స్‌లో యాపిల్ వినియోగించింది.

ఇదే ఏడాది యాపిల్ తన Apple A9Xను కూడా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ చిప్‌సెట్‌ను Apple A9తో పోల్చి చూసినట్లయితే సీపీయూ పెర్ఫామెన్స్ 1.8 రెట్లు వేగంగానూ, జీపీయూ పెర్ఫామెన్స్ రెండు రెట్లు వేగంగానూ ఉంటుందని యాపిల్ తెలిపింది. ఈ డ్యుయల్ సోర్స్ చిప్‌సెట్‌ను 16 nm FinFET process పై TSMC అభివృద్ది చేసింది.

Apple A9Xకు అప్‌డేటెడ్ వర్షన్‌గా A10 Fusion చిప్‌సెట్‌ను యాపిల్ 2016లో విడుదల చేసింది. అదే ఏడాదిలో సెప్టంబర్ విడుదలైన ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ఫోన్‌లలో ఈ చిప్‌ను వినియోగించారు. సరికొత్త క్వాడ్ కోర్ డిజైన్‌తో లాంచ్ అయిన ఈ చిప్‌ను 16 nm FinFET process పై TSMC అభివృద్ది చేసింది.

ఈ చిప్‌సెట్‌కు అప్‌డేటెడ్ మోడల్‌గా A10X Fusion చిప్‌సెట్‌ను 2017 ఆరంభంలో యాపిల్ లాంచ్ చేసింది. ఈ 64 బిట్ ARM ఆధారిత చిప్‌ను జూన్ 5న మార్కెట్లో లాంచ్ అయిన ఐప్యాడ్ ప్రో 10.5, 12.9 వేరియంట్‌లలో యాపిల్ వినియోగించింది. 10 nm FinFET process పై ఈ చిప్‌సెట్‌ను TSMC అభివృద్ది చేసింది.

కొద్ది రోజుల కిత్రమే యాపిల్ తన A11 Bionic chipను మార్కెట్లో లాంచ్ చేసింది. తాజాగా విడుదలైన iPhone X, iPhone 8, iPhone 8 Plus ఫోన్‌లలో ఈ సరికొత్త చిప్‌ను అమర్చటం జరిగింది. ఈ

చిప్‌సెట్‌కు జత చేసిన సరికొత్త Neural Engine ఫేషియల్ రికగ్నిషన్‌తో పాటు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్‌లను హ్యాండిల్ చేయగలుగుతుందని యాపిల్ తెలిపింది. త్వరలో లాంచ్ కానున్న కొత్త ఐప్యాడ్‌లలో కూడా A11 Bionic chipలను ఉపయోగించే అవకాశముంది.

Best Mobiles in India

English summary
From A4 to the A11 Bionic: The Evolution of Apple ‘A’ mobile chip. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X