ఖచ్చితమైన లక్ష్యాలు.. వరుస విజయాలు.. స్వాతంత్య్రం నుంచి నేటి వరకు భారత అంతరిక్ష ప్రస్థానం..!
భారత్ దేశం స్వాతంత్ర్యం సాధించిన అనంతరం ప్రాధాన్యతలకు అనుగుణంగా అనేక రంగాలపై దృష్టిసారించింది. అందులో ప్రధానమైనది టెక్నాలజీ రంగం. అయితే క్రమంగా విద్యా, పరిశోధన కేంద్రాలను అభివృద్ధి చేసేలా అడుగులు ముందుకేసింది. ఈ తరహా ఆలోచన విధానం అనేక రంగాల్లో భారత్ అగ్రశ్రేణిలో నిలిచేందుకు కారణం అయింది. నాడు బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ISRO).. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తోంది.
భారత్‌లో 1920 ల్లోనే అంతరిక్ష పరిశోధనలు ప్రారంభం అయ్యాయి. SK మిశ్రా, సీవీరామన్, మేఘనాద్ సాహా వంటి శాస్త్రవేత్తల మార్గదర్శకాలు, అధ్యయనాలతో ప్రారంభం అయ్యాయి. 1940, 1950 నాటికి భారత్‌లో అంతరిక్ష కార్యకలాపాలు జాతీయ స్థాయిలో ఆకర్షించాయి. దీంతోపాటు వివిధ అంతరిక్ష యాత్రలకు పూర్తి స్వదేశీ టెక్నాలజీని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

1960 ల నాటికి అమెరికాతో సమానంగా కొన్ని కార్యకలాపాలు నిర్వహించింది. అయితే భారత్ అంతరిక్ష పరిశోధనల్లో కీలక మైలురాయిగా నిలిచిన భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో (ISRO) 1969 సంవత్సరంలో స్థాపించారు. అంతరిక్ష శాస్త్ర పరిశోధన, గ్రహాల అన్వేషణను కొనసాగిస్తూ అంతరిక్ష సాంకేతికత అభివృద్ధి చేయడం ఇస్రో ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటిగా ఉంది.
అనంతరం ఇస్రో అనేక ప్రయోగాలను చేపట్టింది. రష్యా సాయంతో 1975 సంవత్సరంలో తొలి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించింది. అప్పటికి భారత్‌లో సొంతంగా రాకెట్‌ను ప్రయోగించే వనరులు అందుబాటులోకి లేకపోవడంతో రష్యా సాయంతో మొట్టమొదటి ప్రయోగాన్ని చేపట్టింది. అంతరం క్రమంగా ఇస్రో తన సామర్థ్యాలను పెంచుకుంది.
భూ పరిశీలన కోసం భాస్కర-1, భాస్కర -2 ఉపగ్రహాలను ప్రయోగించింది. 1980 సంవత్సరంలో ఇస్రో సొంత లాంచ్ వెహికల్ ద్వారా SLV-3 ద్వారా రోహిణి-1 ను ప్రయోగించింది. దీంతో సొంత రాకెట్ ప్రయోగ సామర్థ్యాలు కలిగి ఉన్న కొన్ని దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. అప్పటి నుంచి ఇస్రో భారత్ సహా ఇతర దేశాల నుంచి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది.
అనంతరం అనేక ప్రయోగాలతో ఇస్రో తన సత్తాను చాటింది. 2013లో తొలి ప్రయత్నంలోనే మంగళయాన్ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఇందులో భాగంగా అంగారక గ్రహం కక్ష్యలోకి రాకెట్‌ను పంపింది. తర్వాత చంద్రయాన్ ప్రయోగాలతో భారత్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం అయింది. ప్రపంచం అంతా భారత్ వైపు చూసేలా చేసింది.
చంద్రయాన్ మిషన్ లో భాగంగా విక్రమ్ ల్యాండ్ ను చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో విజయంవంతంగా ల్యాండింగ్ చేసింది. అనంతరం ప్రజ్ఞాన్ రోవర్ సాయంతో చంద్రుని ఉపరితలంపై అనేక కీలక పరిశోధనలు చేసింది. దీంతోపాటు భవిష్యత్ ప్రయోగాలపై కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది.
మానవ సహిత అంతరిక్ష యాత్రలు, అంతర గ్రహ అన్వేషణ సహా గగన్‌యాన్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు కమ్యూనికేషన్, నావిగేషన్ సహా భూ పరిశీలన కోసం అధునాతన ఉపగ్రహ వ్యవస్థలపై పనిచేస్తోంది. సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవడం సహా పరిశోధనల ఫలితాలను పంచుకోవడం కోసం అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలతో పనిచేస్తోంది. ఇందులో వాతావరణ మార్పు, విపత్తు నిర్వహణ వంటి సవాళ్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








